వర్గం: అనువాదాలు
-
దాడికి వెళ్లిన ఆటగాడు … రాబర్ట్ ఫ్రాన్సిస్, అమెరికను కవి
మన చెడుగుడు (కబడ్డీ) ఆటకి పోలికలున్న Prisoner’s Base ఆట మీద వ్రాసినట్టున్నా, ఈ కబడ్డీ మనలో చాలమందికి పరిచయమే కాబట్టి ఇక్కడ ఇస్తున్నా. ఆటలు వర్ణిస్తూ వచ్చిన అతి తక్కువ కవితల్లో ఇదొకటి. *** అవసరమైతే ముందుకివెళ్లడానికీ లేకుంటే వెనక్కి మళ్ళడానికి సిద్ధంగా, తాడుమీద నడిచే వీటివాడిలా అటూ ఇటూ పడకుండా నిలదొక్కుకుంటూ రెండూ చేతుల వేళ్లూ రెండు వ్యతిరేకదిశల్లో చాచి ఉంచి క్రిందపడిన బంతి మీదకెగిరినట్టు మునివేళ్ళ మీద గెంతుతూ లేదా, ఒక అమ్మాయి…
-
రాత్రి ప్రశంస… థామస్ లోవెల్ బెడోస్, ఇంగ్లీషు కవి
అయితే మళ్ళీ వచ్చేవన్నమాట, కాలవిహంగాల ముసలివగ్గూ, ఓ రాతిరీ! మాకూ సూర్యుడికీ మధ్య అడ్డంగా పెద్ద పక్షిలా నీ శరీరాన్ని వ్యాకోచింపజేసి వెలుతురును మరుగుపరుస్తూ; చాలనట్టు, నిర్దాక్షిణ్యమన నీ గుండె అంచున చీకట్లలో మబ్బు రెక్కల దిగువన, పొగమంచు తెగుళ్ళనీ పొదుగుతూ, తుఫానులకీ, కర్కశమైన హిమపాతాలకి ప్రాణం పోస్తూ, పగటి గోర్వెచ్చని ఎంద లాలనలు కరువుచేస్తూ… భీతితో ముడుచుకుపోయిన గుడ్లగూబలు పైకి ఎగబ్రాకిన లతల ఉయ్యాలల్లో నిను వేడుకుంటూ ప్రార్థనలు చేస్తున్నాయి. కాంతిహీనమైన ప్రపంచం మీదకి ఒక్క…
-
బలవంతపు కవాతు… మిక్లోష్ రాద్నోతి, హంగేరియన్ కవి
[మిక్లోష్ రాద్నోతి రెండవ ప్రపంచయుద్ధకాలంలో హిట్లరు చేసిన మారణహోమంలో బలైపోయిన హంగేరియన్ కవి. ఈ కవిత చదువుతుంటే మీకు రెండు విధాలుగా కన్నీళ్ళు రాకమానవు. ఒకటి అంత మంచి భవిష్యత్తు ఉన్న కవి అలా అన్యాయంగా చనిపోయినందుకు; రెండు, ఈ కవితలో అతను ఉపయోగించిన దృశ్యరూపకమైన ఉపమాలంకారాలకి. ముఖ్యంగా, నిదురిస్తున్న తోటలో, తిరోగమిస్తున్న గ్రీష్మం తీరికగా స్నానంచెయ్యడం, ఆకుల మధ్యలో పళ్ళు దిగంబరంగా ఉయ్యాలలూగడం, ఈ రెండింటికంటే అందంగా, “పగలు మెల్ల మెల్లగా నీడలు గీసుకుంటూ పోవడం”.…
-
బేగల్… డేవిడ్ ఇగ్నతోవ్, అమెరికను కవి
మన చిత్రమైన మానసిక స్థితిని పట్టిచ్చే కవిత ఇది. కొన్ని వస్తువులు పోగొట్టుకుంటాం. వాటిని తిరిగి సంపాదించడానికి తెగ వెతుకులాడతాం. ఈ వెతుకులాటలో పొరపాటున ఏదైనా కొత్త వ్యాపకం దొరికితే, ముందు చికాకుపడినా, కొంతసేపటికి, మనం వెతుకుతున్న లక్ష్యం మరిచిపోయి, ఈ వ్యాపకానికి అలవాటుపడిపోతాం. బేగల్ అన్నది ముందు పులియబెట్టి, తర్వాత వేచి, గట్టిగా, గారెలూ, చేగోడీల్లా గుండ్రంగా, కానీ పలచగా చుట్టలుచుట్టి తయారుచేసే వంటకం. . గాలికి దొర్లిపోతున్న బేగల్ ని పట్టుకుందికి నిలబడ్డాను. దాన్ని…
-
I did Not Take Proper Leave of You… Bojja Tarakam, Telugu Poet
I am sorry I did not take proper leave When we parted… I could not speak out my mind when the police arrested me. You stood awestruck with tears swelling in your eyes. Poor me! These cuffed -hands were helpless to dry your tears. Ringing the ‘long-bell’ to silence marched … the police boots. I could…
-
అంతా సంగీతమైన చోట… రూమీ, పెర్షియన్ కవి
ఈ గీతాల్ని భద్రపరచుకోవడమెలా? అని చింతించకు! మన వాయిద్యాల్లో ఏది పగిలిపోయినా ఫర్వా లేదు. మనం ఇప్పుడు పడిన చోట సర్వం సంగీతమయం. తంత్రీ నినాదాలూ,పిల్లనగ్రోవి స్వరాలూ వాతావరణంలో తేలియాడుతూనే ఉంటాయి ప్రమాదవశాత్తూ ఈ విశ్వవీణియ అగ్నికి ఆహుతైనా, ఇక్కడ ఇంకా చాలా నిగూఢవాయిద్యాలుంటాయి … మ్రోగుతూ. ఒక కొవ్వొత్తి మిణుకుమిణుకుమని చప్పున ఆరిపోతుంది. అయినా, మన చెంత ఒక చెకుముకిరాయి, నిప్పురవ్వా ఉంటాయి. ఈ సంగీత కళ ఒక సముద్రపు నురుగులాంటిది. సముద్ర గర్భంలో ఎక్కడో…
-
కేన్సరు వార్డు సందర్శన … గాట్ ఫ్రైడ్ బెన్, జర్మను కవి
హెచ్చరిక / మనవి: ఇది భీభత్సరసప్రధానమైన కవిత. దయచేసి గుండెధైర్యం లేనివారు ఈ కవిత చదవవొద్దని మనవి. *** పురుషుడు: ఈ వరుసలో గర్భాశయాలు క్షిణించిపోయిన వారు ఈ వరుసలో రొమ్ములు క్షీణించిపోయిన వారు. ఒకదాని పక్క ఒకటి దుర్గంధపూరితమైన పడకలు. గంటగంటకీ నర్సులు మారుతూనే ఉంటారు. రా! పైనున్న ఈ చిన్న దుప్పటీ నెమ్మదిగా పైకెత్తు. చూడు. కండపట్టిన ఈ మలిన మాంసపు ముద్దే ఒకప్పుడు పురుషుడికి అపురూపమయినదై ఆనందదాయకమై గృహస్థుని చేసింది. రా! రొమ్ము మీద…
-
గూఢప్రశ్నలు… సామ్యూల్ గ్రీన్ బెర్గ్, ఆస్ట్రియన్- అమెరికను కవి
నా తోడివారిలో నేను చెడ్డవాడిగా పేరుబడ్డాను. అయినాసరే, ఎవరూ దాసులు కాగోరని, ఆలోచనలు ఏకాగ్రతను జ్ఞానోదయం కంటే కలలలో విశృంఖలతవైపు నడిపించే ఆనందాలని నా అక్కున చేర్చుకుందికి చొరవచూపించాను. అభిమతాల తేరు నా ఆలోచనలకు ఆగింది, అగణితమైన తన సమ్మోహనకళలనీ ప్రదర్శిస్తూ ‘కళ ‘ తలవంచింది; శాస్త్రవిజ్ఞానం విస్తృతమైన దాని అనురూపత కొనియాడింది అంతరాత్మ పరిణతినీ, నడవడినీ సందేహిస్తూ; సూర్యుని వెలుగు కిరణం నా ఆలోచనలు గోళాల చుట్టూ తిరిగేలా ప్రోత్సహించింది. చంద్రసదృశమైన దివ్యాకృతులక్రింద నా కనులు…
-
తాతయ్య మరణం … అలెక్సాండర్ అలెక్సాండెరోవిచ్ బ్లోక్, రష్యను కవి
ఈ కవిత చివరి పాదంలో “నూతన గృహప్రవేశం” అని ఒక గొప్ప ప్రయోగం ఉంది. ఆ భావాన్ని అంత అందంగా తీసుకువచ్చిన అనువాదకుణ్ణి అభినందించకుండా ఉండలేను. *** సాధారణంగా నిద్రకోసమో, మరణం కోసమో నిరీక్షిస్తుంటాం ఆ సందర్భాలు ఎంతకీ ముగియక గొప్ప విసుగు తెప్పిస్తాయి. ఒక్క సారి కిటికీలోంచి అలసటతీరుస్తూ గాలి రివట ఒకటి వీచి, పవిత్రమైన బైబిలు పేజీలను తిరగేస్తుంది. తెల్లని జుత్తుతో ఒక ముసలాయన అక్కడికి వెళ్తాడు ఒంటరిగా, మెరిసే కళ్ళతో…
-
చిన్నప్పుడు గతించిన మిత్రుల స్మృతిలో … డొనాల్డ్ జస్టిస్, అమెరికను కవి
వాళ్ళని స్వర్గంలో వయోజనులుగా ఎన్నడూ కలుసుకోము, నరకంలోని బట్టతలల మధ్య, ఎండలోమాడుతూ చూడబోము; కలవడమంటూ తటస్థిస్తే, సంజచీకట్లలో స్కూలు ఆవరణలోనే గుండ్రంగా నిలబడి, బహుశా, ఒకరి చేతులొకరు పట్టుకుని, ఇపుడా పేర్లే గుర్తులేని ఏవో ఆటలు ఆడుకుంటూ… ఓ,జ్ఞాపకమా! రా! వాళ్ళని ఆ నీడల్లో వెదుకుదాం . . డొనాల్డ్ జస్టిస్ (12 ఆగష్టు 1925 – 6 ఆగష్టు 2004) అమెరికను కవి . On The Death Of Friends In Childhood We…