-
మా కృతజ్ఞతలు … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి .
ప్రభూ! సాయంవేళ నదీతీరాన కలుపుమొక్కలమీదకూడా సూర్యుడు మెరుస్తూ కలిగిస్తున్న ఇక్కడి ఆహ్లాదానికి నీకు మా కృతజ్ఞతలు . ప్రభూ! వేసవిలో బోసికాళ్ళతో, బోసితలల్తో గడ్డిలోకి గుమికే పిల్లల కేరింతలకి కృతజ్ఞతలు. ప్రభూ, సూర్యాస్తమయానికీ, తారల వెలుగులకీ, మమ్మల్ని పొదువుకునే స్త్రీలకూ, వాళ్ళ తెల్లని చేతులకూ నీకు మా కృతజ్ఞతలు. ప్రభూ! నీకు చెముడూ, అంధత్వమూ వచ్చి మా కృతజ్ఞతలు నీకు అందకపోతే, ఊరి చివర శ్మశానాల్లో మృతులు తమ శవపేటికల్లోనూ, లేదా, యుద్ధంలో చనిపోయినవారు అజ్ఞాతంగా ఏ…
-
ప్రార్థన… క్లారా షెన్ ఫెల్ట్, అమెరికను కవయిత్రి
గాజువస్తువులు తయారు చేసే కాలమా! నీ కొలిమిలోని గాజుతో అన్ని ఆకారాలూ తయారు చేసేశావా? నీ దగ్గరం ఇంకా అందమైన గంట మరొకటి లేదా? ఇంకా స్పష్టమైన గాజు బుడగ లేదా ఆనందమంత నిష్కల్మషమైనది?… ఉంటే ఊది నన్ను తయారుచెయ్యి చుక్కలు వెలుగులు చిమ్మడం నేర్చిన నాటినుండీ చంద్రుడు వెన్నెలతో రేయిని మొదట బాధించిననాటినుండీ ఇప్పటి వరకూ ఏ ద్రాక్షతీగనుండీ రాని మధురమైన మదిరని నిక్షిప్తం చేయడానికి యోగ్యత ఉండేలా. . క్లారా షెన్ ఫెల్ట్ అమెరికను…
-
పూర్ణ జీవనం… కేథరీన్ డేవిస్ చాప్మన్ (టిల్మన్), అమెరికను కవయిత్రి
జీవితం పరిపూర్ణంగా జీవించడమంటే మానసికంగా ఎంతో బలం కలిగి ఉండి ఉదాత్తమైన విషయాలను గ్రహించగల నేర్పు కలిగి అందుకోవాలన్న ఆకాంక్ష, శ్రమ, కృషి, ప్రయత్నం చెయ్యడం. లౌల్యాలనుండి మచ్చలేకుండా బయటపడడం. భూనభోంతరాళంలో దైవం రచించిన మంచి గుర్తించి మన పాత్రని … ఎంతచిన్నదైనా … సవ్యంగా నిర్వర్తించి ఆ తర్వాత హాయిగా నిష్క్రమించడం. ఆ మరణం ఎలాంటిదంటే హేమంతపు చలికి, కురిసిన మంచుకి నిర్జీవంగా పడున్న భూమి అనంతామృతధారలు వర్షించే విధి వసంత సృజనకి మునపటికంటే అందంగా…
-
ఒక బిడ్డ వెతుకులాట… ఫ్రాన్సిస్ (వెల్స్) షా, అమెరికను కవయిత్రి
మా అమ్మ నాకు అప్పుడే మంచుతో తడిసిన గులాబులతో మాలకట్టేది చాలా సార్లు ఆ తోట ఎక్కెడ ఉందా ఎక్కడ ఉందా అని ఎంతో వెతికేను ఏ చెట్టుకి మా ఆమ్మ కోసిన ఆ పువ్వులు పూచేయో ఎంతప్రయత్నించినా కనుక్కోలేకపోయాను. ఓ పిల్లా! కనుక్కోవాలని ప్రయత్నించకు మీ అమ్మ పూలుకోసే పూలచెట్టు ఆచూకీ. మా అమ్మ నాకు ఎప్పుడు ఉదాత్తమైన కథలు చెప్పేది; ఎవరూ గమనించనపుడు ఆ పుస్తకం చూడాలనిపించేది; కానీ, ఏం లాభం ఏ పేజీనుండి…
-
సానెట్ 50… విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం నా మార్గంలో అడుగులు ఎంత దుఃఖభరితంగా పడుతున్నాయో చెప్పలేను. నేను కోరుకుంటున్న ఈ ప్రయాణం ముగిసే వేళకి నాకు దొరకవలసిన సుఖమూ, విశ్రాంతి దొరకకపోవడమేగాక, గుర్తుచేస్తున్నాయి: ఇకనుండి మైళ్ళు “నీ నుండి నా దూరం”తో కొలవబడుతాయని. నా బరువుతోపాటు బాధలబరువూ మోస్తూ ఈ జంతువు అలిసిపోయింది అందుకే కాళ్ళీడుస్తోంది, నా లోపలి బరువు మోయడానికి వీలుగా, ఈ గుర్రం ఏ అతీంద్రియ శక్తితో తెలిసుకుందో తెలీదు గాని రౌతుకి…
-
థామస్ బైల్ పబ్ లో అన్నది… జేమ్స్ స్టీఫెన్స్, ఐరిష్ కవి
ఇంతచమత్కారవంతమూ, రసవత్తరమూ ఐన కవిత ఈ మధ్యకాలంలో నేను చదవలేదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మనిషి తనమనుగడకి ఎంతటి ముప్పుతెచ్చుకుంటున్నాడో చాలా సరళంగా, సునిశితంగా చెప్పాడు కవి. *** నేను దేవుణ్ణి చూశాను. నీకేమైనా సందేహమా? అసలు అనుమానించడానికి నీకెంత గుండె ధైర్యం? ఓయ్, నేను నిజంగా దేవుణ్ణి చూశాను. తనచెయ్యి ఒక పర్వతాగ్రాన ఆంచి ఉంది. అతను ఒక సారి ఈ ప్రపంచాన్ని, దాని పరిసరాల్నీ పరిశీలించాడు. నువ్వు నన్ను చూస్తున్న దానికంటే స్పష్టంగా అతన్ని…
-
The Soil(ed) Slate… Pydi Teresh Babu, Telugu, Indian
The singular biological attribute this globe has is… That it perpetuates motherhood. The other name for a perennial river That flows but never seems so is … ‘mother’ On 3rd November 1963 One Pydi Subbulu became a mother. I have a faint memory of her Getting up in the wee hours, and Running barefoot for…
-
శ్వేతతుషారం… చక్రవర్తి సలహాదారు యకమోచి, జపనీస్ కవి
కొండగాటి పక్షుల వంతెన మీద మిరిమిట్లుకొలిపే ధవళవస్త్రాన్ని పగటిఱేడు శ్వేతతుషారంతో పరచగానే అర్థమయింది నాకు: రాత్రి అట్టేలేదనీ వెలుతురు ఇక చిక్కగా చొచ్చుకొస్తుందనీ. . ఈ కవిత కృతికర్త Koshu ప్రాంతపు గవర్నరు, అప్పటి జపానులోని అంతగా నాగరికత చాయలు కనరాని ఉత్తర తూర్పు ప్రాంతాలకు వైస్రాయి గా ఉండే యకమోచి. అతను సుమారు క్రీస్తు శకం 785 ప్రాంతాలవాడు. క్యోటోలోని రాజ సౌధంలో “Magpies Bridge” అనే వంతెన మార్గం ఉంది. కానీ ఈ కవితలో ఆ…
-
నీలి రెక్కలు… జేమ్స్ స్టీఫెన్స్, ఐరిష్ కవి
చెట్టుమీదనున్న ఓ పిట్టా! నువ్వు పాడగలిగినప్పుడే పాడు రెక్కలు బారజాపుకుని ఆకాశంలో ఎంతో ఎత్తుకి ఎగురుతూ ఆనందంగా ఉన్నా చీకటిపడే వేళకి చల్లదనం ఉధృతమౌతుంది కనుక, పాడగలిగినపుడే పాడు. నిన్ను కబళించే ఉద్దేశ్యంతో నీ మీదకి … రెక్కలు చాచి ఎగురుతూ గద్ద ఒకటి వాలుగా తేలియాడుతూ అనుసరిస్తోంది కనుక కమ్మని నీ గీతం త్వరలో చరమగీతం కాబోతోంది ఈ రోజునీ, నిన్నూ, బాధోపహతుడనైన నన్నూ ఆ నీలి రెక్కలు కప్పి కనుమరుగు చేస్తాయి. అక్కడ ఏ…
-
జవాబు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నేను మట్టిలోకి తిరిగి చేరుకున్నప్పుడు ఆనందంతో తుళ్ళిసలాడిన నా శరీరం ఒకప్పుడు విర్రవీగిన దాని ఎరుపు తెలుపు వన్నెలని వదులుకున్నప్పుడు పురుషులెవరైనా పక్కనుండి పోతూ పేలవమైన, తెచ్చిపెట్టున జాలితో మాటాడితే నా మట్టి గొంతు ఎరువుతెచ్చుకుని మరీ వాళ్ళకి గట్టిగా సమాధానం చెబుతుంది: “ఓయ్! చాలు, కట్టిపెట్టు. నేను సంతృప్తిగానే ఉన్నా. అవసరం లేని నీ జాలిమాటలు వెనక్కు తీసుకో! ఆనందం నాలో ఒక జ్వాల అది ఒక్క సారి దహించేది కాదు, నిలకడైనది. అలవోకగా వంగే రెల్లులా సుకుమారమైనది…