అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఆగస్ట్ 4, 2015

    వెన్నెల్లో… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి

    “ఓ ఒంటరి పనివాడా, ఊహలలో తేలుతున్నట్టు అక్కడ నిలబడి ఆమె సమాధివంక అలా ప్రక్కన మరో సమాధిలేనట్టు ఎందుకు తేరి చూస్తావు? శుష్కించిన నీ పెద్ద కన్నులు అంతగా ప్రాధేయపడితే శవంలా చల్లబడిన ఈ వెన్నెల వెలుగులో, ఆమె ఆత్మ బహుశా నిరాకారస్వరూపాన్ని ధరించి పైకి లేస్తుందేమో.” “ఓయ్ వెర్రిడా! ఇక్కడ మనుషులెవరికీ అక్కరలేకపోయినా నేను ఇపుడు చూద్దామనుకుంటున్నది సరిగ్గా అదే. కాని ఏం లాభం? నా కలాంటి అదృష్టం లేదు.” “అయితే, నిస్సందేహంగా ఆమె నీ…

  • ఆగస్ట్ 3, 2015

    బార్జిస్ లో ఉషోదయం… హెర్మన్ హేగ్ డోర్న్, అమెరికను కవి

    స్వచ్ఛమైన గాలి, పచ్చని మైదానం, సెలయేటి పాట, గంగడోలుగంటల గణగణ… ఓ మనిషీ! మనం ఎంత మూర్ఖులమి జైలు గదుల్లో జీవితం గడపుతున్నాము! పచ్చని దృశ్యాలూ, విశాలమైన ఆకాశాలూ మనజీవితంలో భాగం కాకుండా ఉరకలేసే హృదయాన్ని అబద్ధాలతో కోసి చంపుతూ… మెరిసే శిఖరాలు, ఒక్కసారిగా ప్రశాంతమైన లోయలోకి వెలుగు వరద, పచ్చని చేలు నా మోకాళ్ళు తడుముతున్నాయి: మంచి దిగుబడి వస్తుంది అంతా బాగానే ఉంది! ఓ మనిషీ! మనం ఎంత మూర్ఖులమి జైలు గదుల్లో జీవితం…

  • ఆగస్ట్ 2, 2015

    Sonnet 2… షేక్స్పియర్

    ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం ఈ కవితలన్నీ ఒక అజ్ఞాత యువకుణ్ణి (Mr. W H) ఉద్దేశించి వ్రాసినవి  (బహుశా పెళ్లి చేసుకుందికి నిరాకరిస్తున్న ఈ యువకుణ్ణి సున్నితంగా పరోక్షంగా మందలిస్తున్నట్టు కనిపిస్తుంది)   నలభై వసంతాలు నీ ఒంటి పైబడి, నీ సౌందర్యక్షేత్రంలో లోతుగా నెరియలు తీసినపుడు, నీ గరువపు పరువాల ఉడుపులు పరీక్షించినపుడు అవి పీలికలై, పనికిమాలి విలువలేనిగా కనిపిస్తాయి; ఇపుడు ఎవరైనా “నీ సౌందర్యమంతా ఏమయింది?”అనో, “నీ జవ్వనపు సిరులేమయినా?”యనో…

  • ఆగస్ట్ 1, 2015

    తారానివహపు మాయ… రిచర్డ్ బట్లర్ గ్లేంజర్, అమెరికను

    నేనూహంచలేని ఏ దివ్యకుసుమాన్ని మించి ఈ రోజు మీ సౌందర్యం ఉన్నా ఈ రాత్రి మీరు నా మనసు దోచలేరు ఎందుకంటే నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. విరబూచిన గన్నేరులా గాలి అలలలో తేలిపోతూ… ప్రతి పువ్వునీ చెంతనున్న మరోపువ్వు అధిగమిస్తూ… భగ్గున వెలిగిన మంటలా, ఆకుపచ్చని చారల రత్నంలా; నక్షత్రాల తళతళలతో ఆకాశం అద్భుతమైన స్ఫటికంలా అక్కడక్కడ నీలి పొడిజల్లినట్టు ఉంది. ఈ ఒక్క రాత్రికి నా మనసు గండుతుమ్మెద అయిపోయింది నక్షత్ర నివహాన్ని విరినికుంజముగా ఊహించుకుంటూ ……

  • జూలై 31, 2015

    Memories… Sivasagar, Telugu, Indian

    The impression of the tear My sweetheart shed in feigned anger The memory of the funeral pyre Kindled on the deathbed of a banyan tree The flotsam rudder reminiscing Its ship lost on the high seas The heady recollection of his ultimate dream Reflecting in Spartacus’s eyes The resonance of the cock-a-doodle-doo At the break…

  • జూలై 30, 2015

    కనుమరుగు… విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్, ఇంగ్లీషు కవి

    నీడలేని ఎండలో, పిరమిడ్ కి దగ్గరగా, దాని శిఖరం మిట్టమధ్యాహ్నపు పగటిని చీలుస్తుంటే కళ్ళు తెరవలేని వెలుగు క్రింద తెల్లని బట్టలు ధరించి ఎండలో చెమటలు కక్కుకుంటూ బానిసలు పడుకుని నిద్రపోతున్నారు. వాళ్ళకి నాలుగుచెరగులా,తెరిస్తేచాలు కళ్ళు మండే ఎండ ఎడారి దారుల పొడుగునా తన తేజస్సుని వెదజల్లుతోంది; ఊహించడానికి భయమేస్తూ, తీక్షణంగా, మిరుమిట్లు గొలుపుతూ అంతూ పొంతూ లేని ఒక తెల్లని శూన్యం పరుచుకుని ఉంది. ఆ పిరమిడ్ చీకటి అంతర్భాగంలో శతాబ్దాలుగా సూర్యుడు చొరని చరిత్రతో…

  • జూలై 29, 2015

    పర్వతాలు ఒంటరివి … హేమ్లిన్ గార్లాండ్, అమెరికను

    పర్వతాలు పాపం మూగవి; అవి ఒకదానికొకటి దూరంగా ఒంటరిగా ఉంటాయి. రాత్రిపూట వాటిశిఖరాలను చుంబించే మేఘాలు వాటి మూలుగులుగాని, నిట్టూర్పులుగాని వినలేవు. సైనికుల్లా, వాటిని నిర్దేశించిన చోట ధైర్యంగా, నిటారుగా తలెత్తుకుని నిలబడతాయి వాటి పాదాలచెంత అడవుల్ని పొదువుకుని ఆకాశాన్ని పడిపోకుండా నిలబెడతాయి. . హేమ్లిన్ గార్లాండ్ September 14, 1860 – March 4, 1940 అమెరికను కవి, కథారచయిత . . The Mountains are a Lonely Folk  . The mountains…

  • జూలై 28, 2015

    నవంబరు అతిథి… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను

    ఆమె నా పక్కన ఉంటే, నా సంగతి ఏమి చెప్పను ఈ చెట్లు ఆకులు రాల్చే చీకటిరోజులే రోజులు ఎలాఉండాలో చాటే గొప్ప రోజులంటుంది; మోడువారి ఎండిపోయిన చెట్లంటే ఆమెకు ఇష్టం; చిత్తడిగాఉండే పచ్చికదారులంట నడుస్తుంది.   ఆమె సంతోషం నన్ను నన్నుగా ఉండనీదు ఆమె మాటాడుతూ ఉంటుంది, నేను తృప్తిగా వింటూంటాను; పక్షులెగిరిపోయినందుకు ఆమెకు సంతోషం ఆమె ధరించిన సాదా గోధుమరంగు ఉన్ని వస్త్రము అంటుకున్న మంచుతో వెండిలా మెరుస్తున్నందుకు ఆనందం.   ఈ నిర్మానుష్యపు ఒంటరి వృక్షాలూ…

  • జూలై 27, 2015

    కటుత్వానికి అలసిపోయాను… ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను కవి

    నేను తెలివిగా, కటువుగా ఉండి ఉండి అలసిపోయాను, చిరకాలం తర్వాత వాటి ఆహార్యాలూ, తెరలూ తొలగిపోయాయి  ఏడ ద్వీపాలు ప్రశాంతంగా ఉంటాయో, జలధిలో సూర్యుడుదయిస్తాడో అక్కడికిపోయి సంగీతం ప్రసాదించే వివేకంలో వాటిని లయించుకుంటాను. సంగీతంలో ఋషులకుకూడా తెలియరాని మహిమలున్నాయి రహః తనూరుహాలపై అచ్చపు వింతశక్తులు మనప్రక్కనుండే ఎగురుతాయి; నిస్సందేహంగా స్తబ్ద పూర్వ యుగాల నీరవ నిశ్శబ్దంలోంచి రోదసిని వెలుగుతో నింపి అస్థవ్యస్థ ప్రకృతికి జీవంపోసింది సంగీతమే. మనకి తెలిసినదంతా నిష్ప్రయోజనం; మనం వెంపర్లాడేవీ నిష్ఫలములే పొగడ్తలతో అధిక భారాన్ని…

  • జూలై 26, 2015

    డయొజినెస్… మాక్స్ ఈస్ట్ మన్, అమెరికను

    ఒక పాక, ఓ చెట్టూ ఓ కొండ వాలు, పచ్చిక బలిసిన మైదాన ప్రశాంతత నాకు చాలు, మరేం కోరను. దేవుడైనా, మహరాజైనా తన నీడని నామీంచి తప్పించమంటాను. . మాక్స్ ఈస్ట్ మన్ అమెరికను . ఈ కవితని అర్థం చేసుకుందికి చిన్న వివరణ అవసరం. (డయొజినెస్ ఆఫ్ సైనోప్ (క్రీ. పూ. 412/ 404 – 323 ) ఒక గ్రీకు తత్త్వవేత్త.   అతను మాటలలో కంటే, ఆచరించడం ద్వారా మాత్రమే విలువలు…

←మునుపటి పుట
1 … 111 112 113 114 115 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు