అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూలై 31, 2014

    మృదుల కంఠస్వరాలు కనుమరుగైపోయేక… షెల్లీ, ఇంగ్లీషు కవి.

    మృదుల కంఠస్వరాలు కనుమరుగైపోయేక సంగీతం జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తుంటుంది; సుకుమారమైన పూల నెత్తావి అవి వాడిపోయినా అవి రేకెత్తించిన ఇంద్రియజ్ఞానంలో నిక్షిప్తమై ఉంటాయి. గులాబి రేకులు, గులాబి రాలిపోయేక ప్రియురాలి సమాధిదగ్గర పోగుచెయ్యబడతాయి; అలాగే, నీ ఆలోచనలు, నీ తదనంతరం, ప్రేమ తనలోతాను నెమరువేసుకుంటుంటుంది. . P B షెల్లీ 4 August 1792 – 8 July 1822 ఇంగ్లీషు కవి. . . Music, when Soft Voices die . Music, when soft…

  • జూలై 30, 2014

    కవి… యోనీ నొగూచి, జపనీస్ కవి

    అగాధ తమోమయ జగత్తులోకి ఒత్తిగిలిన ఉదయంలా పరిపూర్ణమూ, అద్భుతమూ ఐన ఒక రహస్య ఆకారం అవతరిస్తుంది. అతని ఊర్పులు సువాసన భరితం అతని కనులు తారకాసముదయానికి త్రోవచూపించగలవు అతని ముఖంలో ప్రసన్న మరుద్వీచికలుంటాయి స్వర్లోక ప్రాభవమంతా అతని మూపున ఉంటుంది అమూర్త దివ్యరూపంలా నడచివస్తాడు అనంతమైన ప్రేమని పంచిపెడుతూ, ప్రాభాత సూర్యకిరణం అతని ఆటపట్టు మధుర సాంధ్య సంగీతం అతని పలుకు. అతని చూపు పడితే సమాధి మృత్తికలోకూడ కదలిక వస్తుంది నందనవనాలకి ప్రయాణం సాగుతుంది. .…

  • జూలై 29, 2014

    రుబాయీ XIV … ఉమర్ ఖయ్యాం, పెర్షియన్

    మనుషులు మనసు లగ్నంచేసే లౌకికాపేక్షలు బూడిదైపోతాయి… లేదా వర్ధిల్లుతాయి;  ఐనా, అవి త్వరలోనే పొడిబారిన ఎడారి ముఖం మీది మంచు బిందువుల్లా ఘడియో రెండు ఘడియలో వెలుగు వెలిగి… మాయమౌతాయి. . ఉమర్ ఖయ్యాం 18 May 1048 – 4 December 1131 పెర్షియన్   . . Rubai XIV   The Worldly Hope men set their Hearts upon Turns Ashes — or it prospers; and anon,…

  • జూలై 28, 2014

    గొర్రెలకాపరి… ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి

    నేనొక మందనుతోలే గొర్రెలకాపరిని నా ఆలోచనలే నా గొర్రెలు నా అనుభూతులే నా ఆలోచనలు. నేను నా కళ్ళతో, చెవులతో నా చేతులతో, కాళ్ళతో నా ముకుపుటాలతో, నోటితో ఆలోచిస్తాను ఒక పువ్వుని ఆలోచించడమంటే దాన్ని చూసి వాసనచూడ్డం ఒకపండుని తినడమంటే దాని రుచిని అనుభూతించడం  అందుకే, బాగా ఎండకాసిన రోజూ, నాకు బాధకలిగినపుడూ, బాగా ఆనందం కలిగినపుడూ, గడ్డిలో విశ్రాంతి తీసుకుందికి మేను వాలుస్తాను, ఎండపడిన నా కళ్ళని మూసుకుంటాను  నిజానికి నా శరీరంఅంతా సేదదీరినట్టు…

  • జూలై 27, 2014

    అంతరంగపు ప్రశాంతత … హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి

    గాలి ఊసులేని భూమి పొరల్ని చీల్చుకుని ఎక్కడ నిశ్చలత ఉందో అక్కడకి చొరబడాలని ప్రయత్నించే భీకర శబ్దాలూ, యుద్ధాల కోలాహలమూ, ప్రార్థనలలోని సవ్వడీ, అకస్మాత్తుగా కలిగే ఆనందాన్ని సున్నితంగా ప్రకటించే అనురాగ నిస్వనాలూ, లజ్జ ఎరుగని నవ్వుల కంఠధ్వనులూ… ఇవేవీ నన్ను ఎదిరించి అవమానించనూలేవు… జ్ఞాపకాలై మనసులో పదేపదే మార్మోగనూ లేవు… శాశ్వతమైన ప్రశాంతత నిండిన నా అంతరాంతర కుహరాల్లోకి ప్రవేశించనూ లేవు. బుగ్గకంటే మెత్తనైన ప్రశాంతత పుష్పించబోతున్న మొగ్గలక్రింది నేలలో దాగుంది… అది గంటలకొద్దీ నిర్విరామంగా…

