-
అస్వస్థతతో మంచంపట్టినపుడు… జాన్ మెయిస్ ఫీల్డ్, ఇంగ్లీషు కవి
పగలల్లా గాలి రొద వింటూనే ఉన్నాను అది ఏమి చెప్పదలుచుకుందో దానితో సహా. రాత్రల్లా గాలి చేసిన చప్పుళ్ళు విన్నాను పోరాటానికి పోతూ అదిచేసిన హాహాకారాలతో సహా. గాలి ఆగగానే వర్షమూ వర్షం ఆగగానే గాలీ కొండమీద దాడి చెయ్య సాగేయి అది మాత్రం నిశ్చలంగా ఉంది. పగలల్లా సముద్రం నేలని స్థిరంగా ఉండనీలేదు, రాత్రల్లా నేలమీదకి సముద్రంలోని ఇసక అంతా పోగుపెడుతూనే ఉంది రాత్రంతా అది తెల్లగా మెరవడం చూశాను ఘోరమైన దాని జుత్తు విరబోసుకుని…
-
సానెట్ 73… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరము నువ్వు నాలో చూసే వయసు ఎలాంటిదంటే పేరుకి ఒకటి రెండు పండుటాకులు కొమ్మలకి వేలాడుతూ ఒకప్పుడు కలకూజితాలతో పులకించి, రాగహీనమై శీతకాలం రాగానే వణికే చెట్టులాటిది; నువ్వు నాలో చూస్తున్న సాంధ్యరాగం సూర్యాస్తమయం కాగానే చీకటిలో కలిసిపోయేటిది. మృత్యువుకి ప్రతిరూపమై, అన్నిటినీ కనుమరుగుచేసే చిమ్మ చీకటి దానిని అంచెలంచెలుగా కబళిస్తుంది. నువ్వు ఇపుడు నాలో చూస్తున్న వెలుగు యవ్వనపు చితాభస్మము మీద కనిపించే జిగి లాంటిది. మరణశయ్యమీద…
-
A Shriveled Memory… Praveena Kolli, Telugu, Indian
From the stack of memories A shriveled piece of paper Slipped by accident. When I tried to read as much I could By flattening it out, Eyes already brimming with tears Made it more blearier. Rubbing the eyes with left index finger When I tried to run the right underlining the letters The dampened paper…
-
ఒక సాయంత్రం … ఫ్రెడెరిక్ మానింగ్, ఆస్ట్రేలియన్ కవి
ఎవరూ చప్పుడు చెయ్యొద్దు, నా బాబు పడుకున్నాడు రొదచేస్తున్న ఓ వడి గాలీ! నువ్వు కూడా హుష్! ధారాపాతంగా కురుస్తున్న వర్షమా! నువ్వూ హుష్! రేపు పొద్దుపొడిచేదాకా బిడ్డని నిద్రపోనీండి. మీరందరూ నెమ్మది! ఇకనుండి జీవితమంతా అతను మూటగట్టుకునేది దుఃఖమే; నవ్వులుండాల్సిన చోట కన్నీరుంటుంది కనీసం నిద్రలోనైనా అతనికి శాంతి నివ్వండి. హుష్ అంటుంటే?! జబ్బుతో బలహీనంగా ఉన్నాడు అతని ఏడుపులో కొంతపాలు వాళ్ళమ్మతో పోనీండి. అదిగో వడిగాలీ, హుష్! నీ రొద కొంచెం ఆపు! ఎవరూ…
-
చెట్లు (606) … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
చెట్లు ఒకటొకటి ఒరుసుకు ఊగుతున్నాయి జడకుచ్చుల్లా; సూర్యుడిని అనుసరిస్తూ లేస్తున్న అల్ప ప్రాణుల్లో సంగీతం నిదురలేస్తున్నట్టుంది. వీనుల విందు చేస్తున్న సుదూర ప్రభాతస్తుతి గీతాలు దూరాన ఉండబట్టే, మధురంగా ఉన్నా మనసుతీరా వినిపించడం లేదు. సూర్యుడు దోబూచులాడుతున్నాడు, ముందు పూర్తిగా తర్వాత సగం, పిమ్మట అసలు కనిపించకుండా తనకి ఇష్టమైనప్పుడే కనిపించాలనుకుంటున్నట్టు; అతని దగ్గర ఎంత వనసంపద ఉందంటే అది అతన్ని పూర్తిగా మూసెయ్యగలదు. శాశ్వతంగా కనిపించనీకుండా కాకపోతే అలా ఫలవృక్షాలను ఎదగనీడం అతనికి ఒక సరదా…
-
Phonemes and Poems… Virinchi Sharma, Telugu, Indian
What if a lone faceless idea Gets lost like a homeless child In the spectacle of words? Enough if one has an enduring faith That it would come back as a poem Should it survive somewhere, somehow. If it were a dream To be able to pen a good poem, Well, at dawn, I…
-
The Fall… Mahe Jabeen Baig, Telugu, Indian
He was always like that. Whenever I asked him to come alone He would bear Springs along; In the silence of the open without Trees used to rehearse marching drills; The sky-scape would freeze In the waters of the meandering stream. ………… I faintly remember the stars melting away. * No. No I neither want the…
-
భగవత్ స్వరూపము… విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి
క్లేశములో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కోరేది కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ; ఆనందాన్నిచ్చే ఈ సుగుణాలకి వాళ్ళు పదేపదే కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ మన తండ్రియైన భగవంతుని రూపాలు; కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ తన కుమారుడు మనిషికి రక్షలు. కరుణకి మానవ హృదయం ఉంది జాలిది మనిషి ముఖం ప్రేమ మనిషిరూపంలోని అపర దైవం ప్రశాంతతది మానవ ఆహార్యం. కనుక ప్రతి మనిషి, ఏ దేశవాసియైనా తను కష్టాల్లో ఉండి ప్రార్థించినపుడు మానవరూపంలోని…
-
పరిశీలన… స్విన్ బర్న్, ఇంగ్లీషు కవి
I పాపాయి పాదాలు, గవ్వల్లా గులాబివన్నెలో ఉన్నాయి, మనకి మోహము కలిగి, దైవముచితమని అనుగ్రహిస్తే, ఒక దేవత పెదాలు ముద్దాడాలనుకున్నపుడు మనకు ముందుగా కనిపించేవి పాపాయి పాదాలే. సూర్యుడివైపు తిరిగే గులాబిరంగు వనధిపుష్పాల్లా అవి ఆకాశంవైపు ప్రతి లిప్తా సాగుతూ, లేస్తాయి ఆ పది కోమలమైన మొగ్గలూ కలుస్తూ వేరవుతుంటాయి. విరిసి ముకుళించే ఏ కుసుమ కోరకమూ అందులో సగపాటి నెత్తావినైనా విరజిమ్మలేదు పాపాయి పాదాల్లా జీవితపు కొత్తదారులలో వెలుగు వెదజల్లలేవు. II పాపాయి చేతులు, ముడుచుకున్న…
-
Just That… Naresh Kumar, Telugu, Indian
“… Then, why didn’t you express your love for me that day?” Looking at me over the tea cup, she asked with a smile. We must be meeting some fifteen years since. “Then I wasn’t aware what love was!” I said. Time shed minutes silently like a deciduous tree. A tender boy cleansed them off…