వర్గం: అనువాదాలు
-
ఒక సంకేత కవిత… లియో మార్క్స్, ఇంగ్లీషు
ఈ కవిత వెనక చాలా పెద్ద కథ ఉంది. అందులో ప్రేమా, ప్రియురాలి (Violet Szabo )ఆకస్మిక మరణం, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రెంచి ప్రతిఘటనకారులు క్షేమంగా దాటిపోడానికి కవిత అంకురించిన తీరూ, ఇది ఆధారంగా గత శతాబ్దంలో తీసిన సినిమా (Carve Her Name On The Stone), కవి స్వయంగా ఈ కవిత వెనుక కథ వ్రాసిన పుస్తకం (Between Silk and Cyanide: A code Makers War 1941-45, Free Press…
-
ప్రార్థన (మేఘాల వెనుకనున్న సూర్యుడికి)… పీట్ హీన్, డేనిష్ కవి, శాస్త్రజ్ఞుడు.
సమస్తసృష్టికీ ఆధారభూతమైన ఓ సూర్యుడా! భూమిమీద అన్ని వస్తువులమీదా కిరణాలు ప్రసరించు. నేను మరీ గొంతెమ్మకోరిక కోరుకుంటున్నాననిపిస్తే కనీసం నా దేశపు నేలమీద ప్రసరించు. నీకు అదికూడా అత్యాశగా కనిపిస్తే, సరే, ఎలాగోలా, నా మీదైనా ప్రసరించు ! . పీట్ హీన్ 16 December 1905 – 17 April 1996 డేనిష్ శాస్త్రజ్ఞుడు Prayer (to the sun above the clouds) Sun that givest all things birth…
-
ఓ గులాబీ! నువ్వొక అచ్చపు వైరుధ్యానివి! … రిల్కే, ఆస్ట్రియను కవి
ఓ గులాబీ! నువ్వొక అచ్చపు వైరుధ్యానివి! అన్ని రేకలున్నా ఆ నీడన ఎవరూ ఆనందంగా నిద్రించ కాంక్షించరు. . రిల్కే 4 December 1875 – 29 December 1926 ఆస్ట్రియను కవి ఇది రిల్కే స్వయంగా రాసుకున్న మృత్యుల్లేఖనము (epitaph). జర్మనులో Lust అంటే బాధ. ఇక్కడ వైరుధ్యము గులాబికి ఎన్నో రేకులున్నాయి. కానీ వాటినీడన ముళ్ళున్నాయి. కనుక అవి చూసి ఎవరూ ప్రశాంతంగా నిద్రించ సాహసించరు. [మరొక అన్వయం: ఇక్కడ రేకలు ఎర్రని పెదాలకు…
-
Can A Mirror Lie? … Karlapalem Hanumantha Rao, Telugu, Indian
(A surrealist Poem) Somebody Offered me a quarter In my dream And said,”Boy! Buy whatever I want.” After waking up I went to the market cheerfully and bought dark clouds, and soaps to wash them, Trees And the stairs to climb them, long wide highways to leisurely lie down and narrow easy flowing canals…
-
An Earnest Appeal… Dasari Amarendra, Telugu, Indian
Yes, it’s true. I admit I was recklessness In falling asleep like a log. Without realizing there could be you around it’s true that in the cradle swing of train I fell asleep oblivious to the world. Well, You did your duty. I don’t find fault with you. *** You might have opened the suitcase…
-
ఫోటో… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
Picasso ఒక సారి కళ గురించి చెబుతూ, “కళ గోడమీద తగిలిచుకునే అందమైన బొమ్మలకి పరిమితమైనది కాదు; వాటికన్నా అతీతమైనది,” అని అంటాడు. కనుక ఒకోసారి కళ అందవిహీనంగా ఉన్నది కూడా కావచ్చు. దాని అర్థం ఏమిటి? అందవిహీనమైనదాన్ని ఏ కళాకారుడూ సృష్టించడు కదా? అది ఒక నిరసన తెలిపే మార్గం. తన ఆగ్రహాన్ని ప్రకటించే తీరు. దిగంబరకవులు తమ కవిత్వంలో అంతవరకు సంప్రదాయంగా వస్తున్న ఉపమానాలూ, మాటలూ కాకుండా వేరే భాష ఎందుకు ఉపయోగించినట్టు? కవిత్వం…
-
ప్రతి రాత్రీ ఈ పీడకలే… గెరాల్డ్ గోల్డ్, ఇంగ్లీషు కవి
ఈ పీడకలే… ఏ రాత్రికి ఆ రాత్రి నా తలగడపై పళ్ళికిలిస్తూ కనిపిస్తుంటుంది … నేను అమాయకత్వంలో ఉండే మనశ్శాంతితో ఆనందానికి ఆర్రులుజాచే కాంక్షని కలగలుపుతునానట: ఇంతకుమించిన అపవాదూ, దూషణ ఉందా కేవలం దివ్యసంకల్పంతో, నిరపేక్షగా చేస్తుంటే… సోమరితనానికీ స్వార్థానికీ ముసుగు వేస్తున్నానట ఫాదిరీ నల్లగౌనులోనూ, దేవత తెల్లగౌనులోనూ. మహప్రభో, మీరు పాపం చేస్తే, దానిలో ఆనందం అనుభవించండి, దాన్ని ఆనందంకోసం చెయ్యండి. అంతే కాని “అదిగో చూడు, ఆత్మ ఎంత స్వేఛ్ఛగా ఎగిరిపోతోందో!… ఒక్క క్షణంలో…
-
మతచర్చ … ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికను
మనం చాలా విశాలంగా ఆలోచిస్తాం కాని నడిచేది మాత్రం దగ్గరదారిలో; మనం దయ్యాలకు అడుగులకు మడుగులొత్తి ఇంటిముఖం పట్టేటపుడు గడగడ వణుకుతుంటాం; మనం రాత్రి కొలిచేదొక దేవుడిని పగలు ప్రార్థించే దింకొక దేవుడిని. . ఎర్నెస్ట్ హెమింగ్వే July 21, 1899 – July 2, 1961 అమెరికను నవలా కారుడు (ఈ కవితలో రచయిత మన ఆత్మవంచన తత్త్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు. మన ఆలోచనలు మహోన్నతంగా ఉంటాయి. కానీ ఆచరణలో మాత్రం దొడ్డిదారి పడతాం. మనం సేవించేది, అడుగులకి…
-
ఒక వాదము… థామస్ మూర్,ఐరిష్ కవి
ఒకే విషయం మీద వేర్వేరు కవులు స్పందించిన కవితలన్నీ ఒకచోట దొరికే సందర్భం అరుదుగా తటస్థిస్తుంది. అలాంటిదే ఇది. “Sin” మీద ముగ్గురు కవుల (నిజానికి అందులో ఒకరు గొప్ప నవలా కారుడు) స్పందన వరుసగా మూడు రోజులపాటు చదవొచ్చు. *** . నాకు చాలాసార్లు జ్ఞానులైన ఫకీరులు చెప్పారు ఊహించడమూ, ఆచరించడమూ రెండూ నేరమేనని దైవం ఆచరించిన వారిని ఎలా శిక్షిస్తాడో మనసులో కోరుకున్నవారినీ అలాగే శిక్షిస్తాడని. కోరిక శిక్షార్హమైనప్పుడు, నువ్వూ నేనూ మనస్సాక్షిగా నేరానికి శిక్షార్హులమే.…
-
సానెట్ 43… ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఏ పెదాలు నా పెదాలను చుంబించాయో; ఎక్కడ, ఎందుకు నేను మరిచిపోయానో; ఏ చేతులు తెల్లవారే వరకూ నా తలకి ఆసరా ఉన్నాయో; కానీ ఈ రాత్రి వర్షం మాత్రం భీకరంగా ఉంది, కిటికీ అద్దాలపై టప్ టప్ మంటూ; సమాధానానికి ఎదురుచూస్తూ నిట్టురుస్తూ, నా గుండెలో ఎక్కడో బాధ మెత్తగా కలుక్కుమంటోంది కారణం నను గుర్తుపెట్టుకోని నా పిల్లలు మరొకసారి ఏడ్చుకుంటూ ఈ అర్థరాత్రి నా దగ్గరకి రారు. అనుకుంటూ ఒంటరిగా హేమంతంలో నిలుచుంటుందొక చెట్టు.…