అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఆగస్ట్ 22, 2014

    లెట్టీ గ్లోబు … ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి

    లెట్టీకి ఇంకా మూడో ఏడు నిండకుండానే ముద్దులొలుకుతూ నోటంట మాటలు ప్రవహించ సాగేయి, ఒక రోజు మేము ఆమెకి రంగుల గ్లోబు కొనిచ్చేము అక్కడి రంగులుబట్టీ, గీతలబట్టీ నేలా, సముద్రాలూ పోల్చుకుని తెలుసుకుంటుందని ఆమె ఒక సారి ప్రపంచాన్ని లాలించింది; ఆమె లేతవేళ్ళ సందుల్లోంచి సామ్రాజ్యాలు తొంగిచూసేయి ఆ మెత్తని చేతులకి ఏ హద్దుల్లోనైనా స్వాగతమే లభించింది. ఎలా తుళ్ళిందని! ఆ ప్రపంచాన్ని చూస్తూ, నవ్వుతూ ఆనందాతిశయంతో ఏవేవో మాటాడింది. కాని, ఆమె అందమైన చూపుల్ని మా…

  • ఆగస్ట్ 21, 2014

    OK, I Won’t Remind You… Manasa Chamarti, Telugu , Indian

    So often, They overwhelm me… The days when you entered gently like a mist And pervaded my cumulus introspective worlds of fancy. Caressing the throbbing wayward impulses Whelming with flourishing tender springs of age The courses you guided love-locking Unto the raging pinnacles of youth… The moments We floated adrift in ardour Into the charming…

  • ఆగస్ట్ 20, 2014

    Awaiting the day…Shamshad, Telugu, Indian

    The childhood had passed Under your loving care. Leaving everything behind, I now Had to move out in search of greener pastures. And I suddenly remembered the duty of a daughter. Oh! How far had I travelled flying in the air!   The crescent is visible every evening Victuals are there in front, but The…

  • ఆగస్ట్ 19, 2014

    పెళ్ళి ఉంగరం … జార్జ్ క్రాబ్, ఇంగ్లీషు కవి

    నువ్వు చూస్తుండగా తొడుగుతున్న ఈ ఉంగరం పల్చగా, కళతగ్గినట్టున్నా బంగారందే; జీవితంలోని ఆటుపోట్లకి ప్రేమ తరిగినట్టనిపించొచ్చు అయినా, ప్రేమ ప్రేమే అని ఇది ఋజువుచేస్తుంది.  . జార్జ్ క్రాబ్ 24 December 1754 – 3 February 1832 ఇంగ్లీషు కవి   . George Crabbe . A Marriage Ring . The ring, so worn as you behold,      So thin, so pale, is yet of gold:          The…

  • ఆగస్ట్ 18, 2014

    అజ్ఞాతకు … హెలెన్ డడ్లీ, అమెరికను కవయిత్రి

    వినీలాకాశంలో విచ్చలవిడిగా తిరిగే అందమైన నక్షత్రాలనెన్నో చూశాను, చివరకి సూర్య చంద్రుల్ని కూడా కానీ, నీ ముఖమే చూడలేదు.   వయొలిన్ రాగాలని విన్నాను చిరుగాలులూ, ఉత్తుంగ తరంగాల అసంఖ్యాకమైన ఉల్లాసగీతికలు విన్నాను ఒక్క నీ స్వరం తప్ప.   ఈ నేలమీది నల్ల కలువల్నీ సుకుమారమైన పుష్పాలనెన్నిటినో తాకేను పారిజాతాల్నీ, రత్నభోగి పువ్వులనీ కూడా ఒక్క నీ చేయి తప్ప.   ప్రభాత సంధ్య  పాదాలని ఒక ప్రేమికుడిలా ముద్దాడేను వేకువ తలుపులను బార్లా తెరిచాను…

  • ఆగస్ట్ 17, 2014

    రాత్రీ పగలూ నా ఆలోచనలు అటే తిరుగుతాయి… రిఛర్డ్ హెన్రీ స్టొడ్డార్డ్, అమెరికను

    . రాత్రీ పగలూ నా ఆలోచనలు మధువందించే అనుభూతివైపే తిరుగుతాయి   నా ఉద్దేశ్యంలో జాడీలు మధువు నిల్వచెయ్యడానికే ఉన్నాయి, మధువు, నాకు తెలిసి, తయారుచేసేది తాగడానికే. నేను మరణించేక (ఆ రోజు చాలా దూరంగా ఉండుగాక!) ఒకవేళ కుమ్మరి జాడీ తయారు చేయవలసి వస్తే, నా చితా భస్మముతో తయారుచేయును గాక   దానిని నిత్యమూ మధువుతో నింపుదురు గాక!   . రిఛర్డ్ హెన్రీ స్టొడ్డార్డ్ జులై 2, 1825 – మే 12,…

  • ఆగస్ట్ 14, 2014

    స్త్రీజాతి శాసనం … ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

    (ఈ కవిత సుమారు వంద సంవత్సరాల క్రింద వ్రాసినా, అందులో ప్రకటించిన ఆవేదనకి కారణమైన యుద్ధోన్మాదం ఎంతమాత్రం తగ్గుముఖం పట్టలేదు, సరికదా, విజృంభిస్తోంది అన్నిచోట్లా, అన్ని రకాలుగా. ఈ కవిత దాని సందర్భాన్ని కోల్పోకపోవడం ఒక పక్క ఆనందకరం, రెండోపక్క విచారకరం. ప్రపంచశాంతికి ఇంతకంటే గొప్పకవిత ఎవరూ రాయలేరేమో   ) . క్రీస్తు జన్మించి అప్పుడే 2 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. సాగరంలోకి భూమ్మీద ఉన్న నదులన్నీ చేరినట్టు ఒక్కసారిగా  కొన్ని కోట్లమంది స్త్రీలు ఒక కేంద్రస్థానంవైపు…

  • ఆగస్ట్ 13, 2014

    మధుగీతం… అబ్రహాం కూలీ, ఇంగ్లీషు కవి

    దాహంకొన్న భూమి వర్షపునీరు చుక్కమిగల్చదు అంతా తాగేసి, ఇంకా కావాలని ఎదురుచూస్తుంటుంది; వృక్షాలు నేలను పీల్చి, పీల్చి నిరంతరం తాగుబోతులై ప్రవర్తిస్తుంటాయి. పోనీ సముద్రం చూద్దామంటే (ఎవరికైనా దానికి దాహం ఏమిటనిపిస్తుంది) ఇరవైవేల నదుల్ని అవలీలగా తాగెస్తుంది ఎంతగా అంటే దాని బొజ్జ పొర్లిపోతుంది. అలా నిలకడలేక తిరుగుతుంటాడా సూరీడు (అతని జేవురుమన్నముఖం తాగుబోతని చెప్పకచెబుతుంది) సముద్రాలన్నిటినీ తాగేస్తాడు, అతని పనయిపోయేక చంద్రుడూ, నక్షత్రాలూ అతన్ని తాగెస్తాయి తాగేసి తమ పద్ధతిలో తందనాలాడతాయి, తాగి రాత్రల్ల వేడుక…

  • ఆగస్ట్ 12, 2014

    లుకాస్టా కోసం (యుద్ధానికి వెళుతూ) … రిఛర్డ్ లవ్ లేస్, ఇంగ్లీషు కవి

    నీ నిర్మలమైన హృదయమందిరానికీ ప్రశాంతమైన మనసుకీ దూరంగా, నిర్దాక్షిణ్యంగా వెళుతునానని ప్రేయసీ, నన్ను నిందించకు.  నిజమే! మరొక స్త్రీని కాంక్షిస్తూ పరిగెడుతున్నాను రణరంగంలో నాకు కనిపించే మొదటి శత్రువు వెనక, కరవాలాన్నీ, గుర్రాన్నీ, కవచాన్నీ ఎంతో విశ్వాసంతో గుండెలకి హత్తుకుంటాను. నా ఈ చపలత్వం ఎలాంటిదంటే అది నువ్వు కూడా హర్షిస్తావు; నిజానికి, ప్రేయసీ! నా ఆత్మగౌరవాన్ని ఇంతగా ప్రేమించి ఉండకపోతే నిన్ను అంతగా ప్రేమించి ఉండగలిగేవాడిని కాదేమో! . రిఛర్డ్ లవ్ లేస్ (1618–1657) ఇంగ్లీషు…

  • ఆగస్ట్ 11, 2014

    క్లో కోసం… విలియం కార్ట్ రైట్, ఇంగ్లీషు కవి

    మనిషికి రెండు పుట్టుకలుంటాయి; మొదటిది ఇంద్రియాల్ని తట్టిలేపుతూ తొలివెలుగు కిరణం పడినప్పుడు; రెండోసారి  రెండు హృదయాలు ఒకటైనపుడు, మన జీవితాన్ని మళ్ళీ అక్కడనుండి లెక్కించాలి; నువ్వు నన్నూ నేను నిన్నూ ప్రేమించినపుడు మనిద్దరం కొత్తగా జన్మించినట్టే. ప్రేమ మనకి కొత్త ఆత్మలని ప్రసాదిస్తుంది వాటిలో కొత్త శక్తుల్ని కూడా పాదుకొల్పుతుంది; అప్పటినుండి మనం కొత్తజీవితం ప్రారంభిస్తాం మనం తీసుకునే ఊపిరి మనది కాదు, ప్రేమదే. వయసు వేడి తగ్గినవారినికూడా ప్రేమ యవ్వనుల్ని చేస్తుంది యవ్వనులుగా ఉన్నవాళ్ళని, యవ్వనులుగానే…

←మునుపటి పుట
1 … 141 142 143 144 145 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు