-
కొవ్వొత్తి వేడికోలు … లీ జూ ఫెంగ్, సింగపూర్ కవయిత్రి
(ప్రభూ!) నా వయసు కరిగిపోతున్న కొద్దీ నన్ను సరికొత్త పనికి నియోగించుకో నీ ముందుకి చాచిన అరచేతిలో నన్నుంచు, అప్పుడు ఇద్దరికి తోవచూపించగలిగేలా; అలాగ, కాలక్రమంలో ఈ దీప కాంతి నే జాచినట్టే ముందుకి సాచిన మరో చేతిమీద పడేలా. . లీ జూ ఫెంగ్ మే 13, 1946 సింగపూర్ కవయిత్రి . Candlesong . As my years burn down you put me to new use, place me upon the…
-
సముద్రంలో… క్రిస్టినా రోజేటి, ఆంగ్ల కవయిత్రి
సముద్రం ఎందుకు ఎప్పుడూ అలాఘోషిస్తుంటుంది? ఆకాశం అందనంతదూరంలో ఉందేమో, అది అలా ఘోషిస్తుంది, అందుకే చెలియలకట్ట మీద తెగ విసుక్కుంటుంది; భూమ్మీది ఒడ్లు ఒరిసిపాడే సమస్తనదులూ సముద్రపు ఆర్తిని తీర్చలేవు. ఇంకా దాహం అంటుంది. ఎన్నడూ శోధింపబడని దాని భూతలం మీద అద్భుతమైన అందాలు దాగున్నాయి; ఏ సంపర్కమూ లేని అపురూపమైన పుష్పాలు, లవణాలూ సింహపర్ణి పూలలా బ్రతకడానికి సరిపడా, వ్యాపించి, వృద్ధిచెంది బతకగలిగేలా. చిత్రమైన వంపులతో, మచ్చలతో, మొనలతో శంఖులు వెయ్యికళ్ళున్నట్టు ఒకదానిమీద ఒకటి పేరుకుని…
-
వేదనా గీతాలు… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి
మొన్న రాత్రి లెనాక్స్ అవెన్యూలో పాలిపోయి, మసకబారిన పాత గాస్ దీపం ప్రక్కన. స్వరాల్ని కుంచించి మత్తుగా కూనిరాగం తీస్తూ ముందుకీ వెనక్కీ కమ్మని పాటతోపాటు ఊగుతూ ఒక నీగ్రో పాట వాయించడం విన్నాను. ఆ వేదనా గీతపు స్వరానికి … అతను చాలా తీరుబడిగా ఊగేడు… చాలా తీరుబడిగా తూగేడు… ఆ దంతపు మెట్లమీద తన నల్లని చేతులతో పాపం! ఆ పాత పియానో మాధుర్యంతో కేరేలా చేసేడు! ఆహ్! ఎంత అందమైన గీతం! ఆ…
-
ఆఫీసు స్నేహాలు … గవిన్ ఏవార్ట్, బ్రిటిషు కవి
ఈవ్ కి హ్యూ అంటే తగని ప్రేమ హ్యూ కి జిమ్ అంటే చాలా మక్కువ. ఛార్లెస్ కి ఎవరితోనూ పెద్దగా పడదు ఛార్లెస్ అన్నా ఎవరూ ఎక్కువ ఇష్టపడరు. మైరా ప్రేమలేఖలు టైపు చేస్తూ కూచుంటుంది తన అందమైన పియానో కళాకారిణి వేళ్ళతో. ఫ్రాన్ నించి వీచే అపూర్వమైన సుగంధానికి డిక్ స్వర్గాన్ని ఊహిస్తూ తన్మయమౌతాడు. నికీ తన కళ్ళనీ వంపుల్నీ హొయలుగా నడుస్తూ ప్రకటిస్తుంటుంది క్లైవ్ మాటాడే ద్వంద్వార్థాలకి ప్రతివారూ పగలబడి నవ్వుతుంటారు. అదుపులేని కోరిక వెర్రితలలు వేస్తుంది, కానీ, అందరినీ…
-
రైలుపెట్టెలోంచి… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
యక్షిణుల కన్నా వేగంగా, మంత్రగత్తెలకన్నా వడిగా, గుట్టలూ, ఇళ్ళూ, కంచెలూ, కందకాలూ; యుద్ద్ధంలో సేనలు దాడి చేస్తున్నట్టు పొలాల్లోంచి, గుర్రాలు, పశువుల మధ్యలోంచి; కొండలూ, మైదానాల వింతలన్నీ తరుముకొస్తున్న చిక్కని వర్షంలా పరిగెడుతునాయి; రెప్పపాటులో రంగులేసిన స్టేషన్లు మళ్ళీ కనిపించకుండా మాయమౌతునాయి. అక్కడో కుర్రాడు చూడానికి కష్టపడి ఎగబాకుతున్నాడు ముళ్ళకంపల్ని తనొక్కడూ పక్కకి తొలగించుకుంటూ; ఇక్కడొ దేశదిమ్మరి నిలబడి తేరిపారి చూస్తున్నాడు; అడివిపూలని మాలలల్లడానికి పచ్చని తీగ అదిగో! రోడ్డు మీద పరిగెత్తే గూడుబండి ఇదిగో మనుషులతో…
