వర్గం: అనువాదాలు
-
ముగింపు… మేక్స్ వెల్ బోడెన్ హీమ్ , అమెరికను కవి
వంపులు తిరుగుతున్న నీ పెదాలపై ఒకదాని వెనుక ఒకటిగా యోగ్యమైన ఆశీర్వచనాలు నర్తిస్తున్నాయి కలలు … నిలకడలేని సత్యాలు అవి దారిపక్క విరిసినపూలను ఏరుకుందికి వంగి కోటు బొత్తాలలో అందంగా అలంకరిస్తాయి చప్పుడుచెయ్యకుండా అనుకరిస్తాయి. పూవులు క్షణంలో వాడిపోతాయి గనుక కలలెప్పుడూ కళ్ళుమూసుకునే నడవాల్సి వస్తుంది. నీ మాట వింటుంటే, నే పట్టుకున్నకల కళ్ళువిప్పి ఒకసారి చూసి, కన్నుమూసింది. . మేక్స్ వెల్ బోడెన్ హీమ్ (May 26, 1892 – February 6, 1954) అమెరికను…
-
మృత్తిక … డోరతీ ఏండర్సన్, అమెరికను కవయిత్రి
ఈ కవితలో చమత్కారం… రెండు అసమాన దృశ్యాలను ప్రదర్శిస్తూనే, వాటిలోని సాదృశ్యతని వాచ్యం చెయ్యకుండా చెప్పడం. అన్నీ మట్టిలో కలిసిపోయేవే. కానీ, జీవం ఉట్టిపడుతున్నప్పుడు ఆ మట్టే ఇన్నిరూపాలుగా ప్రతిఫలిస్తుంటుంది. . మృత్తిక అంటే ఏమిటి? బూడిదైపోయిన ప్రేమ, కాలిపోయిన ఉత్తరాలు, వాడిపోయిన సూర్యముఖి, మృతుడిచేతిలోంచి జారిపడిన గులాబి రేకులు; సాలీళ్ళు, గబ్బిలాలు, పాడుబడిన ఇళ్ళు, కూలుతున్న కోటలు, గతిపంచిపోయిన సైనికుల రథచక్రాల జాడలు. అంతేనా? మృత్తిక అంటే, వెలుగు, నవ్వులు, సర్కసులు, విలాసవంతమైన గొడుగులు, ముక్కుతో…
-
ప్రత్యూషవేళలో కీచురాళ్ళు… లెనోరా స్పేయర్, అమెరికను
రాత్రల్లా కీచురాళ్ళు అరుస్తూనే ఉంటాయి చిమ్మచీకటిలాంటి నిశ్శబ్దంలో చిన్న చిన్న చుక్కలు మిణుకుమిణుకుమన్నట్టు. వేసవిరాత్రుల నిరామయతలో క్రమం తప్పని అద్భుతమైన లయతో అవి అరుస్తూనే ఉంటాయి: నీడల్ని వాటి చిన్నిగొంతులతో మోస్తున్నాయేమోన్నట్టుగా. కానీ, ప్రత్యూషకిరణాలకి మేల్కొన్న పక్షుల రవాలు చెట్టునుండి చెట్టుకు ప్రాకుతూ అడివల్లా సందడి నిండినపుడు ఓ ప్రత్యూష స్వర్ణవర్ణసమ్మేళనమా! ఒక దాని వెనక ఒకటిగా కీచురాళ్ళు నిశ్శబ్దాన్ని సంతరించుకుంటాయిసుమా. . లెనోరా స్పేయర్, 7 November 1872 – 10 February 1956 అమెరికను…
-
శ్మశాన వైరాగ్యం… W H ఆడెన్, ఇంగ్లీషు కవి
గడియారాలన్నీ ఆపండి, టెలిఫోన్లు కత్తిరించండి, రసాలూరు బొమికని కొరుకుతూ అరుస్తున్న కుక్కని అరవనీకండి, చాలు! పియానోవాయించడాన్ని ఆపమనండి, మద్దెలపై గుడ్డకప్పండి శవపేటికని బయటకి తీసుకు రండి, శోకించేవాళ్ళని దారి ఇవ్వండి. అతని మరణవార్తని ఆకాశంలో రాసుకుంటూ, విమానాలను నెత్తిమీద విచారసూచకంగా చక్కర్లు కొట్టనీండి తెల్లని పావురాల మెడల్లో మెత్తని పట్టు దండలు వెయ్యండి రాకపోకలు నియంత్రించే పోలీసుల్ని నల్లని చేతిమేజోళ్ళు ధరించమనండి అతనే నాకు తూరుపూ, పడమరా, ఉత్తరం, దక్షిణం నా పనిరోజులూ, ఆదివారాల విశ్రాంతీ అతనే…
-
Untimely Rain… Bandla Madhava Rao, Telugu, Indian
What does it matter to me now where the clouds come from? When I am severed from this soil And bade goodbye to farming, What if it rains on time or, untimely? Once the chord between me and water snapped what matters if it my barren fields are overcast with nimbus. let it…
-
దుఃఖానికి దగ్గరచుట్టం.. ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను
నేనేమైనా దుఃఖానికి దగ్గరచుట్టాన్నా, తలుపుతట్టేగడియ అస్తమాటికీ జారి పడిపోతుందెందుకు? అలాగని, దబ్భుమనీ పడిపోదు చప్పుడుచెయ్యకుండానూ రాలిపడదు, ఎప్పటినుండో దుఃఖం తట్టుకి అలవాటుపడినట్టు! గుమ్మం చుట్టూ బంతిపూలూ దవనమూ వేలాడుతుంటాయి. అయినా, అక్కడ బంతిపూలుంటే నేమిటి దవనం ఉంటే నేమిటి దుఃఖానికి? నేనేమైనా దాని చుట్టాన్నా? అస్తమాటికీ నాతలుపు తట్టడానికి మనం దాని చుట్టాలమా? ఓహ్! మీరా! రండి రండి లోపలికి. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే February 22, 1892 – October 19, 1950…
-
ఇటుకపొడి… లూయిజా బ్రూక్
అదొక శైధిల్యపు నుసి మేట ఏకధాటిగా గోడలు కూలిపోడమే. ఒకప్పుడు “ఇల్లు” అనిపిలవబడేచోట నా చిన్నతనం గడిచింది. వీడ్ధుల్లో పియానోలపై ప్రశాంతంగా ఫ్రాన్సు జాతీయగీతం వాయిస్తుంటే, ఎండ మండిపోతున్నప్పుడు ఆ అటకెక్కి ఏదో రాసుకుంటూండేదాన్ని ఇంటి యజమాని సాలుపురుగు కూర్చున్నాడు రాత్రివంటకాల వాసనావలయంలో మనుషులు తమకుచ్చిటప్పాల నరకంలో క్రమక్రమంగా మురిగిపోతున్నారు. అక్కడ నే నేర్చుకున్నది తల్చుకుంటే జుగుప్స. నేను రాత్రి తగలేసిన చమురుకీ ఎండి పోయిన నా కలకీ విచారిస్తూ కాలం వెళ్ళబుస్తూ ఉండవచ్చు. . లూయిజా…
-
సౌందర్యం… ఆర్మెల్ ఒ కానర్
సూర్యుడు చాలాచోట్ల మెరిసిపోతున్నాడు సౌందర్యం నేలమాళిగల్లోకి దిగబడుతోంది ఒక దీపం ఎన్నో ముఖాల్ని తేజోమయం చేస్తుంది దోషాన్నెత్తిచూపడంద్వారా, దోషరాహిత్యం నిర్వచిస్తోంది. ప్రతి కొండా, ఆకాసమూ, సెలయేరూ నా ప్రశ్నలకి ఒక దివ్యమైన సమాధానాన్ని అందిస్తోంది: అనుగ్రహించినవాడి అనుగ్రహం ఎన్నడూ తరిగిపోయేది కాదని. అయినా, నేను సరిపోల్చుకుంటూ, సందేహిస్తూ అకళంకమైన నా ఆనందాన్ని నాశనం చేసుకుంటాను ఎవరూ పంచుకోలేని సంపద భగవంతుడే…. కాలాతీతమైన సౌందర్యం …ఇక నా పాలు. . ఆర్మెల్ ఒ కానర్ . Beauty .…
-
వసంతంలో ఒంటరిగా…. కెరోలీన్ గిల్టినన్, అమెరికను కవయిత్రి
ఇంతకుమునుపెన్నడూ వసంతాన్ని ఒంటరిగా ఎదుర్కో లేదు; ఆ పుష్పాలూ, ఆ పిట్టలూ, ఆ తరులతాదుల శోభా… ఎప్పుడూ నాకు జంటగా నా ప్రేమిక ఉండడమే కారణం— ఇటువంటి పారితోషికాలనుండి రక్షించగలిగేది, ప్రేమ ఒక్కటే! కానీ, ఇపుడు నేను ఒంటరిని, సుదీర్ఘమైన రేయింబవళ్ళిపుడు కేవలం జ్ఞాపకాలతో వెళ్ళబుచ్చడమే పని . మేము జంటగా గడిపిన ఏప్రిల్ నెలలలో ఎన్నడైనా వసంతం మనసునింత గాయపరిచేదిగా ఉందా? మునుపెన్నడూ వసంతాన్ని ఒంటరిగా ఎదుర్కో లేదు ఈ పసిడివెలుగుల వరద… నా దుఃఖాన్ని…
-
సిద్ధసత్యాలు… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను
ప్రతి ఏడూ ఎమిలీ డికిన్సన్ ఒక మిత్రుడికి తనతోటలో పూసిన తొలి “ఆర్బ్యుటస్” మొగ్గల్ని పంపేది. ఆండ్రూ జాక్సన్ తన మరణశాసనంలో ఒక మిత్రుణ్ణి గుర్తుచేసుకుని జార్జి వాషింగ్టన్ వాడిన దూర్భిణి” ని అతనికి బహూకరించేడు. నెపోలియన్ కూడా, తన వీలునామాలో, ఫ్రెడరిక్ ది గ్రేట్ పడకగదిలోంచి తను సంగ్రహించిన వెండి వాచీని ఫలానా మిత్రుడికి దాన్ని అందజెయ్యవలసిందిగా ఆదేశించాడు. ఓ హెన్రీ తనకోటుకి తగిలించుకున్న ఎర్రని పువ్వుని తీసి కూరగాయలదుకాణంలో పనిచేస్తున్న పల్లెయువతికి ఇచ్చి “ఎర్రనైన…