అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 26, 2014

    Zero Degree… Mohan Rushi, Telugu, Indian

    He never entertained any great hopes, but, He searched for traces of originality in people… In the way they speak, they do, they walk Or the way they respond with compassion to a beggar Encountered suddenly on their way;   In their love, anger, passion or hatred, Or the way they converse with a former…

  • జూన్ 25, 2014

    On The Shores Of Intimacy… Manasa Chamarti, Telugu, Indian

    That’s an age-old picture-freeze The grin of the froth At the lukewarm caress on his soaked feet Stars over his lips. Leaning over his shoulder and looking into the horizon She would be drinking with her eyes The bantering between Sky and the Sea. The wind and wave play pick-a-boo with the skin; Shadows play…

  • జూన్ 24, 2014

    భిన్నాభిప్రాయాలు … వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్, అమెరికను

    వాళ్ళు నా ఆత్మని మెత్తని తూలికలలో చుట్టేరు నన్ను వెచ్చగా  ఒద్దికగా అలంకరించేరు ఒక కొత్తగా మలిచిన కుర్చీలో; భద్రంగా ఉంచేరు ఒక పాత ప్రార్థనా కంబళి మీద.  వాళ్లు నా పాదాలని బంగారు జోళ్ళలో జొనిపేరు కాలి మడమలదగ్గరా, వేళ్లదగ్గరా నొప్పెట్టింది కూడా; విరామమెరుగని నా పాదాలని, చురుకుగా తిరిగే పాదాలని ఎలా ఉన్నాయని కూడా కనీసం అడగలేదు. ఇప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం  నేనెక్కడున్నానో నని కీచుగొంతుతో, దీనంగా అరుస్తూ, వెతుకుతుంటారు; నేనుమాత్రం పొడవాటి రెల్లు…

  • జూన్ 23, 2014

    నేను పక్షినైనపుడు… కేథరీన్ మేన్స్ ఫీల్డ్, న్యూజిలాండిష్ బ్రిటిష్ కవయిత్రి

    నేను కరక(1) చెట్టు పైకెక్కి అక్కడ ఈకల్లా మెత్తగా ఉండే ఆకుల గుబురుల్లో దాగేను. నేనొక పాట కట్టేను  అందులో ఏ పదాలూ లేనప్పటికీ తెలియకుండా పాడసాగేను… చివరకి అది విషాదమైంది. చెట్టుక్రింద గడ్డిలో పూలు విరగబూశాయి. అవి ఏమంటాయో చూద్దామని “నేను మీ తలలు కొరికి నా చిన్నారులకి తినడానికి ఇస్తాను,” అన్నాను. అవి నేను పక్షినంటే నమ్మలేదు; అవి చాలా చక్కగా విచ్చుకునే ఉన్నాయి. తెల్లని తూలికలతో కప్పిన నీలి గూడులా ఉంది ఆకాశం…

  • జూన్ 22, 2014

    మృదువర్షధార … సారా టీజ్డేల్, అమెరికను

    ఓ రోజు వస్తుంది… సన్నని ధారలుగా వర్షం పడుతుంటే నేల కమ్మని వాసనలేస్తుంటుంది, పిచ్చుకలు కిచకిచలాడుతూ చక్కర్లు కొడుతుంటాయి; రాత్రుళ్ళు చెరువులలో కప్పలు బెకబెకలాడుతుంటాయి; పిచ్చిగా మొలిచిన అడవిరేగు పూలుతెల్లగా గాలికి వణుకుతుంటాయి క్రిందకి వాలిన సరిహద్దు తీగలపై ఎర్రని రెక్కల రాబిన్ లు ప్రేమసరాగాలాడుకుంటుంటాయి; ఒక్కదానికీ యుద్ధం గురించి ఎరుక ఉండదు, ఒక్కదానికీ యుద్ధం ఎప్పుడు అంతమయిందో పట్టదు. చెట్టుకిగాని, పిట్టకిగాని బాధ ఉండదు మానవజాతి సమూలంగా నాశనమయిందే అని. సూర్యోదయంతోనే మేల్కొన్న వసంతం సయితం…

  • జూన్ 20, 2014

    ఒక మంచుపెర్ల తో… ఫ్రాన్సిస్ థామ్సన్, ఇంగ్లీషు కవి

    అసలు నిన్ను  ఏ మనసు ఊహించగలిగింది? మా కల్పనాశక్తికి పరిధి దాటిపోయింది. (ఓ జిలుగుపనితనాప్ల పూరేకా!) ఎంతో స్వచ్ఛంగా, సుకుమారంగా, యదార్థంగా సృష్టించబడ్డావు. ఏ ఊహాతీతమైన  స్వర్లోకపు లోహంతో చెయ్యబడ్డావు? ఎంత అమూల్యమైన దానివి? నిన్నెవరు తీగలా సాగదీసారు, నిన్నెవరు వెండి ఆవిరులతో రూపుదిద్దారు? “నన్ను రూపుదిద్దినది ఆ భగవంతుడే. ఊహాగానాలకి అతీతంగా తనే నన్ను సాగదీసి, సొగసు వంకరలుపోయే వెండి ఆవిరులనుండి తన మనసు తనివి తీరేలా సృష్టించేడు.  ఇంత స్వచ్ఛంగా, అంత లీలగా, అంత…

  • జూన్ 17, 2014

    నీరొక వరం… హేమ్లిన్ గార్లాండ్, అమెరికను

    “ఇక్కడ దగ్గరా నీళ్ళు దొరుకుతాయా?” అని మైదానపు వ్యక్తులు అడుగుతుంటారు, ఎడారిలో తారసపడినపుడు. పెదాలకి వేలు ఆనించి నల్లగా ఉన్న నవాజోను అదే అడుగుతాను. ఆ మనిషి నవ్వుతూ సమాధానం చెబుతాడు, “అదిగో!” అంటూ వేళ్ళు పైకెత్తి మైళ్ళదూరాన్న ఉన్న ఒయాసిస్సును చూపిస్తూ. మేము అలా నడుచుకుంటూ ఎడారిలో వెళ్తాం నీటికోసం వెతుకులాట పెనవేసిన సోదర బంధంతో. . హేమ్లిన్ గార్లాండ్, అమెరికను . Hamlin Garland . The Gift of Water  . “IS…

  • జూన్ 16, 2014

    ఫిర్యాదు… మార్క్ అకెన్ సైడ్, ఇంగ్లీషు కవి

    దూరం!  దూరం! మోసకారీ, ప్రేమా! నన్నిక మభ్యపెట్టకు: నీ మెత్తని మాటల ప్రభావానికి నా అమాయకపు యువహృదయం బలైంది, చివరికి ఎలాగైతేనేం నీ కుట్ర బహిర్గతమైంది కడకి ఖరీదైన అనుభవంతో జాగ్రత్త తెలిసొచ్చింది.  దూరం! ఈ వయసులో నన్ను లొంగదీస్తాననుకోకు నాకు తెలుసు,  ఆమె గొప్పదనాన్ని గ్రహించగలను.  ఇప్పుడు ఇంకా చూపించాలా? ఆమె గురించి? నాకు? నాకు నాకే తెలియకుండా ఆ యువతి సొగసునీ, నమ్రతనీ, సుగుణాలనీ ప్రశంసించలేదు! ఎన్నిసార్లు అనలేదు  ఆమె హృదయాన్ని తనదిగా చెప్పుగలగడం…

  • జూన్ 15, 2014

    ఒక ప్రస్థానం… రైనర్ మారియా రిల్కే, ఆస్ట్రియన్ కవి

    నేను ప్రారంభించిన ఈ ప్రయాణంలో నా దారికి ఎదురుగా అనంతదూరంలో సూర్యకిరణాలుసోకిన కొండ చూస్తున్నాను. ఒకోసారి మనం అందుకోలేనిది మనల్ని అందుకుంటుంది; దానిలో ఒక అంతర్గత కాంతి ఉంటుంది…అంత దూరం నుండి కూడా, మనం అక్కడకి చేరుకోలేకపోయినా, మనల్ని ఉత్తేజపరచి మనం  ఏమాత్రం గ్రహించలేకుండానే మనల్ని వేరే వ్యక్తులుగా మార్చెస్తుంది;  మన చెయ్యూపుతూ చేసిన సంజ్ఞకి ప్రతిగా మరొక సంజ్ఞ మనల్ని ముందుకి పురికొల్పుతుంది… మనం తెలుసుకోగలిగింది మాత్రం ముఖాన్ని చిరుగాలి తాకుతూ పోవడం. . రైనర్…

  • జూన్ 14, 2014

    దురదృష్టం… జేమ్స్ ఏండర్సన్, స్కాట్లండు

    నిన్నరాత్రి  ఒక మిత్రుడి శయ్య పక్కన కూర్చుని అలా పరికిస్తున్నాను బయటా లోపలా నిశ్శబ్దమే నెత్తిమీద గోడగడియారం చేసే చప్పుడు తప్ప నా ఆలోచనలు ముందుకీ ఊగిసలాడేయి అలా చాలా సమయం గడిచిపోయింది, “నా కంటే దురదృష్టవంతుడు ఉంటాడా?” అన్న సంశయం చివరకి నివృత్తి అయేదాకా. నా చెవులో ఒక మాట వినిపించింది… బాగా అలసి, నీరసించిన గొంతు అది… “నిస్సహాయులు” అని మూడుసార్లు అంది ఆ మాటలు నే వినడం తప్ప వద్దనగలిగేవి కావు. ఆ…

←మునుపటి పుట
1 … 146 147 148 149 150 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు