అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మార్చి 17, 2015

    అమరత్వం… ఫ్లారెన్స్ రాండల్ లివ్ సే, కెనేడియన్ కవయిత్రి

    (యుద్ధరంగంలో క్షణక్షణం మృత్యువును తప్పించుకుంటూ బ్రతికే సైనికుల జీవితాన్ని చక్కగా చెప్పిన కవిత) . నేనొకసారి మరణించేను, కానీ కత్తితో పొడుస్తున్న బాధతో మళ్ళీ ప్రాణం తిరిగొచ్చింది. మరోసారీ ప్రాణంపోయిందనే అనుకుని భయపడ్డాను; కానీ ఫిరంగి  చాలా దూరంగా పడింది. తూటా గాలిని చీల్చుకుంటూ రంయిమని వచ్చింది, చిన్నప్పటి ప్రార్థన ఒకసారి చదువుకున్నాను. నాకు తెలివొచ్చేలోగా మరణం సంభవిస్తే నేను దైవాన్ని కోరుకుంటాను నా ఆత్మని తీసుకుపొమ్మని నేను మేల్కొనే లోగా… . ఫ్లారెన్స్ రాండల్ లివ్…

  • మార్చి 16, 2015

    ఘంటానాదము… ఏలిస్ మేనెల్, ఇంగ్లీషు కవయిత్రి

    నడుస్తున్న కాలంతో పాటు, వణుకుతున్న స్థంబం నుండి, పరిగెడుతున్న ఆ రాత్రి వేళ క్షణమాత్రం ఒక ఘంటల సవ్వడి గాలిలోకి ఎగసింది. సుడిగాలిలోచిక్కుకున్న గూడొదిలినపక్షుల్లా అకస్మాత్తుగా… ఓహ్, శ్రద్ధగా వినండి. ఘంటికా నౌకా సమూహం తెరచాపలెత్తి చీకటి సముద్రం మీద ప్రయాణం చేస్తోంది. ఉన్నట్టుండి చల్లని గాలి వీస్తుంది, గట్టిగా, ఒంటరిగా. ‘గంటల ‘ పద్యాలు రెక్కతొడిగి మేఘాలతో పాటు ప్రయాణిస్తుంది. . ఏలిస్ మేనెల్ల్ (సెప్టెంబరు 22, 1847 – 27 నవంబరు 1922) ఇంగ్లీషు…

  • మార్చి 15, 2015

    మొక్కలాటి మౌనం… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి

    కవిత్వంతో ఏడడుగులు 80 . మొక్కల మౌనం . మీకూ నాకూ మధ్య ఏకపక్ష అనుబంధం బలపడుతోంది. నాకు ఆకు అన్నా, రేకు అన్నా, పప్పు అన్నా, కొన అన్నా, కాండం అన్నా తెలుసు ఏప్రిల్, డిశెంబరు లలో నీకు ఏమవుతుందో కూడా నాకు తెలుసు. నే చూపినంత కుతూహలం తిరిగి నామీద చూపించకపోయినా మీలో కొందరంటే నేను పాదాక్రాంతమౌతాను, మరికొందరంటే, మెడ రిక్కిస్తాను. .   మీకు నేను చాలా పేర్లు పెట్టాను: గంగరేగుచెట్టనీ, ఉమ్మెత్త…

  • మార్చి 14, 2015

    అజ్ఞాత వ్యక్తికి… హెలెన్ డడ్లీ, అమెరికను కవయిత్రి

    (అప్రాప్త మనోహరికి … అని  భావకవులు రాసిన అలనాటి కవితలకి దీనికి చాలా పోలికలున్నాయి ) రోదసిలో నిరంతరం అటూ ఇటూ గర్వంగా తిరిగే ఎన్నో తారలను చూసేను, చివరికి సూర్య చంద్రుల్ని కూడా కాని, చూడనిది నీ ముఖమే. . వాయులీనాన్ని విన్నాను, పైరగాలులూ, ఉత్తుంగ తరంగాలూ ఆనందంతో ఆలపించే అవధిలేని గీతాల్ని విన్నాను ఇంతవరకు విననిది నీ గొంతుకే. . ఇక్కడి మేటి శ్వేత కుసుమం పారిజాతాన్ని పట్టుకున్నాను పగడాన్ని, రత్నభోగినీ తాకేను. తాకనిది…

  • మార్చి 13, 2015

    కుర్రతనమే గాని సహజమే… కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి

    (ఈ కవిత చదివేక నాకు  “ప్రణయలేఖలు” అన్న ఖండికలో పింగళి కాటూరి కవుల పద్యం: “ఎగిరి నీ పాదములచెంత కెట్లొ వచ్చి వ్రాలుదునొయన్న ఉత్సుకత్వమ్ము గలదు; సాధ్య సాధనమైన పక్షముల జంట హృదయమునకుండి లేదు శరీరమునకు” గుర్తుకు వచ్చింది ) *** నాకే గాని రెండు చిన్న రెక్కలుంటే నేనే గాని ఒక చిన్న పక్షినయి ఉంటే ప్రియతమా! నేను నీ దగ్గరకి ఎగిరివచ్చేవాడిని! కానీ ఇలాంటి ఆలోచనలన్నీ ఊసుపోకకి. నేను ఇక్కడ ఉన్నచోటే ఉన్నాను .…

  • మార్చి 11, 2015

    Wafting Fumes… Anveeksha, Telugu, Indian

      .   He did not care To look at her sleeping Puckered up like a book.   He did not for once Glance at the string of pearls her glow-worm fingers lace picking up Each letter in the court of darkness.     Never did he show any intent to know Her creativity ….…

  • మార్చి 10, 2015

    దైవమే నా వెలుగు … అజ్ఞాత ఇంగ్లీషు కవి

    జీవితం మీద భ్రమ తొలగి, మరణ మాసన్నమైన వేళ, గుండె కొట్టుకోవడం మందగించి కళ్ళు మసకబారుతున్నపుడు శరీరంలోని ప్రతి అవయవమూ బాధతో అలసిపోయినపుడు దేవుని ప్రేమించేవాడు అతన్నే నమ్ముకుంటాడు. జీవితలక్ష్యాలగురించిన ఇచ్ఛ మరుగునపడిపోయి, మతి స్థిమితం తప్పుతోందన్న అపవాదు పైబడుతున్నపుడు, తనపేరేమిటో తనకి తెలియనిస్థితిలో మనిషి ఉన్నప్పుడు— భగవంతుని కరుణే అన్ని లోపాలనీ పూరిస్తుంది. చివరి శ్వాస వెలువడి, చివరి కన్నీటిచుక్క రాలి మంచం ప్రక్కనే శవపేటిక ఎదురుచూస్తున్నప్పుడు, పిల్లలూ, భార్యా కూడా మృతుడి ఉనికే మరిచినపుడు……

  • మార్చి 9, 2015

    రుబాయీ— XIV ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి

    మనుషులు పెట్టుకునే ఈ భౌతికమైన ఆశలు బూడిదపాలౌతాయి… తప్పితే, అప్పుడప్పుడు నిజమౌతాయి; కానీ ఎడారి ఇసకమీద కురిసిన మంచులా, త్వరలోనే ఒక గంటో, రెండుగంటలో మెరిసి… మాయమౌతాయి. . ఉమర్ ఖయ్యాం 18 May 1048 – 4 December 1131 పెర్షియను కవి Omar Khayyam XIV The Worldly Hope men set their Hearts upon Turns Ashes — or it prospers ; and anon, Like Snow upon…

  • మార్చి 8, 2015

    Urmila’s Dream… Sarada Sivapurapu, Telugu, Indian

    Happy Women’s Day ! . Some wayward unerasable scribblings on life’s slate Frighten like phantoms in bright light When I put out the light and lie down Closing my eyes, another torch lights within. Then begins an enduring search Seeking to retrace the trodden paths In the translucent darkness Giving shape and life to people…

  • మార్చి 7, 2015

    పట్టముపోయిన మహారాణి… విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి

    ఒకప్పుడు ఆమె ముఖం చూపిస్తే చాలు, జనాలు గుమిగూడేవారు, ముసలివాళ్ళుకూడా కళ్ళు చిట్లించుకు చూసేవారు;  నేనొకణ్ణే దేశదిమ్మరుల తండా దగ్గర పదవీచ్యుతురాలైన మహారాణి గురించి ఏదేదో వాగే రాజసేవకుడిలా, జరిగిందేదో వ్రాస్తున్నాను. ఈ రూపురేఖలు, నవ్వు వల్ల ప్రీతిపాత్రమైన ఆమె మనసూ … ఇవి, ఇవి ఎప్పుడూ ఉండేవే; కానీ నేను మరలిరానివి చెప్తాను. మళ్ళీ జనాలు గుమిగూడతారు, వీధులంట తిరుగుతారు; కానీ ఒకప్పుడు రగిలే మొగులేమో అనిపించే ఒక జీవి … ఆ దారులంటే నడిచిందని వాళ్ళకి…

←మునుపటి పుట
1 … 124 125 126 127 128 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు