అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మే 10, 2014

    ఒక నక్క మీ పెంపుడు కోళ్ళు ఎత్తుకు పోతుంది, సర్ … జాన్ గే , ఇంగ్లీషు

    ఒక నక్క మీ పెంపుడు కోళ్ళు ఎత్తుకు పోతుంది, సర్ ఒక వేశ్య మీ ఆరోగ్యాన్నీ, ఆస్థినీ, సర్ మీ అమ్మాయి కేవలం మీ ఇనప్పెట్టె ఎత్తుకుపోవచ్చు, సర్ మీ భార్య మీ మనశ్శాంతినీ, ఒక దొంగ మీ వస్తువుల్నీ, వాహనాల్నీ, సర్. కానీ ఇదంతా కేవలం ఎత్తుకుపోవడం గురించి. మనశ్శాంతైనా, ఆస్థైనా, ఇనప్పెట్టైనా, కోళ్ళైనా;  కాని అదెప్పుడో రాసిపెట్టి ఉంది సర్, ఒక వేళ న్యాయవాదికి గాని ఫీజు చెల్లించాల్సి వస్తే అతడు మీ సర్వ…

  • మే 9, 2014

    ముదిమి… ఎడ్మండ్ వేలర్, ఇంగ్లీషు కవి

    గాలులు అలసి శోషించి, సాగరాలు ప్రశాంతంగా ఉన్నాయి; ఉద్రేకాలు చల్లబడినపుడు మనమూ అంత ప్రశాంతంగానూ ఉంటాము. క్షణభంగురాలై, నశించిపోయేవాటిగురించి గర్వించడం ఎంత వృధానో మనకి తెలుస్తుంది. ముదిమి స్పష్టంగా చూడగల ఆ శూన్యాన్ని యవ్వనంలో ఉన్నపుడు ప్రేమ పొరలు మసకబారుస్తాయి. ఎన్నో ఎదురుదెబ్బలు తిని, శిధిలమైన ఈ అంధకారపు ఆత్మ గృహం కాలం చేసిన రంధ్రాలలోంచి కొత్తవెలుగులు లోనికి పోనిస్తుంది; వాళ్ళ శాశ్వత నివాసానికి దగ్గర చేరుతున్నకొద్దీ, మనుషులు తమ బలహీనతల వల్ల, జ్ఞానవంతులౌతారు. ఈ శరీరాన్నీ,…

  • మే 7, 2014

    పసిపాప … జార్జ్ మేక్డొనాల్డ్, స్కాట్లండు

    ప్రియమైన పాపాయీ, నువ్వెక్కడనుండి వచ్చేవు? సర్వవ్యాప్తమైన ప్రకృతినుంచి ఇక్కడికి.   నీకు ఆ చక్కని నీలి కళ్ళు ఎలా వచ్చేయి? దారిలో నే తెరుచుకొచ్చిన ఆకాశపు తెరనుండి.   మరి ఆ కళ్ళలో వెలుగుల మిలమిలలెక్కడివి? చుక్కల తునకలు కొన్ని అందులో చిక్కుకున్నందుకు.   ఆ చిరు కన్నీటి చుక్క ఎక్కడినుంఛి వచ్చింది? నే నిక్కడికొచ్చేసరికి నాకోసం ఎదురుచూస్తోంది.   నీ నుదురు అంత మెత్తగా, ఎత్తుగా ఉందెందుకు? నేను పక్కనుండి వెళుతుంటే ఒక మృదు హస్తం…

  • మే 6, 2014

    నావిక ప్రియునికి… అజ్ఞాత కవి

    నేనెప్పుడూ నీకోసం తపించడమేగాని పిసరంతైనా దరిచేరలేనా? నేను మొరపెట్టుకోవడమే గాని, నా మాట వినిపించుకోవడం ఉండదా? అయ్యొ! కనీసం అలా కాదు, కాదులే అనైనా చెప్పు.  అలా ముంగిలా ఊరుకోకు. నీ మగతనం ఉట్టిపడే గొంతుకతో చెప్పు : నేను వస్తున్నానని. అప్పుడు నిన్ను చూడలేకపోయినా  నా మనసు ఊరటచెందుతుంది నువ్వు వస్తావన్న నమ్మకంతో. నీ మాటే ప్రమాణం.  నువ్వు బ్రతికుంటే. ఉధృతంగా ఎగసిపడే ఈ కెరటాలు నన్ను భయపెడుతున్నాయి ఆలోచనలను ముందుకీ వెనక్కీ కుదిపి భయపెడుతూ.…

  • మే 4, 2014

    వీరుడు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

    “తను కోరుకున్నట్టుగా జాక్ వీరమరణం పొందాడు” అంది తల్లి, తను చదువుతున్న ఉత్తరాన్ని మడిచిపెడుతూ. “కలనల్ చాలా అద్భుతంగా రాస్తాడు,” అలసిన ఆమె గొంతుకి ఏదో అడ్డుపడి గద్గదమైపోయింది. సగం తలపైకెత్తి,” మా లాంటి తల్లులము అటువంటి వీరపుత్రులను చూసి గర్వపడతాం.” ముఖం వాలిపోయింది.  బ్రదర్ ఆఫీసరు మౌనంగా బయటకి నడిచేడు. అతను ఆ అమాయకపు తల్లికి పెద్ద అబద్ధాలు చెప్పేడు వాటిని, సందేహం లేదు, ఆమె జీవితకాలం నెమరువేసుకుంటుంది. అతను మాటాడడానికి మాటలు వెతుక్కుంటూ, గొణుగుతుంటే,…

  • మే 3, 2014

    పరస్పర విరుద్ధమైన ఆదేశాలు… కెంట్ ఎం. కీత్, అమెరికను.

