వర్గం: అనువాదాలు
-
నన్ను నిద్రపుచ్చు… ఎలిజబెత్ ఏకర్స్ ఏలన్, అమెరికను
వెనుతిరుగు వెనుతిరుగు నీ పరుగులో ఒకసారి కాలమా! వెనుదిరిగి ఒక్క రాత్రికి నన్ను పసిబిడ్డగా మార్చవా! ప్రతిధ్వనులెరుగని తీరంనుండి ఒకసారి మరలిరావా అమ్మా! మునపటిలాగే ఒకసారి నన్ను నీ గుండెలకు హత్తుకోవా; నా నుదిటినుండి వంతల ముడుతలు ముద్దాడి పోవా; అక్కడక్కడ నెరిసి నిలబడుతున్న నా జుత్తు సవరించవా ఎప్పటిలానే నే నిదరోతున్నపుడు ప్రేమగా కాపుకాయవా;- అమ్మా నన్నొకసారి నిద్రపుచ్చు! నను నిద్రపుచ్చు వెనుదిరుగు వెనుదిరుగు ఓ కాలకెరటమా! ఈ కష్టాలకీ కన్నిళ్ళకీ నేను అలసిపోయాను,- ప్రతిఫలం…
-
మరొకసారి రా! … రూమీ,పెర్షియన్ కవి
రా! రా! నువ్వెవరైనా ఫర్వాలేదు. దేశదిమ్మరి, భక్తుడు, హతాశువు ఎవరైనా ఒకటే. ఇది నిరాశానిస్పృహల బిడారు కాదు. రా! నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని వెయ్యిసార్లు నిలుపుకోలేకపోయినా సరే రా! మరొకసారి రా! రా! రా! . రూమీ పెర్షియన్ కవి Come, come, whoever you are. Wonderer, worshipper, lover of leaving. It doesn’t matter. Ours is not a caravan of despair. Come, even if you have broken…
-
మనిద్దరం ఎన్నాళ్ళనుండో స్నేహితులం… కెరొలీన్ సారా నార్టన్, ఇంగ్లీషు కవయిత్రి
చిన్నప్పుడు మొదటిసారి ఆ బాదం చెట్టుక్రింద ఆడుకోవడం మొదలుపెట్టినదగ్గరనుండి బాగున్ననాడూ, బోగున్ననాడూ మనిద్దరం ఎప్పటినుండో స్నేహితులం. ఎందుకో నీ మనసులో ఉదాసీనత చోటుచేసుకుంది. నీ కళ్లలో ఏదో అనుమానం పొడచూపుతోంది. మనిద్దరం ఎన్నాళ్ళనుండో స్నేహితులం కదా ఒక చిన్న మాట ఇపుడు ఇద్దరినీ విడదీయనివ్వవచ్చా? ఇద్దరం కలిసి ఆనందంగా గడిపేం, నవ్వుకుంటూ పరాచికాలాడుకున్నాం, మనిద్దరి మనసుల్లో ఎన్నో ఆశలూ ప్రేమగా పెల్లుబుకజొచ్చేవి నీ పెదవి మీద ఇపుడు చిరునవ్వు మాయమైంది నీ కన్నుల విషాదం కమ్ముకుంటోంది. మనిద్దరం…
-
మనోహరమైన ఈ యవ్వనశోభలు అంతరించినా… థామస్ మూర్, ఐరిష్ కవి
నన్ను నమ్ము! ఈ రోజు నేను ఎంతో తమకంతో పరీక్షిస్తున్న మనోహరమైన ఈ యవ్వన శోభలు రేపు ఒక్కసారి మారిపోయినా, దేవతల వరాల్లా అవి నా చేతిలోంచి ఎగిరిపోయినా ఈ క్షణంలోలానే నిన్ను అప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాను. నీ సౌందర్యం దాని చిత్తమొచ్చినపుడు మారిపోనీ, ఆ మార్పులో నా ప్రతికోరికా పచ్చగా నిన్ను అల్లుకునే ఉంటుంది. అందమూ, వయసూ నీ స్వంతమైననాడే కాదు, కన్నిటితో నీ బుగ్గలు మలినమైననాడే కాదు ఈ ఆత్మకి నీపై గల అనురక్తీ,…
-
సాలెగూడు… ఇ. బి. వైట్, అమెరికను
సాలీడు, ఒక చిన్న కొమ్మనుండి వేలాడుతూ దాని కలాపనకి ఒక రూపం ఇస్తుంది, ముందుగా ఆలోచించి ఒక సన్నని దారపుపోగువంటి సాధనాన్ని, పైకి ఎక్కడానికి వీలుగా. రోదసిలో తను దిగినంతమేరా గుండెదిటవుతో, నమ్మకంగా దిగుతుంది, తను బయలుదేరినచోటు చేరుకుందికి ఒక నిచ్చెనలా దారాన్ని వడుకుతుంది. అలాగే నేనూ, గూడు అల్లడానికి సాలీళ్ళు కనబరిచే తెలివితో తిరిగి బయటకి రావడానికి అనువుగా ఒక పట్టుదారాన్ని నీకు వేలాడదీస్తున్నాను. . ఇ. బి. వైట్ July 11, 1899 –…
-
పది సరికొత్త దైవాజ్ఞలు … ఆర్థర్ హ్యూ క్లఫ్, ఇంగ్లీషు కవి
నువ్వు ఒక దేవుడినే నమ్ముకో; ఇద్దరు దేవుళ్ళని నమ్మి ఎవడు బ్రతకగలడు? విగ్రహారాధన చెయ్యవద్దు ఒక్క కరెన్సీనోట్లని తప్ప; శాపనార్థాలు పెట్టవద్దు; ఆ విషయానికొస్తే మీ శత్రువు మీకు అందులో తీసిపోడు; మీరు ఆదివారం చర్చికి వెళ్ళడం వల్ల ప్రపంచంలో ఏమిజరుగుతోందో మీకు తెలుస్తుంటుంది; మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, అంటే, ఎవరివల్లనైతే మీకు భవిష్యత్తులో లాభం ఉంటుందో; మీరు హత్యలు చెయ్యవద్దు, అలాగని అతిచొరవ తీసుకుని ప్రాణాలు నిలబెట్టడానికి ప్రయత్నించవద్దు; వ్యభిచారం చెయ్యవద్దు; దానివల్ల, లాభం కలిగిన…
-
అడవి బాతులు… మేరీ ఓలివర్ , అమెరికను కవయిత్రి
మీరు మంచి వాళ్లై ఉండవలసిన అవసరంలేదు. ప్రాయశ్చిత్తం చేసుకుందికి మీరు మోకాళ్ళమీద ఎడారిలో వందలమైళ్ళు నడవ వలసిన పనీ లేదు. మీ శరీరంలో దాగున్న ఆ మృదువైన జంతువుని దానికి ఏది ఇష్టమయితే దాన్ని ఇష్టపడనిస్తే చాలు మీ నిరాశా నిస్పృహల గురించి నాకు చెప్పండి, నావి నేను చెబుతాను. ఈ లోపున ప్రపంచం దాని మానాన్న అది నడిచిపోతుంటుంది. ఈ లోపున సూర్యుడూ, స్ఫటికాల్లాంటి వడగళ్ళవానలూ ఈ సువిశాల మైదానాల మీంచి, పచ్చిక బయళ్ళమీంచి, దట్టమైన…
-
అవును… చార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను
ఒంటరితనాన్ని మించిన బాధాకరమైన విషయాలు అనేకం ఉన్నాయి. కానీ, అది గ్రహించే లోపున దశాబ్దాలు గడిచిపోతాయి. తీరా తెలుసుకునే వేళకి కాలాతీతమైపోతుంది. సమయం మించిపోవడాన్ని మించిన బాధాకరమైన విషయం మరొకటి లేదు. . చార్ల్స్ బ్యుకోవ్స్కీ August 16, 1920 – March 9, 1994 అమెరికను . oh yes . there are worse things than being alone but it often takes decades to realize this…
-
నానావర్ణ సౌందర్య జగతి… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి
ఇంత చిత్రవిచిత్రమైన జగతిని ప్రసాదించిన దేవునికి నమస్సులు! కపిలధేనువులాంటి రంగు రంగుల ఆకాసామూ, రంగు వేసినట్టు నీటిలో ఈదే చేపపిల్లలూ, రాక్షసిబొగ్గు మంటలాంటి రాలిపడ్ద చెస్ట్ నట్ పళ్ళూ, భిన్న వర్ణాల చారల రెక్కలున్న పిట్టలూ, పశులమందలతో, పంటలతో, దుక్కిదున్నీ, బీడుపడీ నేలా, జాలరీ, దర్జీ, మొదలైన ఎన్నో వృత్తిపనుల వారి పనిముట్లూ, ప్రకృతి సిద్ధమూ, మానవ నిర్మితమూ, అరుదైనవీ, చిత్రమైన వస్తువులూ, ఊసరవెల్లిలా స్థిరంలేని రంగులుగల జీవులూ (ఎలా మారుస్తాయో ఎవరికెరుక?) కొన్ని వేగవంతమూ, కొన్ని…
-
నేను అందంగా,యవ్వనంలో ఉన్నపుడు… ఎలిజబెత్ మహారాణి 1
నేను అందంగా,యవ్వనంలో దేముని అనుగ్రహానికి పాత్రమైనపుడు చాలామంది నా చేయి అర్థిస్తూ ప్రాధేయపడ్డారు. నేను వాళ్ళందరినీ తిరస్కరించాను. సమాధానంగా, “ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో, బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దు” అన్నాను ఎన్ని కళ్ళు దుఃఖంతో విచారిస్తూ ఏడవడం చూశాను ఎన్ని హృదయాలు నిట్టుర్చేయో నేను చూపించగల శక్తి నాకు లేదు. అయినా రోజూ గర్వంతో మిడిసిపడుతూ వాళ్ళతో అన్నాను: “ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో, బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దు” అని. ఒకరోజు సౌందర్యాధిదేవత…