అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 4, 2015

    దారీ తెన్నూ లేక… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

    చిత్తడినేల అంటే ఏమిటో తెలీదు, సముద్రాన్ని ఎన్నడూ చూసి ఎరగను కానీ, నాకు అడవిపొదలెలా ఉంటాయో తెలుసు కెరటం అంటే ఊహించుకోగలను. నేను దేవుడితో ఎప్పుడూ మాటాడలేదు స్వర్గాన్ని ఎన్నడూ చూడలేదు కానీ నాకు పటం చూసినంత స్పష్టంగా అదెక్కడుంటుదో ఖచ్చితంగా తెలుసు. . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి . Chartless   I never saw a moor,         I never saw the…

  • జూన్ 3, 2015

    పిల్లాణ్ణిముద్దుచెయ్యి, ఎప్పుడూ ఏడుస్తుంటాడు… లేడీ మేరీ రాత్, ఇంగ్లీషు కవయిత్రి

    పిల్లాణ్ణిముద్దుచెయ్యి, ఎప్పుడూ ఏడుస్తుంటాడు సంతోషపెట్టు, గాలిలో ఎగురుతుంటాడు అడిగింది ఇవ్వు, ఇంకా కావాలంటాడు ఉన్నదానితో ఎప్పుడూ సంతోషపడడు. వాడి కోరికలకి తుది ఉండదు అవివేకమే వాడి అంతులేని సంపద; వాడు ఇచ్చినమాట ఎప్పుడూ నిలబెట్టుకోడు వాడు మాటాడినది ఒక్కటీ నమ్మబోకు. వాడు ఒట్టేసి అబద్ధం ఆడతాడు నిన్ను ఏమార్చడానికి పొగుడుతుంటాడు; ఒక సారి చెయ్యి అందనీ, నిన్ను వదిలెస్తాడు నిన్ను మభ్యపెట్టినందుకు గర్వపడుతుంటాడు నువ్వు ఏడుస్తుంటే వాడు నవ్వుతుంటాడు నీ లోపాలకి మళ్ళీ వాడే కారణం ఇవి వాడి సుగుణాలు,…

  • జూన్ 2, 2015

    The Same Road… Mohan Rishi, Telugu, Indian

    The road looks barren… As if nobody had passed by for years. The deciduous leaves beckon pleadingly. There is no ruffle in the wind. A rusted old bicycle lies leaning onto the wall The sky is devoid of its wonted hues And the earth fails to hide its fissures. No, one cannot retreat his steps; Must…

  • జూన్ 1, 2015

    పాత ఓడలు … డేవిడ్ మోర్టన్, అమెరికను కవి

    పాత ఓడలకి కొన్ని జ్ఞాపకాలు అంటిపెట్టుకుని ఉంటాయి ముక్కిపోయిన వాసనతో బరువులేని సరుకులాగ – లోతులేని సింధుశాఖలూ, ముఖాన్ని ముద్దుపెట్టుకునే నీటిపెదాలూ, తుఫాను రాత్రుళ్ళూ, ఇంతవరకు చెప్పని కథలూ… సూర్యోదయంతో కనిపించే ద్వీపాలూ తమ సన్నని తెరచాపకొయ్యలని పరీక్షించిన అగ్రభూములూ, వెన్నుపలకలను విరిచేసిన వంకరలు తిరిగిన జలమార్గాలూ, ప్రశాంత నీలి గగనపు నిశీధులూ, నక్షత్రాలూ… ఊంహూ, ఓడలు ఒడ్డును మరిచిపోతాయనుకోకు, అలాగే తమని వివేకవంతుల్ని చేసిన సముద్రాలనీ, గాలుల్నీ; మీదుమిక్కిలి, ప్రతి సంఘర్షణా ఒక జ్ఞాపకాన్ని మిగులుస్తుంది;-…

  • మే 31, 2015

    నిశీధి… జేమ్స్ బీటీ, స్కాటిష్ కవి

    చీకటి పడింది, ఇపుడు ప్రకృతిదృశ్యం రమణీయంగా లేదు; నేను విచారిస్తున్నాను, కానీ, ఓ వనసీమలారా మీకోసం కాదు; ఎందుకంటే పొద్దు పొడుస్తూనే మీ అందాలు మీకు తిరిగి వస్తాయి, సరికొత్త సువాసనలు అద్దుకుంటూ, మంచుతో మెరుస్తూ: నేను శీతకాలపు విధ్వంశానికీ వగవను; దయాళువైన ప్రకృతి కుసుమాంకురాల్ని పదిలపరుస్తుంది, చివికిపోతున్న ఈ అస్థికలశం మీద ఎప్పుడు వసంతం కరుణిస్తుంది! నిశీధిలో చిక్కుకున్న ఈ సమాధిపై పొద్దుపొడిచేదెపుడు?  . జేమ్స్ బీటీ, (25 అక్టోబర్ 1735 – 18 ఆగష్టు…

  • మే 30, 2015

    శీతకాలపు స్వారీ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    గుర్రపుస్వారీలో ఉన్న ఆనందాన్ని ఎవరు ప్రకటించగలరు? ఎగరడంలో ఉన్న ఆనందాన్ని ఎవరు విప్పి చెప్పగలరు? అకస్మాత్తుగా కనిపించిన అడవిపూల గుత్తుల్ని తప్పించుకుంటూ విశాలమైన రెక్కలతో, ఆకాశంలో ఎగురుతూ వెళుతుంటే… క్షణికమైన లోకంలో కొన్ని శాశ్వతమైన క్షణాలుంటాయి భగవద్దత్తమైనవి, లిప్తపాటైనా, చెప్పలేని ఆనందాన్నిస్తాయి సూర్యుడు హరివిల్లులు చిందించే తళతళల మంచుస్ఫటికాలతో  నా ముందు పరుచుకున్న విశాలమైన తెల్లని త్రోవకూడా అలాంటిదే,  నేనూ, నా బలశాలి గుర్రమూ దౌడు తీస్తుంటే తెల్లని ఈ పొలాలు, నల్లని పొడవాటి మా జాడలతో…

  • మే 29, 2015

    నిర్ణయం… రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి

    అమెరికను ఆత్మ పలుకుతోంది: సఫలతనందించేశక్తి ఎవని చేతిలో ఉందో తప్పొప్పులు నిర్ణయించే నిర్ణేత ఎవరో మా విశ్వాసమూ, బలిదానాలూ అతనికే మా గమ్యం, మా బలమూ అతని అనుగ్రహమే ఈ స్వేచ్చా ధరిత్రిమీద పండగ చేసుకొండి మా పూర్వపు సంకెలలు పూర్తిగా తెగిపోయాయి;  మరొక్క సారి మాకు మంచికీ చెడుకీ మధ్య నిర్ణయించుకునే అపూర్వ అవకాశం దొరికింది. అయితే అది ప్రార్థనలూ, కన్నీళ్ళతో అంత చవుకగా ఏమీ దొరకలేదు, సందేహాలూ, రోగాలతో పోగొట్టుకున్న మార్గాన్ని మళ్ళీ తిరిగి సాధిస్తాం.…

  • మే 27, 2015

    శోకంలో… థామస్ హేస్టింగ్స్, అమెరికను సంగీతకారుడు

    ఓ ప్రభూ, ఈ కన్నీటి కనుమలలో బాటసారులము,దయతో మార్గాన్ని చూపించు, నీ తీర్పు వెలువడని మా ప్రయత్నాలలో మా చివరి శ్వాస ఉన్నంతవరకూ… ఆకర్షణల బాణాలు మమ్మల్ని బాధించినపుడు మేము తప్పుడుత్రోవలలోకి మరలినప్పుడు నీ అనురాగము మాకు కరువైపోకూడదు నీదైన సన్మార్గంలో మమ్మల్ని నడిపించు. బాధల, ఆవేదనల వేళల్లో మృత్యువు సమీపిస్తున్నప్పుడు మా మనసులు ఆందోళనచెందకుండా చూడు మా ఆత్మలు భయవిహ్వలం కానీయకు; ఈ మర్త్య జన్మ ముగిసినపుడు నీ అక్కున సేదదీరగా మమ్ము ఆహ్వానించు, దేవతల…

  • మే 27, 2015

    ఎండవేడిమికి ఇక భయపడనవసరం లేదు… షేక్స్పియర్

    (ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం) ఎండ గురించి ఇక భయపడ పనిలేదు శీతకాలపు చలిగురించి కూడా; నువ్వు ఈ జీవితపు కర్తవ్యం నిర్వహించి ఇంటికి తిరిగిపోయావు, ప్రతిఫలం అందుకుని; అందగాళ్ళైనా, అందగత్తెలైనా చిమ్నీలు తుడిచే పిల్లల్లా మట్టిపాలు కావలసిందే. గొప్పవాళ్ళ ఆగ్రహానికి భయపడ పనిలేదు, నిరంకుశుల శిక్షల పరిథి దాటిపోయావు; ఇక తిండికీ బట్టకీ చింతించే పనిలేదు; గడ్డిపరకైనా, మహావృక్షమైనా నీకు ఒక్కటే; అందరూ చివరకి మట్టిలో కలవవలసిందే. మెరుపులకి భయపడే పని లేదు,…

  • మే 24, 2015

    నిర్లక్ష్యం… ఆస్కార్ ఫే ఏడమ్స్, అమెరికను కవి

    నిర్లక్ష్యం అంటే ఏమిటని నన్నడుగుతున్నావా? సర్లే, ఆ మాటకి నాకు అర్థం తెలుసును. నిర్లక్ష్యం అంటే ఒకప్పుడు నువ్వు చలికాచుకున్న మంటను వదిలిపెట్టి బూడిద వెతుక్కోడం; దురదృష్టవశాత్తూ స్నేహానికి తలుపుతెరిచిన తాళాన్ని పోగొట్టుకోడం; ఒకప్పుడు నీకోసం మెరిసినకళ్ళు ఇప్పుడు నువ్వు చూసినా పట్టించుకోకపోవడం; ఒకనాడు ఉన్నది ఇకమీదట ఎన్నడూ ఉండదన్న సత్యం గ్రహించడం ఇప్పుడు నువ్వు దేన్నీ నమ్మవని తెలుసుకోవడం, వయసు ఎప్పుడో తెలియకుండా జారిపోయిందని గ్రహించడం, ఆశ తిరిగి చిగురించదని అర్థం చేసుకోవడం. చివరకి ప్రేమంటే…

←మునుపటి పుట
1 … 117 118 119 120 121 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు