-
సైనికుడు… రూపర్ట్ బ్రూక్, ఇంగ్లీషు కవి
నేను మరణించడం జరిగితే, నా గురించి ఇలా తలపోయండి: ఎక్కడో దేశంకాని దేశంలో ఓ మూల ఒకింత జాగా ఉంటుంది అది ఎప్పుడూ ఇంగ్లండునే తలపోస్తుంది. అక్కడ ఆ అపురూపమైన నేలలో అంతకంటే విలువైన మట్టి దాగుంది. ఆ మట్టి ఇంగ్లండులో పుట్టి, రూపుదిద్దుకుని, జ్ఞానం సంపాదించింది, ఇంగ్లండు ఒకప్పుడు ప్రేమించడానికి పూలనీ, తిరగడానికి త్రోవల్నీ ఇచ్చింది, అది ఇంగ్లండులో ఒక భాగం, అది అన్నిరకాలుగా ఇంగ్లండునే ప్రతిఫలిస్తుంది, అక్కడి నదుల్లో ములిగి, అదృష్టం కొద్దీ అక్కడి సూర్యుడి…
-
శరణార్థులు … గ్రేస్ హజార్డ్ కాంక్లింగ్, అమెరికను కవయిత్రి
బెల్జియం -1914 . “అమ్మా! చంద్రుడు బూరుగుచెట్లుదాటి పోతున్నాడు రోడ్డు ఎంతకీ తరగదు, తెల్లగా కనుచూపుమేరా, మనం ఊరు ఇంతత్వరగా చేరలేమేమో, చెప్పవూ, ఇంతకీ మనమెక్కడున్నామో?” “నాన్నా, కన్నా, కాస్త ఓపికపట్టరా తండ్రీ, మళ్ళీ మనకి త్రోవ కనిపిస్తుందిలే, (భగవంతుడా! ఎవ్వరూ నడవని త్రోవ చూపించు దేవుడా ! ఏమనిషికంటాపడకుండా రక్షణ కల్పించు!”) “అమ్మా! నాకు నువ్వు చెప్పనే లేదు, నన్నుతొందరగా ఎందుకు లాక్కొచ్చావో! నేను సైనికులు పక్కనుండి వెళ్ళడం చూశాను నాకు కాసేపు నిలబడితే బాగుణ్ణనిపించింది.”…
-
అతను నిష్క్రమించాడు… డేవిడ్ హార్కిన్స్, సమకాలీన ఇంగ్లీషు కవి
క్రిస్టియన్ మిత్రులందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు. *** క్రిందటి సంవత్సరం మనతో గడిపిన వ్యక్తులు ఈరోజు మనతో ఉండకపోవచ్చు. వాళ్ళను మరిచి మనం పండుగచేసుకుంటున్నామన్న బాధా, అసంతృప్తి కొందరిలో కనిపించవచ్చు. మరణించిన జ్ఞాపకాలు ఒక్కటే కాదు మనల్ని నడిపించవలసినది. వాళ్ళు ఆశించి అసంపూర్ణంగా విడిచిపెట్టిన పనులను వాళ్ళ గుర్తుగా మనం పూర్తిచెయ్యడమే వాళ్ళకి మనం ఇవ్వగలిగిన సరియైన నివాళి. “నలుగురు కూచుని నవ్వే వేళల నాపేరొకపరి తలవండి” అంటుంది గురజాడవారి పుత్తడి బొమ్మ “పూర్ణమ్మ” తమ అన్నదమ్ములతో.…
-
నను చివరిసారిగా ప్రేమించు… ఏలిస్ కార్బిన్, అమెరికను
కడసారి నను ప్రేమించు, ఇష్టం లేదా, విడిచిపెట్టు; కటువైన మాటలు, ఈ సగం సగం మాటల్లా, నన్ను బాధించవు; చివరగా చెబుతున్నా, అయితే నన్ను ప్రేమించు, లేదా విడిచిపెట్టు. కడసారిగా నను ప్రేమించు, లేకుంటే నువ్వు చెప్పిన ఆఖరిమాటే చివరి మాట కానీ; నను ప్రేమించు లేదా విడిచిపెట్టు… ఒక ఎగిరే పక్షిలా, మబ్బుతునకలా, ఆవిరిలా… కడసారిగా నను ప్రేమించు… నేనిపుడు శిలపై జాల్వారుతున్న జలని. . ఏలిస్ కార్బిన్ April 16, 1881 – July…
-
ఒంటరి మరణం… ఎడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి
చలిలో నేను బయటకు వస్తాను; నేను చల్లటినీటిలోనే స్నానం చేస్తాను; నేను వణుకుతూ, పశ్చాత్తాపపడతాను; ఒంటరిగా ప్రభాతవేళ నా నుదిటికీ, కాళ్ళకీ, చేతులకీ విభూతిపూసుకుంటాను; వెలుతురు రాకుండా కిటికీలు మూసెస్తాను పొడవాటి నాలుగు కొవ్వొత్తిల్నీ వాటి ఒరల్లో నిలిపి వెలిగిస్తాను; తూరుపు తెల్లవారుతుంటే, నేను పక్కమీద శరీరాన్ని వాల్చి మొహమ్మీదకి ముసుగులాక్కుంటాను. . ఎడిలేడ్ క్రాప్సీ September 9, 1878 – October 8, 1914 అమెరికను కవయిత్రి . Adelaide Crapsey September 9, 1878…
-
మడుగు… హిల్డా డూలిటిల్, అమెరికను
ఇంకా బ్రతికే ఉన్నావా? నేను నిన్ను తాకుతానో లేదో సముద్రంలో చేపలా అల్లల్లాడిపోతావు. నిన్ను నా వలతో రక్షిస్తాను. అందమైన చారలున్నదానా? ఇంతకీ నువ్వెవరు? . హిల్డా డూలిటిల్ September 10, 1886 – September 27, 1961 అమెరికను The Pool . Are you alive? I touch you— You quiver like a sea-fish. I cover you with my net. What are you, banded one? .…
-
ఒక పిల్ల పాడుకునే పాటలు… మేరీ కెరోలీన్ డేవీస్, అమెరికను కవయిత్రి
I బహుశా దేముడు ఈడెన్ తోట వేస్తున్నప్పుడు పొరపాటున ఒక విత్తనం పక్కన కాలపు పొలంలో జారవిడిచి ఉంటాడు. అది గాని పెరిగిపెద్దదై ఈ క్షణంగా మారలేదుకదా? II నువ్వూ నేనూ ఒక సారి క్రింద పడ్ద జీవితాన్ని ఏరి దానివంక చిత్రంగా చూశాం మనకి దాన్ని ఆటవస్తువుగా ఉంచుకోవాలో, పారెయ్యాలో తెలీలేదు. ఎర్రని దీపావళి టపాకాయల్లా, చూడానికి చాలా బాగుంది, మనకి అది వెలిగించబడిందని కూడా తెలుసు. ఎందుకేనా మంచిదని రాయబారం ఇంకా కాలుతుండగానే దాన్ని…
-
ఆక్వేరియం దగ్గర… మేక్స్ ఈస్ట్మన్,అమెరికను
(అక్వేరియం ప్రతీకగా తీసుకుని రాసిన మంచి కవిత. మనుషులు ఆక్వేరియంలోని చేపలను చూసి ఎందుకు నిరంతరం తిరుగుతున్నాయో అనుకుని ఆశ్చర్యంతో కూడిన జాలి ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ల చేష్టలు ఈ విశాలప్రపంచం అనే ఆక్వేరియంలో చేపల ప్రవృత్తికి భిన్నంగా ఏమీ ఉండదు.) యుగాల వయసున్న ఆ సముద్రపులోతుల్లో అవి అలసి పోయి, వంకీలు తిరుగుతూ… పెదాలు బిగించి, పాలిపోయి, ఆశ్చర్యంప్రకటించేకళ్ళతో ఆ ‘సివర్ ఫిష్ ‘ లు ప్రశాంతంగా ఈదుతున్నాయి. వాటికి ఎక్కడికి వెళ్ళడానికి త్రోవ…
-
War is a Pronoun… Ashok Kumbamu, Indian
No matter who he is He speaks only the language of war. War is now a pronoun for everyone. Their prologue is war. Their epilogue is war. For that matter, every word they utter smacks of war. When war and invasion are their way of life You can’t expect them to be conscious Of people’s…
-
ఒక ముసలమ్మ పదచిత్రం… ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను
ఆమె అతికష్టం మీద కుంటుతూ నడుస్తోంది ఆగి, సంకోచిస్తూ, మళ్ళీ మెల్లిగా కదుల్తోంది కళావిహీనమైన ఆ ముఖంతో ప్రశ్నార్థకంగా చూస్తూ … కోరికలూ, బాధలూ, భయాలూ అన్నీ హరించుకుపోయి. సాగిపోయిన ముడుతల్లో పాలిపోయిన బుగ్గలు వేలాడుతున్నాయి అందులో రక్తం ప్రవహిస్తున్న జాడ ఎక్కడా కనిపించదు. వరికంకులు కట్టగట్టినట్టున్న ఆమె చేతులు మాసి, చిరుగుపాతైపోయిన శాలువాని పట్టుకున్నాయి రొమ్ము ఉండవలసినచోట ఎముకలు ముడుచుకుపోయి ఉన్నాయి ఆమె పిరుదులు ఒక ముడిలా అటూఇటూ కదులుతున్నాయి తాడులాంటి గొంతులోనుండి శ్వాశ అతికష్టం…