  • జూలై 26, 2014

    మహా నగరం… హెరాల్డ్ మన్రో, ఇంగ్లండు

    నేను సూర్యాస్తమయవేళ తిరిగి వచ్చేసరికి సేవకురాలు సన్నగా ఏదో పాడుకుంటోంది. చీకటిగా ఉండే మెట్లకిందా, ఇంటినిండా వెన్నెలరేకలా సంధ్యవెలుగు చొరబడింది. కాల స్పృహ ఎంతగా చచ్చుపడిందంటే అది మధ్యాహ్నమో అర్థరాత్రోకూడా తెలియడంలేదు. జలపాతపు నీటిలా పడుతూ, లేస్తూ, పడుతూ, ఉస్సురంటూ నిశ్శబ్దపు శబ్దమొక్కటే శాశ్వతంగా కనిపిస్తోంది.   నేను నా గదిలో కూచున్నాను, సూర్యాస్తమయాన్ని గమనిస్తున్నాను… నక్షత్రాల వెలుగు చూశాను… ఇంటిముఖం పట్టిన మనుషుల పాదాల చప్పుడు విన్నాను… నిద్రపోబోతున్న కడసారి బిడ్డ చివరి మాట విన్నాను……

  • జూలై 25, 2014

    రే స్తుతి … మేక్స్ మైకేల్సన్, అమెరికను

    నిగూఢమైన ఓ రేయీ, ఇలా రా!  నెమ్మదిగా దిగివచ్చి ఒద్దికగా పొదువుకో! ఏ ఆరాధనలూ లేకుండా అహంకారంతో మేము కట్టుకున్న ఇళ్ళపై నెమ్మది నెమ్మదిగా ఆవహించు. నీ ముసుగులో వాటిని దాచి దాచి నాల్గుపక్కలా నీ నీడలని ప్రసరించు. మా కార్ఖానాలపై, అంగళ్ళపై  వ్యాపిస్తూ, మా అహమికలనీ, మా అవమానాలనీ నీ నీహారికా సదృశమైన రెక్కలలో  మరుగుపరుచు. నున్నటి రాళ్ళుపరచిన మా వీధులలోకి అడుగుపెట్టి నీ కల్లోల పవనాల రేచుకుక్కల్ని విడిచిపెట్టు. ఓ నిశా రత్నమా! నిద్రిస్తున్న వాళ్ళని…

  • జూలై 24, 2014

    అనుమానపు మనసు… ఎలిజబెత్ మహారాణి 1 ఇంగ్లండు

    పాదాల వంకర లేదు, కళ్ళు పువ్వువెయ్యనూ లేదు, శరీరంలో ఏ భాగమూ ఎబ్బెట్టుగా అసహజంగా లేవు. అయితేనేం, అవన్నీ ఉన్నా, నిత్యమూ రహస్యంగా, అనుమానించే మనసుకంటె, సగంకూడా అసహ్యంగా ఉండవు. . ఎలిజబెత్ రాణి 1 (7 September 1533 – 24 March 1603) (1520లో  పారిస్ లో ముద్రించబడ్డ ఫ్రెంచి ప్రార్థనా గీతాల పుస్తకంలో చివరి పేజీలో ఆమెచే  ఈ కవిత రాయబడి  సేవకునికో, స్నేహితునికో నవంబరు 17, 1558కి ముందు ఇవ్వబడినట్టు అంచనా .)…

  • జూలై 23, 2014

    మహావృక్షాలు కూలినపుడు… మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి

    మహా వృక్షాలు కూలినపుడు దూరాన కొండలమీది రాళ్ళు కంపిస్తాయి, సింహాలు ఒత్తైన పొడవాటి రెల్లుపొదల్లో దాక్కుందికి పరిగెడతాయి, చివరికి ఏనుగులు సైతం ప్రాణభీతితో సురక్షితప్రదేశాలకి చేరుకుంటాయి. అడవుల్లో మహా వృక్షాలు కూలుతున్నప్పుడు చిన్నజీవాలు వాటి జ్ఞానేంద్రియాలు భయానికి హరించుకుపోయి మౌనంలోకి ముడుచుకుపోతాయి గొప్పవ్యక్తులు మరణించినపుడు మనని ఆవరించినగాలి పలచనై, తేలికై, క్రియాశూన్యమైపోతుంది. మనం ఊపిరి బిగబడతాం మనకళ్ళు క్షణికమైనా, స్పష్టంగా చూస్తాయి, మన జ్ఞాపకశక్తి ఒక్కసారిగా మరింతపదునుతేరి పరిశీలుస్తూ ఉంటుంది పైకి చెప్పని మంచిమాటలను నెమరేసుకుంటూ చేద్దామనుకుని…

  • జూలై 21, 2014

    On The Easel … Nareshkumar, Telugu, Indian

        No great expectations I entertained for The picture to be amazing; I just went on caressing with the brush across; I did not even think of some deadline To finish it before.   Even as I blotted clean the stains of blood That seeped up to the fore arms While I was drawing…

←మునుపటి పుట
1 … 143 144 145 146 147 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు