War is a Pronoun… Ashok Kumbamu, Indian
No matter who he is
He speaks only the language of war.
War is now a pronoun for everyone.
Their prologue is war.
Their epilogue is war.
For that matter, every word they utter smacks of war.
When war and invasion are their way of life
You can’t expect them to be conscious
Of people’s struggles for existence.
When market is made a synonym for society
Whose interests would war keep
Than that of expanding marketeers
And their piling up capital?
When everything is turned into commodity,
Welfare lies on its death-bed;
And all wealth gets lodged in 1% of hands
They hail these war slogans just
To snip the budding questions in the minds
And to stifle the sharp, eddying existential issues;
These cries of war are only to spread
Ignorance, inertia and intolerance across the society.
After all! This is a war within the borders.
So they morph their ammunition…
A spiritless patriotism
Hitherto-never-thought-of honor
A religion not their own
And people dissimilar to them…
the insurmountable walls to build
and an interminable insecurity …
They are now the latest munition inventory.
Making democracy the Accused No. 1
Everybody makes a promise of war
It is up to the people now to decide
Whether they want to become the hired guns of the battle
Or midwives to oversee a hard labour to deliver the new order.
.
Ashok Kumbamu

Ashok Kumbamu was born and brought up in a peasant family in Azmapur (village), Nalgonda district, Telangana State. He received his Bachelor of Arts (Philosophy, Sociology and Psychology) degree from Nizam College, Hyderabad. He was awarded the Netherlands Fellowship Program scholarship to pursue his Master’s degree in Development Studies at the International Institute of Social Studies at Hague, Netherlands. He received his PhD in Sociology from the University of Alberta, Edmonton, Canada, and completed his post-doctoral fellowship at the same institution. Since 2012 he has been working as an Assistant Professor of Bioethics at Mayo Clinic, Rochester, Minnesota.
ఇప్పుడు యుద్దం సర్వనామం
.
ఎవడైతేనేం
అందరిది నెత్తుటి భాషే
అందరి సర్వనామం యుద్దమే
వాళ్ళ మొదటి పదం యుద్దం చివరి పదం యుద్దం
నిజానికి, ప్రతి పదము యుద్దమే
యుద్దము, దురాక్రమణే జీవితం అయినోళ్ళకి
నిత్య జీవిత యతల సోయెందుకుంటది
సమాజానికి మార్కెట్ ను పర్యాయపదం చేశాక
యుద్దం ఎవర్ని రక్షిస్తది,
విస్తరించే మార్కెట్ ను పోగయ్యే పెట్టుబడిని తప్ప!
సంక్షేమం అంపశయ్యపై మూలుగుతుంటే
సర్వం సరుకీకరణ కాబడి
సంపదంతా ఒక్క శాతం చేతిలో బందీ అయితే
అట్టడుగున మొలకెత్తే ప్రశ్నలను
అస్తిత్వంకై పదునెక్కే సంఘర్షణలను అణచడానికే
అజ్ఞానం, అచేతనత్వం, అసహనం సమాజమంతా పంచడానికే
ఈ యుద్ధ ప్రగల్భాలు
ఎల్లల లోపటి యుద్ధం కదా
అందుకే మందుగుండు మార్చేసిండ్రు
సారంలేని “దేశభక్తి”
ఎప్పుడులేని “ఘనకీర్తి”
తనది కాని మతం
తనలాగ వుండని మనుషులు
కట్టాలనుకునే సరిహద్దు గోడలు
అంతుచిక్కని అభద్రత
ఇప్పుడు ఇవే యుద్ద సామాగ్రి.
ప్రజాస్వామ్యాన్ని ప్రధమ ముద్దాయి చేసి
అందరు యుద్దాలనే వాగ్దానం చేస్తుండ్రు
ఇక యుద్దంలో అద్దె తుపాకులవుతరో
మార్పు కోసం మంత్రసానులవుతరో
ప్రజలే నిర్ణయించుకోవాలి!
(అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల చర్చలలో ప్రజల అవసరాలు, సంక్షేమం కాకుండా యుద్దము, దాడులే ప్రధాన అంశం కావడానికి స్పందనగ)
Ashok Kumbamu
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి