అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మార్చి 29, 2014

    ముగింపు… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కి, అమెరికను

    మనమందరం విరిసి ఉండవలసిన వేళలో విరియడానికి ఎన్నడూ తొందరపడని గులాబుల్లాంటి వాళ్ళమి ఎంతగా అంటే చివరికి సూర్యుడు కూడా ఎదురుచూసి చూసి విసిగెత్తిపోయేడేమోననిపిస్తుంది. . ఛార్ల్స్ బ్యుకోవ్ స్కి, ఆగష్టు 16, 1920 – మార్చి 9, 1994 జర్మన్-అమెరికను కవి . . Finish . We are like roses that have never bothered to bloom when we should have bloomed and it is as if the sun…

  • మార్చి 28, 2014

    Unrelenting Drizzle… Nanda Kishore, Telugu, Indian

    As the wind blows off the roof, I run after the wheeling palm leaves… The delight at the gust of rain-borne wind Evaporates in no time.   As the waters enter the house, I try bailing out with utensils. The indulgence of rain drops Really takes me to my wit’s end.   One should only…

  • మార్చి 27, 2014

    మార్చలేనిదిగా మారు … రూమీ, పెర్షియన్ కవి

    ఏ అద్దమూ మునపటివలె ఇనప పలకగా మారలేదు; ఏ రొట్టే తిరిగి గోధుమ గింజగా మారలేదు! సారాయి నుండి మళ్ళీ ద్రాక్షగుత్తులు నువ్వు సృష్టించలేవు, ఒక సారి త్రుంచిన పువ్వుని లతకి పూర్వంలా అతికించలేవు! తన కొలిమిలో జీవితాన్ని పరివర్తనలేని దానిగా మార్చనీ, భూమిమీద నిన్నొక అనశ్వరమైన వెలుగుకిరణంగా తీర్చనీ. . జలాలుద్దీన్ రూమీ 1207- 1273 ప్రముఖ పెర్షియన్ సూఫీ కవి. . .  Change to the Unchangeable! . No mirror becomes…

  • మార్చి 26, 2014

    విహారనౌక… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

    కడకు ఇక్కడ విశ్రమిస్తున్న ఈ ఓడ ఒకప్పుడు బలమైన పరుశువులూ, గావాయి గలది; గాలి ఎప్పుడు ఎలా వీచినా విహారానికీ, దూరయాత్రకీ సిద్ధంగా ఉండేది. ఇప్పుడంటే ఒక ప్రక్కకి ఒరిగి రికామీగా ఉంది గలగలపారుతున్న ప్రవాహంతో పరుగులెత్తడం మరిచి. అయినా, దీనికి గతవైభవపురోజులున్నై; అప్పుడు అందమైన పడుచులు పూలు తెచ్చి దీని ముందరితట్టునలంకరించి, తలవరుస శుభ్రపరిచేవారు కలలప్రపంచాల్ని తమతో మోసుకుపోతూ; కొన్ని వేల గాథలు చెప్పగలదిది… కానీ, మనసులో దాచుకోవడమే దానికి మహా ఇష్టం. ఓ నా చిన్నారి బాలికా!…

  • మార్చి 25, 2014

    మంచి కవిత … తుకారాం, మరాఠీ కవి

    ఒక మంచి కవిత రాజభవనంలో గోడకి కన్నం కనుక్కోడం వంటిది. ఎవడికి ఏమిటి కనిపిస్తుందో ఎవడు చెప్పగలడు? . తుకారాం 1577–1650 మహరాష్ట్ర భారతీయ కవి. . A Good Poem . A good poem is like finding a hole in the palace wall– never know what you might see. . Tukaram  1577–1650 Marathi, Indian.

  • మార్చి 24, 2014

    Death Sentence … Viswanatha Satyanarayana, Indian

    Telugu Original: Uri  (Published in Anandavani)  “You have sentenced me to death; and now ask me to say whatever I want to say. There would be some meaning if you had asked me before passing the sentence. Now, it makes no difference whether or not I say what I wanted to say. But there is…

  • మార్చి 23, 2014

    కొండ పూలు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    వసంతంలో మల్లెల్ని అడిగాను అతని మాటలు నిజమేనా అని, చక్కగా, తెల్లగా  విరబూచిన మల్లెలకి అన్నీ తెలుసు.   పొలాలన్నీ బీడుపడి వివర్ణమయాయి భీకరమైన శరదృతుప్రభావానికి. ఇన్ని పారిజాతాలున్నాయి గాని, ఒక్కదానికీ తెలీదే!  . సారా టీజ్డేల్, August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . .   Wild Asters .  In the spring I asked the daisies   If his words were true,…

  • మార్చి 22, 2014

    సంతకం చేసిన హస్తం … డిలన్ థామస్, వెల్ష్ కవి

    కాగితం మీద సంతకం చేసిన హస్తం ఒక నగరాన్ని పడగొట్టింది, సర్వాధికారాలు గల ఐదువేళ్ళూ ఊపిరిని కప్పం కట్టమన్నాయి ఒక దేశజనాభా సగానికి తగ్గించి, మృతులప్రపంచాన్ని రెట్టింపుచేసింది, ఈ ఐదుగురు రాజులూ, మరో రాజుని మట్టుపెట్టారు. ఆ శక్తిమంతమైన హస్తం వాటమైన భుజానికి చేర్చుతుంది వేళ్ళకణుపులు సున్నంతో బిరుసెక్కాయి; ఒక బాతు ఈక కలం హత్యల్ని పరాకాష్ఠకి తీసుకెళ్లింది అది వాక్స్వాతంత్ర్యానికి భరతవాక్యం పలికింది.  ఒడంబడికపై సంతకం చేసిన హస్తం ఒక ఆవేశాన్ని రగిలించింది, కరువు విజృంభించింది,…

  • మార్చి 21, 2014

    మనసుతో… జాన్ థామస్

    వేసవిలో వర్షంలా రోజులిట్టే ఇంకిపోతాయి, కాలంతో పాటే నిన్ను విడిచిన బాధా  పలచనౌతుంది ఇంద్రియాలు వాటి జ్ఞానాన్ని కోల్పోయి పరిణామాలు మసకబారుతాయి. బొమ్మలు ఏ జ్ఞాపకాలూ నిలుపుకోవు ఏ విషాదాలూ ఊడిపడవు నిన్ను ప్రేమిస్తున్నానన్న ఆనందాన్ని ఇక ఆస్వాదించగలిగే స్థితీ ఉండదు. నీ సుగంధాన్ని గాలిలో నే పసిగట్టే దాకా, నా ప్రేమలాగే స్వచ్ఛమైన తెమ్మెర, నా ఏకాగ్రతని భగ్నం చేసి నన్ను సందేహంలో ముంచెత్తి ఒక లిప్తపాటు నా గుండెకొట్టుకోవడం మర్చిపోతుంది. చాలా కాలం అయింది…

  • మార్చి 20, 2014

    వీనస్… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి

    ఓ వీనస్! పగలు గతించింది మెత్తగా మౌనంగా రాలుతోంది మంచు ఇప్పుడు ప్రతిపువ్వు మీదా కన్నీటిబొట్టే స్వర్గం వేరెక్కడా లేదు, ఉంది నీ చెంతనే! ఓ వీనస్! అందమైన సంధ్య మమ్మల్ని నెమ్మదిగా, తెలియకుండా కమ్ముకుంటోంది దివా రాత్రాల కలయిక వేళ పసిపాప ఊపిరితీస్తున్నట్టు ఉంది. ఓ వీనస్! మంచుకురిసిన నేలమీద రాలిపడిన పువ్వు నిద్రిస్తోంది మంచు సన్నని జల్లుగా కురుస్తుంటే చుట్టూ ప్రకృతి శ్వాసిస్తున్నట్టు ఉంది. ఓ వీనస్! వినీలాకాశంనుండి మిణుకుమంటున్న నీ కాంతికిరణం అలసిన…

←మునుపటి పుట
1 … 154 155 156 157 158 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు