అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • సెప్టెంబర్ 3, 2015

    చివరి ఒప్పందము… రవీంద్రనాధ్ టాగోర్, బెంగాలీ, భారతీయ కవి

    “నాకు ఎవరైనా పని ఇప్పించరా?” అని నేను పొద్దున్నే వేడుకున్నాను. నేను చక్కని రాళ్ళు పరచిన రహదారి మీద నడుస్తున్నాను. చేతిలో కత్తితో మహరాజు  రథం  మీద వచ్చేడు. చేయి చాపుతూ, “నా అధికారంతో నీకు పని ఇస్తునా, రా” అన్నాడు. కాని అతని అధికారానికి నేను విలువ ఇయ్యలేదు. అతని రథం మీద తిరిగి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. అందరూ తలుపులు వేసుకున్నారు. నేను వంకరతిరిగిన సందుల్లోంచి నడుస్తున్నాను. ఒక ముదుసలి బంగారు సంచితో…

  • సెప్టెంబర్ 2, 2015

    సానెట్ 4… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

    ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం ఈ సానెట్లు వివాహానికి విముఖంగా ఉన్న ఒక యువకుడిని ఉద్దేశించి వ్రాసినట్టు పండితుల అభిప్రాయం.     ఔదార్యములేని సొగసుకాడా! నీ సౌందర్యపు వారసత్వాన్ని నీ మీదే ఎందుకు ఖర్చు చేసుకుంటావు? ప్రకృతి ఇవ్వడానికితప్ప దాచుకునే ఉపాయనాలు ఈయదు, అది నిష్కపటి; అందుకే అన్నీ ఉచితంగానే ఇస్తుంది. అలాటపుడు, ఓ సౌందర్యలోభీ, ప్రకృతి ఉదారతతో ప్రసాదించిన బహుమానాన్ని ఎందుకు నిష్ఫలం చేస్తావు? ఓ వ్యర్థ కుసీదకా, సంపదలలోకెల్ల స్రేష్ఠమైన…

  • ఆగస్ట్ 31, 2015

    సుదూర భవిష్యత్తులోని కవికి… జేమ్స్ ఫ్లెకర్, ఇంగ్లీషు కవి

    వెయ్యేళ్ళ క్రితమే గతించిన నేను, నీకు ఈ ప్రాక్తన  మధుర గీతం రాస్తునా. మాటలే నీకు వార్తాహరులుగా పంపుతునా నేను నీతో కలిసి నడవను గనుక. నువ్వు సముద్రాలపై వారధులే కడతావో భీకరమైన రోదసిలో భద్రంగా ప్రయాణిస్తావో ఉత్కృష్టమైన రమ్యహర్మ్యాలే నిర్మిస్తావో,లేక ఇనుమూ,ఇటుకతో కట్టుకుంటావో నా కనవసరం . ఇంకా సంగీతమూ, మద్యమూ దొరుకుతున్నాయా? విగ్రహాలూ, ఇంతలేసి కన్నులున్న ప్రేమికలున్నారా? మంచీ, చెడూ గురించిన పిచ్చి పిచ్చి ఆలోచనలున్నాయా? ఊర్ధ్వలోకాల్లోని వారికై ప్రార్థనలున్నాయా? మనం  మనసులెలా గెలవాలి? సాయంత్రవేళ…

  • ఆగస్ట్ 30, 2015

    Come! Let’s weave a dream for the morrow… Sahir Ludhianvi,

    Come! Let’s weave a dream for the morrow, Lest this grave enduring night should bite And unnerve us, that for the rest of our lives, Our heart and mind fail to weave a colorful dream! Though youth is fleeting from us like a dart Life totes on the mere strength of dreams … Dreams of…

  • ఆగస్ట్ 29, 2015

    సార్వజనీనిక ప్రార్థన… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి

    సమస్తభూతకోటికి తండ్రివయిన పరమాత్మా! దేశకాలావధులుదాటి జనులు నిను కొలుస్తారు ఋషులూ, పండితులూ, పామరులన్న భేదంలేకుండా యెహోవావనో, అల్లావనో, ఈశ్వరుడవనో! సృష్టికి ఆదికారణమవు; కానీ, ఎవరికీ ఆకళింపు కావు: నా ఇంద్రియాలకి ఇంతవరకు మాత్రమే తెలుసుకునేలా నిర్దేశించేవు:నువ్వు దయామయుడవనీ, నేను మాత్రం నిన్ను కనుగొనలేననీ. అయినప్పటికీ, ఈ విశాలనిశాజగతిలో చెడులో మంచిని చూడగలిగే దృష్టి ప్రసాదించేవు; ఈ ప్రకృతిని విధితో గట్టిగా ముడివేస్తూనే మనిషికి ఇచ్చవచ్చినది చేయగల స్వేచ్ఛనిచ్చావు. నా మనసు ఏది అనుమతిస్తుందో అది చేసేలా, ఏది…

  • ఆగస్ట్ 28, 2015

    ఒక ముదిత… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    నువ్వు అందమైన దానివే, కాని అది గతం, ఒక పురాతన పియానో మీద ఆలపించిన ఒకనాటి సంగీత రూపకంలా; లేదా,18వ శతాబ్దపు అంతిపురాల్లో సూర్యకాంతులీనే పట్టువలిపానివి. నీ కన్నుల్లో గడువు మీరి, వ్రాలుతున్న నిమేష కుసుమాలు నివురుగప్పుతున్నాయి; నీ ఆత్మ సౌరభం ఏదో తెలియని వాసనతో ముంచెత్తుతోంది చాలకాలం మూతవేసిన జాడీల్లోని ఆవకాయలా. కానీ, నీ గొతులో పలికే స్వరభేదాలు వాటి మేళవిప్ములు వింటుంటే నాకు మనోహరంగా ఉంది. నా శక్తి అప్పుడే ముద్రించిన నాణెం లాంటిది…

  • ఆగస్ట్ 27, 2015

    Staking Life… Mohan Rishi, Telugu, Indian

    There is nothing more to be dreadful about death, Nor, are there any illusions of it visiting a particular day. The light and night try to neutralize one another Pleasures and pains are not exempted. Today walks over us to morrow The survivors continue their death-ward journey. Death lurking in every step, and Life abiding…

  • ఆగస్ట్ 26, 2015

    నాకు తెలుసు, నాకొక్కడికే తెలుసు… ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి

    నాకు తెలుసు, నాకొక్కడికే తెలుసు… ఏ నమ్మకమూ, ఏ నియమమూ, ఏ సంగీతమూ, ఏ ఆలోచనా లేకపోతే ఈ హృదయం ఎంత గాయపడుతుందో. నాకు తెలుసు, నాకొక్కడికే తెలుసు… కాని అదేదీ నేను చెప్పలేను. ఎందుకంటే ఆ అనుభూతి ఆకాశం లాంటిది కనిపిస్తుంది, చూడడానికి ఏమీ ఉండదు. . ఫెర్నాండో పెసో June 13, 1888 – November 30, 1935 పోర్చుగీసు కవి Fernando Pessoa . I Know, I Alone . I…

  • ఆగస్ట్ 25, 2015

    పవనమూ— తంత్రీ వాద్యమూ … ఎడ్విన్ మారఖామ్, అమెరికను కవి

    [ఇది చాలా అపురూపమైన కవిత. చిన్ని చిన్ని మాటలతో, సున్నితమైన భావనలను   వ్యక్తపరచగలిగేడు కవి. ఇది పరాకుగా చదివితే సూఫీకవుల కవిత అనుకునే అవకాశం ఉంది. ఈ కవిత చదువుతుంటే, ముఖ్యంగా మొదటి త్రిపది, నాకు వేదుల సత్యనారాయణ శాస్త్రిగారి “ఆశాగానము” గుర్తొచ్చింది.  చిత్తగించండి: ఏ సడి లేక ఈ ప్రకృతియెల్ల గభీర నిశా నిబద్ధమై నీ సుకుమారహస్తముల నిద్దురవోయెడు మౌన వేళ, నీ వే, సరిజేసి, ఈ శిధిలవీణను పాడుమటంచు నా పయిన్ ద్రోసెదవేల,…

  • ఆగస్ట్ 24, 2015

    సానెట్ -3… షేక్స్పియర్

    ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం ఒకసారి అద్దంలోకి చూసుకుని, కనిపించిన ముఖానికి చెప్పు: ఆ ముఖం మరో ముఖాన్ని తీసుకురావలసిన వయసు ఒచ్చిందని, ఆ లోపాన్ని గాని నువ్విప్పుడు భర్తీ చెయ్యకపోతే నువ్వు ప్రపంచాన్ని మభ్యపెట్టి, కాబోయే తల్లిని అన్యాయం చేస్తున్నావని. బిడ్డలను కనవలసి వస్తుందని నీ సహచర్యాన్ని తిరస్కరించే అందమైన స్త్రీ ఎక్కడైనా ఉందేమో చూపించు? మృత్యువంటే అంత అపేక్ష ఉన్నవారెవరు, తన అందం మీద ప్రేమతో బిడ్డలను కనకుండా ఉండడానికి? నువ్వు…

←మునుపటి పుట
1 … 108 109 110 111 112 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు