అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మే 23, 2015

    ఇచ్ఛ, శక్తి, కర్తవ్యమూ… లె నార్దో దవించి, ఇటాలియను చిత్రకారుడు

    చెయ్యాలనుకుని, చెయ్యలేని వారు – చెయ్యగలిగినవి చేద్దామనుకోవాలి! మనం చెయ్యలేనివి చేద్దామనుకోవడం వృధా; అందుకనే, ఎవడైతే గురిలేకుండా ఎదో ఒకటి చేద్దామనుకోడో అలాంటి వ్యక్తిని మనం విజ్ఞుడు అని అంటాము. మన బాధల్లాగే, మన సుఖాలు కూడా ఎప్పటికీ ఇచ్చాశక్తిగూర్చిన అవగాహనమీద ఆధారపడి ఉంటాయి. అది మనకి తర్కం తన ఆధిక్యతని ప్రకటించుకున్నా, కర్తవ్యానికి తగ్గట్టు సయిష్టంగా తల ఒగ్గడం నేర్పుతుంది అయినప్పటికీ, చాలా సార్లు నువ్వు చెయ్యలేనివి చెయ్యాలనుకోవాలి, మనకోరిక కన్నీరు తెప్పించినా సంతృప్తిగా స్వీకరించాలి…

  • మే 21, 2015

    ప్రేమ మహా దారుణమైనది! … గ్రేస్ ఫాలో నార్టన్, అమెరికను కవయిత్రి

    దిగంతాలనున్న హరిత మైదానాన్ని దర్శించేను లోతెరుగని నీడలో పరున్నాను భూదేవిని అడిగేను, “నన్ను పొదువుకో” అని రాత్రిని ప్రార్థించేను, “నన్ను ఆవరించ”మని గాలిమీద చికాకుగా అరిచేను, “నీకేం తెలీదు ఫో, నీకు ఎదురులేని స్వేచ్ఛ ఉంది,” అని. చిగురాకులనన్నిటినీ వంగి దగ్గరగా గుమిగూడి నాకొక తెరగా నిలబడమని బ్రతిమాలుకున్నాను; తర్వాత చుక్కలతో నా కథ చెప్పుకున్నాను: “అదిగో ఆ లోయలో, అదే మా ఇంటి దీపం. నేను తిరిగి వెళ్ళిపోతానని తెలుసు గాని, ముందు, ఈ కనికరంలేని అడవిలో…

  • మే 20, 2015

    తల్లిలేని పిల్లడు… విలియం థాం, స్కాటిష్ కవి

    ఏ మేనత్తలో, తోబుటువులో, అమ్మమ్మలో నాయనమ్మలో మిగతా పిల్లలందర్నీ తమ ఇళ్ళల్లో హాయిగా నిద్రపుచ్చుతుంటే ఎవరూ పట్టించుకోకుండా ఒంటరిగా అన్నీ కోల్పోయినట్టుండే దెవరు? పాపం,చిన్నతనం ఇంకా వదలని వెర్రిబాగులాడు… తల్లిలేని పిల్లాడే. ఆ తల్లి లేని పిల్లవాడు తన పక్కమీదకి నడుచుకు పోతాడు వెచ్చగా వీపు కప్పేవారూ మెత్తని దిండుమీద తల ఉంచేవారూ లేరు; అతని లేత అరి పాదాలు పగిలి బీటలు బారి ఇనపముక్కల్లా ఉన్నాయి పాపం ఆ తల్లిలేని పిల్లాడు పడుకునే పక్కే చాలా…

  • మే 19, 2015

    నా భర్తకి… అజ్ఞాత కవయిత్రి

    తప్పించుకోలేని ఈ ఐహిక బాధలనుండీ ఈ జీవితం నుండీ నేను నిష్క్రమించినపుడు నా కోసం నల్లని దుస్తులు ధరించవద్దు ప్రియతమా! నువ్వు ఉంగరాన్ని మాత్రం తియ్యకు. దయచేసి ఆ తళతళల వజ్రాన్ని నా గుర్తుగా చేతికి ఉంచుకో అది నీ కళ్ళలో మెరిసినప్పుడు అది పక్కనుండి నడుస్తున్న నా నీడగా భావించు. ఎందుకంటే, ఆ వజ్రం కన్నా, ఆ మాటకొస్తే ఏ రత్నం కన్నాకూడా ప్రకాశవంతంగా నీకు కనిపిస్తాను. అక్కడ ఏదో జరగకూడనిది జరిగినట్టు ఇంటిని నల్లని…

  • మే 18, 2015

    దేవదూతలు… ఎడ్మండ్ స్పెన్సర్, ఇంగ్లీషు కవి

    భగవంతుడు నిజంగా పట్టించుకుంటాడా? ఇంత హీనమైన మనుషులనీ, వాళ్ళ దుర్మార్గాలనీ క్షమించి ఉపకారం చెయ్యడానికి ఇంకా ప్రేమ మిగిలి ఉంటుందా? ఉంది. లేకుంటే, మనుషులు మృగాలకంటే కనికిష్టంగా తయారై ఉండేవారు. ఆహ్! ఏమని చెప్పాలి తన సృష్టిని ప్రేమించే మహోన్నతుడైన ఆ దేవుని కరుణ గురించి! అతని అనుగ్రహాలన్నీ దయారసపూరితాలై ఉంటాయి. అందుకే తనదూతలని అన్నిచోట్లకీ సేవచెయ్యడానికి పంపిస్తాడు: క్రూరమైన మనిషినీ… అంతే క్రూరమైన అతని శత్రువునీ. మనలో సహాయంకోసం అర్రులుచాచేవారికి బాసటగా ఎన్నిసార్లు వారు తమ…

