వర్గం: అనువాదాలు
-
సముద్రపొడ్డున … సారా టీజ్డేల్
. సముద్రపొడ్డున కూచోడమన్నా, ఈ మహానగరాలన్నా సుతిమెత్తని పూవుల సౌకుమార్యరహస్యమన్నా, సంగీతమన్నా, కవితరాస్తూ గడపడమన్నా నాకు చాలా ఇష్టం. ఆ క్షణాలు స్వర్గంలో తేలియాడినట్టుంటుంది. . మంచుమునిగిన కొండమీద పొడిచే తొలిచుక్కలన్నా జ్ఞానమూ, దయా ఆమ్రేడితమైన పెద్దల పలుకులన్నా, చిరకాలము నివురుగప్పినట్టుండి, చివరకి కలుసుకున్నచూపుల్లో తొణికిసలాడే ప్రేమన్నా ఇష్టమే. . నేను అమితంగా ప్రేమించాను, గాఢంగా ప్రేమించబడ్డాను కూడా. కాని, ఇపుడు జీవితం పై ఆశ సన్నగిలింది. దయచేసి నన్నీ నిశ్శబ్దానికీ, చీకటికీ విడిచిపెట్టండి అలసిపోయిన నేను, సంతోషంగా…
-
One Hysterectomy … Bolloju Baba
. Whatever reason they might offer They deracinated the tree That blossoms a sanguine-flower Every month. In the Anatomy Theatre Of civilised man The body of a woman Has always been a Guinea Pig. . Whatever be the reason, The cradle of man Which put up with two cuts earlier To give birth to a…
-
1819లో ఇంగ్లండు స్వరూపం … షెల్లీ, ఇంగ్లీషు కవి
. [ఈ కవిత చదువుతుంటే, ఇందులో పేర్కొన్న ప్రతి రాజ్యాంగ వ్యవస్థలోని భాగానికీ… సమాంతరంగా ఉన్న నేటి మన రాజకీయ వ్యవస్థ అచ్చం అలాగే పనిచేస్తున్నాదని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. బలహీనమైన కేంద్రాన్ని బెదిరించి గడుపుకుంటున్నాయి చిన్న పార్టీలు. బ్రిటనులోపార్లమెంటు క్రమేపీ ప్రవేశపెట్టిన “Enclosure” చట్టాలద్వారా గ్రామాలలోని రైతులు భూమి హక్కులు కోల్పోయి, ముందు పాలెగాళ్ళుగాను తర్వాత రైతుకూలీలుగానూ మారినట్టు, ఈ రోజు భూసేకరణపేరుతో పంటభూములని కార్పొరేటు సంస్థలకు, తమ తాబేదార్లకూ అప్పనంగా అప్పచెబుతున్న ప్రభుత్వాలు, వ్యవసాయం గిట్టుబాటు…
-
నడిసముద్రంలో ఒక రాత్రి … హెర్మన్ హెస్
. రాత్రి, కడలి అలలఊయల ఊపుతున్నప్పుడు, మిణుకుమిణుకుమనే ఓ చుక్క మసకవెలుతురు దాని విశాలకెరటాలపై పరుచుకున్నప్పుడు, నా పనులన్నీ చక్కబెట్టుకుని బంధాలు విదుల్చుకుని ఒక్కడినీ, సడిచేయకుండా గుండెనిండాస్వచ్ఛమైన గాలిపీలుస్తూ వేలదీపాలప్రతిబింబాలతో, చల్లగా మౌనంగా సముద్రపుటుయ్యాలకి నన్నునేనప్పగించుకుని నిలుచుంటాను. అపుడు నా స్నేహితులు తలపులోకొస్తారు నా చూపులు వాళ్ళ చూపులలతో కలుసుకుంటాయి ఒకరివెంట ఒకరిని అడుగుతాను, ఏకాంతంగా, నెమ్మదిగా: “నీకు నేనంటే ఇంకా ఇష్టమేనా? నా కష్టం నీకు కష్టంగానూ, నా మృతి నీకు శోకించదగినదిగానూ కనిపిస్తాయా? నా ప్రేమలో…
-
నా భయాలు … జాన్ కీట్స్
ధాన్యాగారాల్లో పసిడిపంటను నిల్వజేసినట్టు తలలో పొంగిపొర్లుతున్న ఆలోచనలను అక్షరరూపంలో పుస్తకాలలోకి నా కలం అనువదించేదాకా బతకనేమోనన్న భయం నన్నావహిస్తోంది. నక్షత్రాచ్ఛాదిత నిశీధి ముఖం లోకి చూసినపుడు దొరలాడిన మబ్బు దొంతరల శృంగారకేళీ విలాసము తలుచుకుంటే, అదృష్టదేవత ఇంద్రజాలముచేసినా జీవితంలో ఆ ఛాయ లనుకరించగలనని అనుకోను. ఓ ఈక్షణిక సుందరీ! నిన్ను మళ్ళీచూసేభాగ్యం నాకు లేదని తలుచుకున్నప్పుడల్లా, ప్రతిఫలాపేక్షలేనిప్రేమ సమ్మోహనశక్తిని ఆస్వాదించలేకున్నాను. అందుకే, ఈ విశాల విశ్వసాగర తీరాన ఏకాకిగా నిలబడి ప్రేమకీ కీర్తిప్రతిష్టలకీ కడసారి వీడ్కోలు చెబుతున్నాను.…
-
ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చేరు … మార్టిన్ నీమలర్
. ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చేరు నాకెందుకు అక్కరలేనివని మాట్లాడలేదు నేను కమ్యూనిస్టుని కాదుగదా! . తర్వాతవాళ్ళు కార్మిక నాయకులకోసం వచ్చేరు. నాకెందుకని ఊరుకున్నాను నేనేమైనా కార్మికనాయకుణ్ణేమిటి? . ఆ తర్వాత వాళ్ళు యూదులకోసం వచ్చేరు మనకెందుకని అడగలేదు నేను యూదును కాదుగదా! . చివరికి వాళ్ళు నాకోసం వచ్చేరు నన్ను వెనకేసుకుని రావడానికి ఎవ్వరూ మిగల్లేదు. . మార్టిన్ నీమలర్ జర్మను ప్రొటెస్టెంటు పాస్టరు. (14 జనవరి 1892 – 6 మార్చి 1984) “వాళ్ళు…
-
సానెట్ LXVI: రాత్రి వరద భీభత్సం… ఛార్లెట్ స్మిత్
. శిలలతో నిండిన సముద్రపుటొడ్డున రాత్రి-వరద భీభత్సం సృష్టిస్తోంది: అలుపులేక పోటెత్తిన తన కెరటాలక్రింద సమాధికాబడ్డవాటికోసం రంపపుపళ్ళలాంటి కొండకొనలమీదా, చలువరాయి గుహల్లోనూ బొంగురుగొంతుతో సముద్రం శోకిస్తోంది. తవ్విపోస్తున్న తన కరకుకెరటాలతాకిడికి ఎత్తైనమిట్టకొనకొమ్ము మీంచి పచ్చికతోసహా ఒక శాలిబండ దొర్లుకుంటూ అఖాతంలోకి దబ్బుమని నిలువుగాపడింది నిశానిశ్శబ్దశ్రవణాలపై పిడుగుపడ్డట్టు. దానిప్రతిధ్వనులకి ఒడ్డు ఒణికింది. మనిషిజాడలేని ఈ తుఫాను రాత్రి ఆకాసంలో తేలుతున్న మబ్బుతెరలమాటున చంద్రుడు కళావిహీనంగా వెలుగుతున్నాడు; యువతా, బడలిన శరీరాలూ హాయిగా కలతలేక నిద్రిస్తుంటే, నేనొకడినే లక్ష్యంలేకుండా తిరుగాడుతున్నాను. నిట్టూర్పులతో…
-
ఆమె నడకే అందం… లార్డ్ బైరన్
. మబ్బులేని రాత్రి, ఆకాశంలోనిచుక్కల్నివెంటేసుకునివచ్చే చీకటిలా ఆమె అందంగా నడుస్తోంది. అసలు, ఆ తెలుపు నలుపులలోని వన్నె అంతా ఆమె కన్నులలోనూ, రూపంలోనే మిళితమై ఉంది: పరువానికొచ్చిన ఆ వెలుగు జిలుగు ప్రకృతి పగటికికూడా ప్రసాదించలేదు. ఆ నీలికురుల ప్రతి కదలికలోనూ ఆ ముఖపు ప్రతి కవళికలోనూ లలితంగా జాలువారే ఆ అజ్ఞాత సౌందర్యానికి నలుపు చిన్నమెత్తు ఎక్కువైనా, వెలుగు ఓ రవ్వ తక్కువైనా లోపమేమీరాదు: ఎప్పుడూ గంభీరంగా తేనెలొలుకుతూ ఉండే ఆ ఆలోచనల పుట్టినిల్లు ఎంత…
-
Where else is my carkless repose? … Usharani
. Woods are my birth place There are comrades every way Silken carpets of green pastures Delicate dangling of baby branches Ornate flowery ornaments Fluting whispering winds Concerts of wings on flight Choreography of cascading steps… . I am a contented soul in my dominion. . Usharani (Usharani is located in US and is a…