    మనుషులు  అతార్కికులు, అవివేకులు, స్వార్థపరులు. అయినా సరే, వాళ్ళని ప్రేమించు.   నువ్వేదైనా మంచిపని చేస్తే దానివెనక నీకేదో స్వలాభం ఉందని నిన్ను నిందిస్తారు. అయినా సరే, మంచిని చెయ్యి.   నువ్వు విజయం సాధించి నిజమైన శత్రువులనీ, కపట స్నేహితుల్నీ సంపాదించుకుంటావు. అయినా సరే, విజయం సాధించు. నువ్వు ఇవాళచేసిన ఉపకారాన్ని రేపటికి మరిచిపోతారు. అయినా సరే, ఉపకారం చెయ్యి. నిజాయితీవల్ల, నిజంచెప్పడం వల్ల నువ్వు నష్టపోవచ్చు. అయినా సరే, నిజాయితీగా ఉండి నిజమే చెప్పు. గొప్ప…

  • మే 2, 2014

    నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసిన క్షణం… పుష్కిన్, రష్యను కవి

    నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసిన ఆ క్షణం ఇంకా గుర్తే: నా కళ్ళు అప్పుడే అలా ఎత్తి చూశాను, నువ్వు అక్కడ ఉన్నావు, అపురూపమూ అరుదూ ఐన సౌందర్య రహస్యం లిప్తకాలం కళ్ళముందు కదిలివెళిపోయిన అనుభూతి… మూగ పరివేదనతో, నిరాశతో లోపలే ప్రార్థించుకున్నాను. ప్రపంచమెప్పుడూ వృధా జీవిత ప్రయాసలనే గౌరవిస్తుంది. ఊరడించే నీ పలుకులని చాలకాలం  మనసులో భావించుకున్నాను, నీ రూపం నా కలలని చాలకాలం వేధించింది. కాలం గడిచిపోయింది. ఒక భయంకరమైన తుఫాను నాకై నేను పదిలంగా…

  • మే 1, 2014

    వీడిపోవుట … A C స్విన్ బర్న్, ఇంగ్లీషు కవి

    గీతికలూ! పదండి ఇక్కడనుండి పోదాం; ఆమె ఇక వినదు. మనం ఇక్కడ నుండి నిష్క్రమిద్దాం నిర్భయంగా; మౌనంవహించండి, ఎందుకంటే మనకిష్టమైన విషయాలూ, జ్ఞాపికలగురించి పాడే సమయం ముగిసిపోయింది. మనం ఆమెని ప్రేమించినంతగా నన్నుగాని,మిమ్మల్ని గాని  ఆమె ప్రేమించదు. నిజం, మనం ఆమె చెవులకి గంధర్వగానం వినిపించినా ఆమె వినేస్థితిలో లేదు. లేవండి! లేచి ఇక్కడనుండి పోదాం; ఆమె కనీసం గుర్తించలేదు. పెద్ద పెద్ద గాలులు పోయే సముద్ర తటివైపు పొదాం. అక్కడ ఇసకా, నురుగూ ఎగురుతుంటై; మనకెవరు…

  • ఏప్రిల్ 30, 2014

    అనుకోకుండా… పాట్రిక్ మెగిల్, ఐరిష్ కవి

    ఈ చిన్ని కవితలు, మోటుగా వినసొంపు లేకుండా ఉంటే ఉండనీండి, వీటిని నేను పూరిపాకలొ, సోమరిపోతు ధనికుల భవంతులచెంత లోతైన మురికి గుంటలో, బోర్లపడిన బొక్కెన ఆదర్శంగా రాసేను.  అదిగో ఇంజన్లు పరిగెత్తే రాదారుల్లోనో, హాయైన రాచబాట మీదనో, దీనికి మీరు తగిన గుర్తింపు ఇవ్వకపోవచ్చు, మీ అనుమానం తీర్చడానికి, ఈ కవితల్ని రాసింది నేనే, భగవంతుడు సాక్షిగా, ఆ విషయం నాకే తెలుసు! వాటిని ఏ పెనం పక్కనో, లేదా ఏ వణికిస్తున్న ఆరుబయటనో రాసేను,…

  • ఏప్రిల్ 29, 2014

    శాశ్వతత్వానికి వ్యతిరేకంగా .. జాన్ ఎం. ఫోర్డ్, అమెరికను

    క్రిమి సర్పిలాకారంగా బల్లని దొలుచుకుంటూ పోతుంది తాను చేసిన కన్నంలో  ఉండే ఆ కర్ర పొడే, కప్పుడు ఆ బల్లని దృఢంగా, ఏకాండిగా ఉంచేదని దానికి తెలీదు; అకస్మాత్తుగా ఒక స్ఫటికం నేలమీదపడి పగులుతుంది; ఎలక్ట్రాన్లు వాటిత్రోవని చాలా నేర్పుగా తెలుసుకుంటాయి, ద్రవ్యరహిత ప్రవాహం పొగవ్యాపించిన జాడలననుసరిస్తుంది; ఒకప్పుడు అందరినాలికలమీద ఆడిన ప్రేమికుల పేర్లు తెలియకపోయినా నీకు ఇపుడు పెద్దనష్టం లేదు; అదే చిత్రమంటే. ఈ సృష్టి క్రమంగా నశిస్తుంది. అది అలాగే సృష్టించబడ్డది. కాని జ్ఞపకశక్తి…

←మునుపటి పుట
1 … 150 151 152 153 154 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు