-
బెంగలు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
(నిజానికి ఇది వ్యాఖ్యానం అక్కరలేని కవిత. పిరికి మనిషి ఎప్పుడూ ఒక అభద్రతాభావనలో కొట్టుమిట్టాడుతుంటాడు. ఎన్ని అనుకూలతలు ఉన్నా, చింత ఎప్పుడూ లేనిదానిగురించే. కొందరిని భగవంతుడు సైతం సుఖపెట్టలేడు. ) నిన్న రాత్రి నేనిక్కడ ఆలోచిస్తూ పడుక్కుంటే కొన్ని బెంగలు నా చెవుల్లోకి మెల్లగా దూరి రాత్రల్లా ఒకటే గెంతులూ, అరుపులూ… అవి ఎప్పటిలా వాటి పాత బెంగలపాటే పాడేయి: స్కూల్లో నాకు నోటంట మాట పెగలప్పోతే? వాళ్ళు ఈతకొలను మూసెస్తే? నన్ను ఎవరైనా చితక్కొడితే? నా…
-
ఊహా రేఖలు… ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి
సముద్రం మీద ఎవరో నల్లని గీతలు గీసినట్టుంది అల్లాడకుండా నిశ్చలంగా ఉన్నగాలి అపశృతిలా ఉంది. అల్లకల్లోలంగా ఉన్న క్షితిజరేఖవద్ద గాలికి ఎగరిన పండుటాకులా ఉంది చంద్రరేఖ. తెల్లని ఆ ఇసకమీద స్పష్టంగా చెక్కినట్టు ఉంది నల్లగా ఆ పడవ; నవ్వు ముఖం, తెలియని ఆనందం, మెరుస్తున్న చేత్తో దానిమీదకి వాడ కుర్రాడొకడు ఎగబ్రాకుతున్నాడు. ఆకాశంలో పక్షులు అరుస్తున్నాయి, కొండవాలుమీది ఎండినగడ్డిపనలమీంచి ఎగురుతున్న గోధుమవన్నె మెడలున్న చిన్ని పిట్టలు ఆకాశం మీద గీసిన ఊహా చిత్రాల్లా ఉన్నాయి. .…
-
ఇంటి పైకప్పులు … జాయిస్ కిల్మర్, అమెరికను కవి
(ఎమీలియా జోసెఫ్ బర్ కి) దారి విశాలమైనది, నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నిశీధి ఊపిరులు సుగంధభరితంగా ఉన్నాయి. కాళ్ళకి తిరిగాలన్న వ్యామోహం కలగడానికి ఇదే సరియైన తరుణం కానీ, కనిపిస్తున్న ఖాళీ రాదారినుండీ, ముఖం మీదపడే చుక్కలవెలుగు నుండీ, ఆరుబయలు అద్భుతంనుండీ వెనుదిరిగి, మానుష నివాసానికి మరలడమే ఇష్టం. ఏ ఇల్లూ లేకుండా. ప్రపంచపు రాదారులంట అటూ ఇటూ తిరగాలనుకునే దేశదిమ్మరిని నేను నిజంగా ఇప్పటివరకు చూడనేలేదు. నిన్న రాత్రి మీ కొట్టంలో పడుక్కుని పొద్దుటే…
-
అగాథ జలాలు… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
నిపుణుడైన నావికుడిననీ, చాలా తెలివైనవాడిననీ, చాలా ఆశ్చర్యంగా నాకు వచ్చింది పేరు. అంత ప్రశాంత సాగరం మీద నేర్పరియైన నావికుడు అనువైన గాలివాటు, అనాచ్చాదితమైన నీలి ఆకాశం త్రోవచూపే విశ్వాసపాత్రమైన ప్రేమనిండిన కన్నులు; మిట్టపల్లాలు దాటిపోయాయి, నా జీవన నౌక యధేచ్చగా, ప్రశాంతమైన కెరటాలపై, క్రిందన ఏ గండశిలలు దాగున్నాయన్న చింతలేకుండా, ఏ మార్పులకీ బెదరకుండా సాగుతోంది. స్వర్ణప్రభాతం; అయినా అకస్మాత్తుగా బిగుసుకున్నాయి తుఫానుకి చెదిరినట్టు నా పడవ తెరచాపలు … తెలియని ఏ అదృశ్య కెరటాల…
-
వంతలగృహం… మార్గరెట్ వాకర్ , అమెరికను కవయిత్రి
నా మూలాలు దక్షిణప్రాంత జీవితంలో లోతుగా చొచ్చుకుపోయాయి; అవి జాన్ బ్రౌన్ కన్నా, నాట్ టర్నర్ కన్నా, రాబర్ట్ లీ కన్నా లోతైనవి. నేను పుట్టి పెరిగింది ఉష్ణమండలాల్లో; తాటి చెట్టుకీ, అరటిమొక్కకీ మామిడి, కొబ్బరి, పనస, రబ్బరు చెట్లకీ నేను పరిచయమే. మండుటెండలూ, అఖాతాల నీలిరంగు సెలయేరులూ నా రక్తంలో ఉన్నై. లేత చిగుళ్ళ పరిమళానికీ, నల్లజాతి వారసత్వానికీ విశృంఖలంగా పెరిగే మొక్కల స్వేచ్చకీ చెందినదాన్ని. ఆకాశానికీ దూరంగా, ఇనుమూ, ఇటుకా, కర్రతో కట్టిన గోడలమధ్య…
-
యోధులు ఎలా మరణిస్తారు?… విలియం కాలిన్స్, ఇంగ్లీషు కవి
తమ దేశప్రజల ఆశీస్సులు పొందిన యోధులు ఎలా శాశ్వత విశ్రాంతి తీసుకుంటారు? వారి అపురూపమైన సమాధులని చల్లని మంచు వేళ్ళతో అలంకరించడానికి హేమంతం పునరాగమించినపుడు ఊహలు నడయాడిన ఏ మట్టికన్నా భిన్నంగా గొప్ప విలువైన మిత్తికతో అలంకరిస్తుంది. వారి తుది ఘంటికలని దివ్య హస్తాలు మోగిస్తాయి విషాదగీతికలని అగోచర ఆకారాలు ఆలపిస్తాయి; వాళ్ళ శరీరాలను అక్కునజేర్చుకున్న నేల ననుగ్రహించడానికి యశస్సు, ఒక అలసిన బాటసారిలా విచ్చేస్తుంది. అక్కడ, శోకిస్తున్న మునిలా నివసించడానికి స్వాతంత్ర్యం కాసేపు సేదదీరుతుంది. .…
-
ఉన్నదున్నట్టుగా … జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి
తోట వాకిలి తెరుచుకుంటుంది, సేవకుడికుండే విధేయతతో బహుకాల సేవన ఇచ్చే చనవుతో అడిగే ప్రశ్నలా; తోటలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉండే ప్రతి వస్తువూ యథాతథంగా మనసులో ముద్రవేసి ఉండడంతో వాటిని ఏకాగ్రతతో పరిశీలించవలసిన అవసరం లేదు. నాకు అన్ని సంప్రదాయాలూ, ఆలోచనలూ ప్రతి జనసమూహమూ అల్లే పలుకుబడుల అంతరార్థాలూ తెలుసు; వాటిగూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కరనూ లేదు, లేని హక్కులూ, అధికారాలూ కోరదలుచుకోనూ లేదు. నా చుట్టూ ఉన్నవాళ్ళకి నా గురించి బాగా తెలుసు నా మానసిక…
-
విశ్వాసం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నా ఆత్మ నా శరీర గృహంలో ఉంటుంది నువ్వు, రెండింటికీ స్వామివే. కానీ, నా ఆత్మ, నిర్భయంగా హాయిగా తిరిగే సాహసికుడిలా ఒక్కోసారి ఒదిగి ఉండదు. అదొక శాంతిలేని, కుతూహలము వీడని ఆభాస. అదేం చేస్తుందో నే నెలా చెప్పగలను? నా శరీరపు విశ్వాసాన్నైతే హామీ ఇవ్వగలను. కానీ, నా ఆత్మకి నీ మీద విశ్వాసం తప్పితే? . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . .…
-
A Sweet Calling on the Shore … Kasiraju, Telugu, Indian
Either in the wakes of those surging waves or buried in the slightly wet sands on the shore there lie some hushed legends. which commune freely with every solitude. The imprints of few footprints erased by the sweeping waves pleaded for attention to listen to their story. A violent wave which girdled my feet before…
-
నువ్వు నాకు విడిచిపెట్టినవి… ఎమిలీ డికిన్సన్, అమెరికను
ప్రియా! నువ్వు నాకు రెండు వారసత్వంగా వదిలావు; మొదటిది ప్రేమ భగవంతునికి ఆ వారసత్వం లభించి ఉంటే అతను మిక్కిలి సంతృప్తిచెందేవాడు. కాలానికీ శాశ్వతత్వానికీ మధ్య, నాకూ, నీ స్మృతికీ నడుమ సముద్రమంత విశాలమయిన దుఃఖపు పరిమితులు మిగిల్చావు . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి . . You left me . You left me, sweet, two legacies,— A legacy of…