-
ఏ యఫ్ యాత్లా యో కుత్ల్… జాన్ మే, ఐస్ లాండ్
ఇంత అందమైన ఆకాశాలకి నలుపు పులిమే ఆమెతో నే నేమి తగవులాడేది? సలసల మరుగుతున్న ఆమె పొట్టని కంపించనీ ఈ ప్రపంచాన్ని ఆమె హేల అబ్బురపరచనీ. ఆమె మహోగ్రంగా ఉంటుంది. కావొచ్చు. కానీ, ఆమెది క్రియాత్మక సంఘర్షణ అని అర్థం చేసుకో గలను. ఆ కరిగి ప్రవహించే ఆమె హృదయం ఈ సృష్టిని తీర్చిదిద్ది, నా జీవితానికే ఆలంబన ఔతుంది. కనుక, ఆమె నల్లని పొగలు చిమ్ముతూ తెల్లని నుసితో ఆకాశాన్ని సముద్రాన్నీ కప్పనీ; పగలే చీకటిబడిన…
-
మైదానాలలో… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే , అమెరికను
చెలియలకట్టలోని గుల్లరాళ్ళని పలకరించే పెను అలలకీ ఒడ్డునవిరిగిపడే టన్నులబరువున్న కెరటాలకీ సముద్రమట్టానికీ, అక్కడి హోరుకీ దూరంగా… మైదానాలలో జాగాలు కొనుక్కుని, అక్కడ ఇళ్ళు కట్టుకునే వాళ్ళూ, లేదా ఇళ్ళు కొనుక్కునే వాళ్ళూ మరోసారి సముద్రపు ఉప్పునీటివాసన నేను కోరుకుంటున్నట్టు, వాళ్ళేం కోరుకుంటారు? మైదానంలోని మా ఇంట్లో, పక్కమీద తుళ్ళిపడిలేచిన నేను కోరుకుంటున్నట్టు రేవు ముఖద్వారంలోని ఓడలను చరుస్తూన్న కెరటాలు నిద్రలేపని ఆ మనుషులు ఏం కోరుకుంటారు? ఇరుకైన గదిగోడలకేసి చేతులు బాదుకుంటూ ఒక కిటికీ గాని, ద్వారబంధంగాని…
-
యువకవులకి… నికనోర్ పర్రా, చిలియన్ కవి
మీకు ఇష్టం వచ్చినట్టు రాయండి ఏ శైలి పాటించాలనుకుంటే అది పాటించండి… ఎన్ని రక్తపుటేరులు పారేయంటే ఇప్పుడు ఏదో ఒక్కదారే సరియైనదని నమ్మడానికి అవకాశం లేదు. కవిత్వంలో ఏదైనా చలామణీ అవుతుంది. కాకపోతే, ఒక్కటే షరతు తెల్ల కాగితం విలువ … పెంచాలి. . నికనోర్ పర్రా Sept 5, 1914 చిలియన్ కవి . . Nicanor Parra Young Poets . Write as you will In whatever style you like…
-
కోరిక… సామ్యూల్ రోజర్స్, ఇంగ్లీషు కవి
కొండ పక్కన నాకో కుటీరముండాలి తేనెటీగల ఝంకారం చెవులకు సొంపుగా సోకాలి సన్నని సెలయేరు, ఒకమిల్లుని చుట్టివస్తూ, గలగల దూకుతూ దాని పక్కనుండే పోవాలి. నా పాక పంచన తరచు ఒక పిచ్చుక తన మట్టి గూడునుండి అటూ ఇటూ తిరుగాడాలి నిత్యమూ ఎవరో ఒక అతిథి నా తలుపు తట్టి నా భోజనంలో పాలుపంచుకోవాలి. ప్రహారీగోడమీద గుబురుగా పెరిగిన తీగలోని పరిమళించే ప్రతి పువ్వూ మంచులో తడియాలి, ఎర్రని గౌనూ, నీలి వోణీ వేసుకున్న ల్యూసీ…
-
వర్తమానాన్ని ఆశ్వాదించు… పల్లడాస్, గ్రీకు కవి
త్రాగి, ఆనందంగా ఉండు. రేపు ఏమిటి జరుగుతుందో ఏ మర్త్యుడికీ తెలీదు. కాబట్టి, ఎందుకు ఆ శ్రమా, పరుగూ? ఖర్చుపెట్టగలిగినప్పుడే ఖర్చుపెట్టు, తిను, నీ కోరికలూ ఆశలూ ప్రస్తుత విషయాలమీదే లగ్నం చెయ్యి ; జీవమూ, మృత్యువూ ఒక్కటే. ఒక్క క్షణం జీవితానికి చెందిన వస్తువులకి ప్రాకులాడతావు; అవి నీ పాల బడతాయి; మరణించేక నీకేం ఉండవు. అన్నీ ఇంకొకడి సొత్తు అవుతాయి. . పల్లడాస్, గ్రీకు కవి 4 వ శతాబ్దం . Enjoy The…
-
Demise of Mustafa … Afsar, Telugu, Indian
Demise of Mustafa “Son! Don’t peep into that room,” the warning of Aunt Fatima was ringing in my ears from the past. Ever since I received the message over phone from Munir Bhai that “We are performing the tenth day obsequies,” this warning rang in my ears repeatedly. If I could take the first…
-
Ramadan Crescent… Chittaluri Satyanarayana, Telugu Indian.
Every Muslim friend I encountered at every turn of my life is a Ramadan Crescent! The rendering of Aja at five used to wake up my heart, before my mother had reached out for the blanket. The same ardor reflected in my father’s voice when he said “come on, get up! The ‘Allah…’ is heard.”…
-
I still feel his hand on my shoulder…K Cube Varma, Telugu, Indian
I still feel his hand on my shoulder I still feel we were walking together In that road … less travelled He used to climb over the deer-like hillocks With his piercing cheetah-like looks… I still feel his hand over my shoulder. When he laughed sweetly Lending his hand I felt the moon were in…
-
To My Valentine… Vamshidhar Reddy, Telugu, Indian
I received your SMS this morning. What am I after all? But a nameless shadow of infatuated consummation Of deliquescent cold frozen by time. Take it Cool. Marriage is only a wedding of two corpora. Don’t eschew sleep when get dreamy. What had happened is only true; rest is fancy and a big lie.…
-
దేశాటనలక్కరలేదు… జేమ్స్ క్లారెన్స్ మేంగన్, ఐరిష్ కవి
శాస్త్రాలు తెలుసుకుందికి దేశాటన చెయ్యనక్కరలేదు! కొంచెం కఠినమైనది; అయితేనేం, మనసే ఖచ్చితమైన గురువు; దాన్ని, దాన్ని ఒక్కదాన్ని సరిగ్గా చదవగలిగేవంటే, నువ్వెక్కడనుండి వచ్చేవో, నువ్వేమిటో చక్కగా తెలుసుకోగలవు. తుర్క్ మన్, చైనీస్, ఈజిప్షియన్, రష్యన్, రోమన్, ఏదైతేనేం, అన్ని నాగరికతలూ పతనం వైపు దొర్లినవే. అన్నిచోట్లా పాత్రధారులు స్త్రీలూ, పురుషులే, అన్నిచోట్లా అనాదిగా చేస్తున్న ఆ దౌర్భాగ్యపు పాపాల చిట్టానే. ప్రతిచోటా మనల్ని దుష్టశక్తులు ప్రలోభపెడుతునే ఉంటాయి. ఈ నేల నీకేమిటి ఇవ్వగలదు, మన్నూ, మంచూ తప్ప?…