-
మార్మిక మార్గము… దారా షుకోయ్, పెర్షియను కవి
దేముడినితప్ప మరెవ్వరినీ శరణు కోరకు జంధ్యాలూ, తావళాలూ లక్ష్యానికి సాధనాలు మాత్రమే ఈ నియమ నిష్ఠలన్నీ వట్టి బూటకాలూ, భేషజాలూ. భగవంతుడిని అవి ఎలా చేరువ చేస్తాయి? రాజవడం సుళువు, ముందు పేదరికమేమిటో తెలుసుకో, వానచినుకు సముద్రంగా మారగలిగినపుడు ముత్యంగా ఎందుకు మారాలి? బంగారం అంటిన చేతులే ముక్కవాసనవేస్తాయి గదా, పాపం, బంగారం అంటుకున్న ఆత్మ గతి ఎలా ఉంటుందో! ప్రతిరోజూ ఏదో ఒక చావు వార్త వింటూనే ఉంటావు, నువ్వు కూడా పోవలసిందే. ఐనా…
-
చీకటి కొండలు … వాంగ్ వీ, చీనీ కవి
వర్షం ఆగిపోయింది. కొండలు ఖాళీ అయిపోయాయి. రాత్రి రివట. ఇప్పుడు ఆకురాలే కాలం. పైన్ చెట్లలో అందంగా చందమామ. రాళ్ళమీదనుండి స్వచ్ఛంగా పారుతున్న సెలయేరు. ఎక్కడో వేణుగీతి… ఎవరబ్బా ఇంటిముఖం పట్టింది? ఎక్కడో కలువ కదిలిన చప్పుడు… ఎవరు చెప్మా బయటకు వెళుతున్నది? వాసంతపు సౌరభాలు ఎల్లకాలం నిలవవు. కాని, నువ్వు మాత్రం కలకాలం ఉండాలి. . వాంగ్ వీ (699-759 AD) చీనీ కవి . Night Hills . Rain…
-
మధుపానం… తావో చియెన్, చీనీ కవి
నలుగురూ నివసించే చోటే ఇల్లు కట్టుకున్నాను కానీ, మాటల సందడీ లేదు, వాహనాల రొదా లేదు. “అదెలా సాధ్యం?” అని మీరు అడగవచ్చు మనసు దూరంగా ఉంటే, ఊరూ దూరంగానే ఉంటుంది. తూరుపు దడిదగ్గర పూసిన చేమంతులు కోస్తూ దక్షిణానికున్న కొండలవైపు చూసాను. ఈ సాయంసంధ్యవేళ కొండగాలి హాయిగా వీస్తోంది పక్షులు బారులు బారులుగా ఇంటిముఖం పట్టేయి. ఇందులోనే ఏదో నిగూఢమైన సత్యం దాగుంది. అది విప్పిచెప్పడానికి నాకు మాటలూ లేవు, మనసూ లేదు. . తావో…
-
Apart from Writing… Nanda Kishore, Telugu, Indian
Nobody is yours… Neither the children you so carefully nurture with your hands, The birds that fly fledged under your plumage, Nor this moon that gleams so full in your eyes… No. There is no sanguine trace of yours in any of them. *** Nobody tarries for you. It is but an onliest living Amidst…
-
ఏకేశ్వరత్వం… దారా షికోయ్, పెర్షియను
నువ్వెటుచూడదలుచుకుంటే అటు చూడు, అంతటా అతనే దేముని ముఖం నీకెప్పుడూ ఎదురుగానే ఉంటుంది. అతను కానిది నువ్వేదిచూసేవనుకున్నా అది కేవలం నీ ఊహ. అతని కాని వస్తువుల ఉనికి ఎండమావి లాంటిది. భగవంతుని ఉనికి అంతులేని సముద్రం లాంటిది. మనుషులు ఆ నీటిమీది ప్రతిబింబాలూ, కెరటాలవంటివారు అతనికంటే భిన్నంగా నన్ను నేను ఊహించుకోనప్పటికీ, నేను దేముణ్ణని మాత్రం అనుకోను. నీటిబిందువుకి సముద్రంతో ఎటువంటి అనుబంధం ఉంటుందో అది తప్ప, అంతకు మించి నా అనుబంధాన్ని తలపోయను…
-
మిత్రులు… జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి
ఒకరి తర్వాత ఒకరుగా మిత్రులు నిష్క్రమిస్తారు: స్నేహితుడ్ని పోగొట్టుకోనివాడు ఎవడు? ఇక్కడే ముగింపు చూడని మనసుల కలయిక ఎక్కడా కనిపించదు. ఈ నశ్వరమైన ప్రపంచమే మన విశ్రాంతి అనుకుంటే బ్రతికినా, చచ్చినా, ధన్యుడైనవాడెవ్వడూ లేనట్టే కాల ప్రవాహానికి అతీతంగా , మృత్యు లోయకి ఆవల, ఖచ్చితంగా ఒక దివ్యమైన లోకం ఉంది అక్కడ జీవితం క్షణికం కాదు; జీవితంలోని అనుబంధాలు నిమిత్తమైన నిప్పురవ్వల్లా ఎగిరి, జ్వలించి ఆరిపోయేవి కావు. పైన ఒక ప్రపంచం ఉంది, అక్కడ వియోగమన్న…
-
Personal Law… Shamshad, Telugu, Indian
Though the boy’s was not a government job, looking at the trail of degrees after his name my poor school-teacher father, who could barely make both ends meet, arranged the Nikah with half a lakh though it was well beyond his means. How could I know he would turn me away giving Talaq making me…
-
కట్టు కథ… చార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
నీ చిన్ని నీలి నీలి చేతులతో చిమ్మనగ్రోవిదగ్గర నీళ్ళు త్రాగడం ఊహించగలను; కాకపోతే నీ చేతులు మరీ చిన్నవి కావు, చిమ్మనగ్రోవి ఫ్రాన్సులో ఉంది; నువ్వు అక్కడినుండే నీ ఆఖరి ఉత్తరాన్ని రాసేవు. నేను సమాధానం ఇచ్చేనుగాని నువ్వు తిరిగి జవాబివ్వలేదు. నువ్వు ఏవో చాలా పిచ్చి పిచ్చి కవితలు రాస్తుండేదానివి పెద్ద అక్షరాలలో దేచీ దేవతలంటూ; నీకు చాలా మంది పెద్ద పెద్ద కళాకారులు తెలుసు అందులో చాలా మంది నీ ప్రేమికులు. ఫర్వాలేదు,…
-
Shudder… MS Naidu, Telugu, Indian
. My Lord! With vision dulled And me failing to thread word-strands Through the eye of the needle, I am constrained to adorn you With these disengaged phonemes Today as well. But Grant me That I could present you a garland Before my sense fails… ultimately. . MS Naidu (DOB : 20th April 1971) Telugu…
-
వరుడు వెళ్ళిపోయాక… ఎలిజబెత్ మహారాణి 1
నేను దుఃఖించాలి, నా అసంతృప్తి ప్రకటించకూడదు నేను ప్రేమిస్తున్నాను, కానీ ద్వేషిస్తున్నట్టు నటించాలి నేను ఏ పనిచేసినా, మనసులోమాట చెప్పలేను నేను ఉత్త మూగగా ఉంటూ లోలోపలే మాటాడుకోవాలి నేను ఉన్నాను, కానీ లేను; వణుకుతున్నట్టున్నా దహించుకుపోతున్నాను నేను నానుండి మరో మనిషిలా ఎప్పుడో మారిపోయాను. నా ఇష్టాలన్నీ ఎండలో నీడలాటివి, వెళుతుంటే వెంబడిస్తాయి, నేను వెంటాడితే దొరక్క పరిగెడతాయి ఎప్పుడూ నా పక్కనే నిలబడి ఉంటాయి, నే చేసేది అనుకరిస్తూ. అతను చూపించిన శ్రద్ధ తలుచుకుంటే…