Personal Law… Shamshad, Telugu, Indian

Though the boy’s was not a government job,

looking at the trail of degrees after his name

my poor school-teacher father,

who could barely make both ends meet,

arranged the Nikah with half a lakh

though it was well beyond his means.

How could I know he would turn me away giving Talaq

making me four-months pregnant within five?

Since parents could not renege their responsibility

as easily as the groom his marriage vows,

I was constrained to parade the corridors of law.

Grandma’s marriage gift melted away for Lawyer’s fee.

 .

Each time I attend the adjournments

I become a hot topic in the courtyard.

My answers suffer lock-up death in the gullet

behind the presumptuous queries at cross-examination.

My fruitless testimony of conscience

bows before bought out depositions.

Before the verdict in my case could be delivered

the judge’s seat changes three occupants.

Our Pleader continues to prolong the case

on the pretext of summons, petitions and clerks.

The male arrogance, encumbrance–free after Talaq

crowns the groom with Sehara once more.

How can I refrain from questioning my Shariyat

which grants him liberty to marry up to four

but leaves the innocent child unfamiliar of father’s face

before me like a question mark,

and reduces me to a vestige of his shriveled Sehara

with the scars of a major operation on my abdomen?

I am ready for any silent resistance

to challenge my “Personal Law” which prescribes

that I should be paid alimony

only for the three-months of Iddat.

.

Shamshad

Telugu

Indian.

.

(ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే నుండి)

 Shamshad

Shamshad lives in Fremont, California. She has recently published her maiden collection of poetry “ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే”

.

పర్సనల్ లా

.

సర్కారీ నౌకరీ లేకున్నా

పిలగాడి పేరుపక్కనున్న డిగ్రీలను చూసి

బతకలేని బడిపంతులు అబ్బాజాన్

తనకు మించినభారమైనా

అరలక్ష లేన్ దేన్ ఇచ్చి నిఖా అయిందనిపించాడు.

 

అయిదు నెలలకే నాలుగు నెలల కడుపు చేసి

తలాక్ ఇచ్చి వెళ్ళగొడతాడని నాకేం తెలుసు?

కట్టుకున్నవాడొదిలేసినా

కన్నవారికి తప్పని బాధ్యత

నన్ను కోర్టు మెట్లు లెక్కబెట్టించింది.

షాదీలో నానీ చేయించిన చల్లా లాయరు ఫీజయ్యింది.

 

వాయిదాకెళ్ళిన ప్రతిసారీ

కోర్టు ఆవరణకు నేనొక పతాకశీర్షికనౌతాను.

క్రాస్ ఎగ్జామినేషన్ లో వకీలడిగిన ప్రశ్నలు పోలీస్ లాఠీలై

నా సమాధానాన్ని లకప్ డెత్ చేస్తాయి.

చెల్లని నా అంతరాత్మ సాక్ష్యం తప్ప

డబ్బిచ్చి తేలేని సాక్ష్యాలు వెక్కిరిస్తాయి.

నా కేసు తీర్పివ్వకముందే జడ్జి సీటు ముగ్గుర్ని మార్చుకుంటుంది.

మా వకీలు మాత్రం పిటిషన్లకి, సమనులకి,

గుమస్తాలకంటూ కాలాన్ని జరుపుతూనే ఉంటాడు.

తలాక్ ఇవ్వగానే ఏ బంధాలతో సంబంధం లేదనే

మగతనపు ధీమా మరోసారి సెహరా కట్టించుకుంటుంది.

తన అబ్బా ముఖం ఎరుగని

నా మాసూం బచ్చీని

నా ముందో ప్రశ్నగా నిలబెట్టి

పొట్టమీది పెద్దాపరేషన్ కత్తిగాట్లతో

వడలిపోయిన సెహరా జ్ఞాపకంగా నన్ను మిగిల్చి

వాడు నలుగురినైనా నిఖా కట్టుకోవచ్చని చెప్తున్న

నా షరీయత్ ని నిలదియ్యకుండా ఎలా ఉండగలను?

మూడునెలల ఇద్దత్ కాలానికే మనోవర్తి చెల్లించాలనే

నా “పర్సనల్ లా”ను ప్రశ్నించడానికి

నే నేమౌన పోరాటానికైనా సిద్ధమే!

.

షం షాద్

“Personal Law… Shamshad, Telugu, Indian” కి 2 స్పందనలు

  1. Good narration of vows of a muslim lady. Justice is not done. Good translation

    మెచ్చుకోండి

    1. Yes Sir, Sarmagaru.

      The woes of every woman no matter to what community or religion she belongs has been like this for ages. The few cases we find different are only exceptions than the rule.
      with best regards

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: