After endlessly refurbishing it with fresh colours.
.
Naresh Kumar
ఒక అసంపూర్తి చిత్రం
నెనెప్పుడూ అనుకోనేలేదు ఆ చిత్రం అద్బుతంగానే ఉండాలని అలా కుంచెని కదిలిస్తూ పోయానంతే అదెప్పటికో పూర్తవాలనికూడా నేననుకోనేలేదు
కోసుగా చెక్కిన గుండెతో కొన్ని వంపుతిరిగే సన్నని గీతలని చిత్రించేప్పుడు మోచేతులదాకా సాగిన రక్తపు చారికలని తుడుచుకుంటున్నప్పుడు కూడా నేను ఆ చిత్రాన్ని అద్బుతమైనదిగా నిలబడితే బాగుండనుకోలేదు
కాకపోతే ఆ చిత్రం ఒకానొక కాలపు వేదికపైకి కొనిపోబడినప్పుడు నేను ఖాలీగా వదిలిన ప్రదేశాలని కొందరి చేతులు ఆప్యాయంగా తడమాలనుకొన్నాను వారి చేతుల గుర్తులతో నింపబడిన ఆ చిత్రం నన్ను నవ్వుతూ ఆ వేదికపైకి ఆహ్వానించాలనుకున్నాను
అతి చల్లని నీడల రాత్రులలో మంచు దుప్పటి కప్పుకొని కొన్ని నవ్వులని దాచుకున్న గడ్డిపువ్వుల స్పర్శ ని తెచ్చి ఆచిత్రానికి పూస్తున్నప్పుడు ఆ చిత్రం అద్బుతంగా ఉండాలని నేననుకోలేదు
కానీ కొన్ని రక్తపు మరకల గుర్తుగా దాన్ని వదిలేయాలనుకున్నాను
అందుకే నేనా చిత్రం కిందుగా సంతకం చేయాల్సిన ప్రదేశాన్ని ఖాలీగా ఉంచేయదలిచాను
ఇకా ఆ అసంపూర్తి చిత్రం స్వేచ్చగా తనని తాను చిత్రించుకుంటూనేఉంటుది ఆ పక్కగా నడుస్తూ వెల్లిపోయే వారంతా క్షణక్షణమూ కొత్తగా మారిపోయే ఆ చిత్రం లో తమని తాము వెతికి గుర్తించుకుంటారు అనంతానంతంగా రంగులని అక్కడ గుమ్మరించి వెళ్ళిపోతూనే ఉంటారు…..
Congrats bhaya..keep it up
మెచ్చుకోండిమెచ్చుకోండి