-
ఆదర్శం… జేమ్స్ ఫెన్టన్, ఇంగ్లీషు కవి
నేను వచ్చింది ఇక్కడనుంచి నేను వెళ్ళినది ఈ త్రోవ. ఇది చెప్పడానికి కష్టమూ కాదు అవమానకరం అంతకన్నా కాదు. వ్యక్తిత్వం వ్యక్తిత్వమే. అదేమీ తెర కాదు. ఒక వ్యక్తి తనేమిటో తప్పకుండ గౌరవించాలి. ఇదీ నా గతం దాన్ని నేను వదులుకో లేను. ఇది కష్టమే. కానీ, ఇదే ఆదర్శం. . జేమ్స్ ఫెన్టన్ 25 April 1949 ఇంగ్లీషు కవి, సాహిత్య విమర్శకుడు. చిన్న చిన్న పదాలతో, ఆత్మవంచన చేసుకోవడాన్ని (Hypocrisy)…
-
సానెట్II … జార్జి శాంతాయన, స్పానిష్- అమెరికన్
నీతోపాటే నాలో కొంతభాగంకూడా మరణించింది. నా మనో జన వనంలో శీతగాలి ఒక చెట్టును మోడుని చేసింది. ఇక మరి అది ఎన్నడూ పచ్చదనానికి నోచుకోదు. గుడీ, చలికాగేపొయ్యీ, ఊరి రోడ్డూ, సముద్రతీరమూ, తాము కోల్పోయిన స్నేహానికి అలవాటుపడుతున్నాయి. మరొకరు, నేనెంతకోరుకున్నా, దొరక లేదు, ఒక్క రోజుకే, నే నెంతో ముసలివాడినయిపోయాను. అయినా, నేను నాజ్ఞాపకాలని పదిలపరచుకుంటాను… నీ ఔదార్యం, లేతహృదయాలకిచ్చే చనవూ నీస్నేహాన్ని పొందగలిగే గౌరవమూ; ఒకప్పుడు ఇవి నావి, నాజీవితం వాటితో వన్నెకెక్కింది. ఇందులో…
-
లాయర్లకి చాలా ఎక్కువ తెలుసు…కార్ల్ సాండ్ బర్గ్… అమెరికను కవి
బాబ్! లాయర్లకి చాలా ఎక్కువ తెలుసు. వాళ్ళు జాన్ మార్షల్ పుస్తకాలకు సహపాఠులు. వాళ్లకి అన్నీ తెలుసు, చనిపోయినవాడు ఏమిటిరాసేడో బిగుసుకున్న మృతహస్తం, కూలుతున్న వేలి కణుపులూ, మెత్తగా, తెల్లగా పొడిలా రాలుతున్న చేతి ఎముకలూ. లాయర్లకి బాగా తెలుసు చనిపోయినవాడి మనసులోని మాట ఏమిటో. బాబ్! గీచి గీచి బేరమాడే లాయర్ల మాటల్లో ‘అయితే’లు, ‘కానీ’లు, ‘అయినప్పటికీ’లు సులభంగా జారుతాయి. చాలా ‘ఇంతకుముందు చెప్పినప్పటికీ’లు … రావడానికీ పోవడానికీ చెప్పలేనన్ని ద్వారాలు. బాబ్! లాయర్లు పని…
-
ప్లాట్ ఫారం పిల్లలు… సీమస్ హీనీ, ఐరిష్ కవి
వేస్తున్న రైలురోడ్డుపక్క మట్టిగుట్ట ఎక్కేం మేము మా కళ్ళూ … టెలిఫోను స్థంభాలమీది పింగాణీ కప్పులూ… మెరుస్తున్న తీగలతో సమతలంలో ఉన్నాయి చేతితో అలవోక గీసిన గీతలా తూర్పునుండి పడమరకి మైళ్ళకు మైళ్ళు సాగిపోయాయి… పిచ్చుకల బరువుకి వాలిపోతూ. మేం పిల్లలమి, తెలుసుకోవలసినది మాకేం తెలీదు అనుకుంటున్నాం. మెరిసే నీటి బిందువుల రూపంలో మాటలు తీగెల్లోంచి ప్రవహిస్తాయనుకున్నాం. ఆకాశపు అందాలను తనలో నింపుకున్న ప్రతి తీగా, దాని మీది తళతళలూ, మేమూ అంతా…
-
పానశాల … జలాలుద్దీన్ రూమి, పెర్షియన్ కవి
రోజల్లా దానిగురించి ఆలోచిస్తాను, రాత్రయేక చెబుతుంటాను. నేను ఎక్కడినుండి వచ్చేను, నేను ఇక్కడ చెయ్యవలసినదేమిటి? నాకైతే ఏమీ తెలియదు. నా ఆత్మ మాత్రం ఎక్కడిదో… అది మాత్రం నిశ్చయం, నేను చివరకి అక్కడకి చేరుకోవాలనుకుంటున్నాను. ఈ తాగుడు అలవాటయింది వేరే పానశాలలో. నేనక్కడికి చేరుకున్నానంటే, నాకు మత్తు పూర్తిగా వదులుతుంది. ఈ మధ్యకాలంలో నేను ఖండాంతరం నుండి వచ్చి పక్షిశాలలో కూర్చున్న పక్షిలా ఉన్నాను, నేను ఎగిరిపోవలసిన రోజు దూరంలో లేదు. కానీ, ఎవరది…