  • మే 17, 2015

    మృగరాజు అస్థిపంజరం… ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి

    ఓ మృగరాజా! ఎన్నాళ్లయింది నువ్విలా రక్తమాంసాలు లేకపడి ఉండి? నీ భీకరమైన ఆకలి చూపులను ఆక్సర్షిస్తున్నదేది? మొదట రాబందులు వాలేయి; తర్వాత క్రిములూ, వేడీ, గాలీ, వర్షమూ అనుసరించేయి; వాటితోబాటే ఉష్ణమండలపు తీవ్రతలూనూ… అవి నిన్ను విడిచిపెట్టేయేమో నాకు తెలీదు; ఎన్నాళ్ళు నీ భారీ శరీరం కుళ్ళిపోయి పడి ఉందో, చివరకి ముక్కముక్కలై నాలుగుచెరగులా వెదజల్లబడిందో, లేక, తుఫానులై ఎగసిన ఇసుక వాటిని తిరిగి భూమిలోకి నెట్టేసిందో, కాని, ఒకప్పుడు తీవ్రమైన ఆగ్రహం ప్రదర్శించిన నీ విశాలమైన…

  • మే 16, 2015

    సానెట్… మార్క్ అలెగ్జాండర్ బైర్డ్, స్కాటిష్ కవి

    చెట్టునుండి జారుతున్న ఎండుటాకులాగా గాలికి ఎగరగొట్టబడ్డ గడ్డిపరకలాగా ఒడ్డునుండి ఒడ్డుకీ, కోననుండి కోనకీ పరిగెడుతూ నా హీన స్వరంతో ఆమెను గెలవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇద్దరు దేవతలు నన్ను నడిపిస్తున్నారు; ఒకరు కబోది, అహంకారంతో పెంచబడిన బిడ్డ; రెండోది సముద్రపు నురుగుకి పుట్టిన పడుచు, దాని రెక్కలతో డాల్ఫిన్ కన్నా తేలికగా ఎగురుతుంది. ఇసకను దున్ని గాలిలో విత్తనం జల్లే మనిషికి ఎప్పుడూ సుఖం ఉండదు; పిల్లవాడి ఉపదేశమూ,అంధుడి మార్గదర్శనంలా మనసులో ఒక వెర్రి కోరిక ఉంచుకుని నిప్పులోకూడా ఆడదాని…

  • మే 15, 2015

    స్వాప్నికులు… వాల్టర్ ఎడోల్ఫ్ రాబర్ట్స్, వెస్ట్ ఇండియన్ కవి

    మనం ఈ ప్రపంచపు అంతులేని స్వాప్నికులం ఎంత కష్టమైనా వృధా ఐనా మన నావలు ప్రయాణించవలసిందే అన్నిసముద్రాలూ కలిసేచోట్లు మనల్ని సాహసానికి పురుకొల్పుతాయి మనమీంచి ఆ చిట్ట చివరి కెరటం పొర్లినపుడుకూడా మళ్ళీ మనం పునరుజ్జివిస్తాం. మనల్ని జయాపజయాలలోంచి ఉద్ధరించగల ఆవేశాన్ని దేవతలు మనకు అనుగ్రహించారు. మనం బంగారులేళ్ళను పట్టుకుందికో, లేక ఏ “శ్వేత”రాణి ప్రేమను గెల్చుకుందికో, కొత్తలోకాలని గెలవడానికో పుట్టలేదు. అయినప్పటికీ, వనదేవతల సాక్షిగా మనం శాంతికోసమూ పుట్టలేదు! కాల,సౌందర్యాలు హరించలేని అమూల్యవస్తువు మనదగ్గరుంది: వినాశకరమైన…

  • మే 14, 2015

    Spiritless Life ….. Anveeksha, Telugu, Indian

    After calling it a day, Oblivious of the smiles Of the inviting jasmines in her plait, He enters home from office Caressing his valentine… the cellphone Serving him dutifully Coffee, breakfast and lunch To the hour From morning to evening Yet, without turning her eye off the TV, She continues her soap operas in her…

  • మే 13, 2015

    సగటు మనిషి … జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి

    ఒకప్పుడు, యుగాలు గడవకముందు ఒక మానవుడు ఉండేవాడు. అతనెవడూ? మర్త్యుడు! అతన్ని నువ్వు ఎలా చిత్రించినా అచ్చం నీలాగే ఉంటాడు. అతనెక్కడపుట్టేడో తెలీదు, అతనెక్కడ మరణించేడో కూడా తెలీదు, అతని పేరు భూమ్మీంచి తుడుచుకుపోయింది; అదొక్క సత్యమే మిగిలి ఉంది. సుఖమూ దుఃఖమూ, ఆశా, భయమూ అతని మనసులో ఒకదాని వెనక ఒకటి నిలిచేయి; అతని బ్రహ్మానందం, విపత్తూ, నవ్వూ, కన్నీరూ, సర్వస్వమూ తెర మాటున మరుగుబడ్డాయి.    అతని గుండె చప్పుడూ వడీ, నీరసించిన శరీరం,…

←మునుపటి పుట
1 … 118 119 120 121 122 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు