Unrelenting Drizzle… Nanda Kishore, Telugu, Indian

As the wind blows off the roof,

I run after the wheeling palm leaves…

The delight at the gust of rain-borne wind

Evaporates in no time.

 

As the waters enter the house,

I try bailing out with utensils.

The indulgence of rain drops

Really takes me to my wit’s end.

 

One should only witness skies emptying!

Tut!

No matter whether you stand or sleep,

You cannot avoid getting wet.

*

My pa goes out to break the farm bunds

Yes! Otherwise, at the time of weeding

It will be hell of a job to uproot the grass.

 

My ma

tries to keep the hearth dry and warm;

For, even to stand idle

One needs few gulps of gruel.

 

The wet swallows and the young sibling

Chirp silently grinning in glee…

while we struggle to plug the leaks on one side,

We have to put up with their nuisance on the other.

 

In the crevice of the hand-mill

a water-snake sneaks and peeps through.

Who cares whether it is Spring

Or, some damn thing.

 

Where under the rafters

These rats hid all along, no one knows.

Snakes swim across in rounds … about the house.

 

Whatever the government records show

About the working of its schools,

They close the stream Morancha overwhelms.

 

Nothing happens to cattle and buffalo

It’s only us humans

That shiver with cold.

 

Whether it takes a year or lifetime

Don’t care

But I must somehow arrange

for a tiled-roof.

*

Everything including the Rice-bag

Has gone wet.

How to tear paper and make boats of it?

 

For the reverberations of every thunder

walls slowly give way coming off in flakes and clods…

Where is the time to prop, patching them up with clay?

.

Nanda Kishore,

Telugu,

Indian.

.

Image courtesy: Nanda Kishore
Image courtesy: Nanda Kishore

.

ముసురు

ఇల్లెగిరిపోతుంటే
కమ్మలెంకబడి ఉర్కిన-
ఈదురుగాలికి పుట్టిన సంబరమంతా
దెంకపాయె.

నీళ్ళింట్లకొస్తే
గిన్నెల్తోటి ఎత్తి పారబోసిన-
చినుకుల్జేసిన గావురానికి
యాష్టకొచ్చె.

ఇగ ముసుర్లు పడ్తుంటె సూడాలె…
నీ యవ్వ!
నిలుసున్న పండుకున్న
ఉరుస్తుంటే తడుసుడేనాయె
***

మా అయ్య ఒడ్లు తవ్వ పోతడు
అవ్! లేదంటే  మళ్ళ కలుపప్పుడు
గడ్డి పీక్కుంట సావాలె.

మా అవ్వేమో పొయ్యిని
పొడిజేస్తాంటది.
మరి-ఉత్తిగ నిలుసోవాలన్నా
ఇంత గంజి తాగాల్నాయె.

తడిసిన పిశ్కలూ, తమ్ముడూ
ఇననడకుండా ఒకటే కిచకిచ-
యీటి సప్పుడేందో
ఇళ్ళుకప్పుతాంటే మధ్యల…

ఇసుర్రాయి సందులోన
ఇకిలించుకుంటూ వానకోయిల-
వసంతమో పాడో
ఏమో ఎవనికెర్క.
***

వాసాలల్ల ఎల్కలు
ఎక్కడదాక్కుంటయో తెల్వది.
పాములు ఇంటిసుట్టే తిర్గుతుంటయ్.

సర్కరోడి లెక్కలు
సదువుతనో లేదో
మోరంచకి బళ్ళు బందైపోతయ్.

బర్లకీ ఎడ్లకీ తడిశినా ఏంగాదు.
సలి వణుకు మాకె…
మనుషులకె.

ఏడాదో, జీవితమో
ఏమైనా పర్వానై
గూనలో రేకులో…
సంఫాయించాలె ఎట్లనన్న…
***

బియ్యంసంచి కాన్నించి అన్ని తడిశిపాయె-
కాగితాల్జించి
పడవలెట్లెయాలె?

ఉరుమురుకి పెళ్ళరాలనె బట్టె-
రేగడిమన్ను దెచ్చి
గోడెప్పుడుపూయాలె?
.
నందకిషోర్

“నీలాగే ఒకడుండేవాడు” కవితా సంపుటినుండి

(Review of performance of this Blog for 2013: http://wp.me/p12YrL-3eZ)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: