వర్గం: అనువాదాలు
-
చుంగ్ జు… అజ్ఞాత చీనీ కవి
మనందరికీ కొన్ని భయాలుంటాయి. ముఖ్యంగా, చిన్నప్పుడు కొన్ని విషయాలన్నా, కొందరు వ్యక్తులు, వాళ్ళతో స్నేహం అన్నా మనకి ఇష్టం ఉంటుంది కానీ అమ్మానాన్నా, అన్నదమ్ములూ, లోకులూ ఏమంటారో అన్న భయంతో ఆ పనులూ, ఆ స్నేహాలూ చెయ్యలేకపోవడం బహుశా అందరికీ కాకపోయినా కొందరికి అనుభవమే. ఈ కవిత ఆ మానసిక స్థితిని బాగా పట్టి ఇస్తుంది. ఇది సుమారు 3 వేల ఏళ్ల క్రిందటి కవిత అంటే ఆశ్చర్యం వేస్తుంది. * చుంగ్ జూ, నిన్ను బతిమాలుకుంటాను…
-
11 వ కవిత, తావొ తే చింగ్ నుండి…
ముప్ఫై చువ్వలు చక్రానికున్న కన్నాలకు బిగించినపుడు శూన్యమూ, పదార్థమూ జతకలుస్తాయి. బండి నడుస్తుంది. మట్టిని ఒక కూజా ఆకారంలోకి మలిచినపుడు శూన్యమూ పదార్థమూ జతకలుస్తాయి. కూజా పనిచేస్తుంది. తలుపులూ కిటికీలూ గదికి దారి చేసినపుడు శూన్యమూ పదార్థమూ జతకలుస్తాయి. గది పనిచేస్తుంది. నిజంగా అదంతే! పదార్థం లాభపడుతుంది శూన్యం దన్నుగా పనిచేస్తుంటే. . లావొ జు చీనీ కవి తావొ తే చింగ్ చీనీ గ్రంధము నుండి. క్రీ. పూ. 4వ శతాబ్ది. Poem Eleven…
-
ప్రేమే సర్వస్వం కాదు (సానెట్ 30) … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

ప్రేమే సర్వస్వం కాదు; తినేదీ తాగేదీ అసలు కాదు. సుఖంగా నిద్రపుచ్చేదో, వాననుండి రక్షించే పైకప్పో కాదు. అందులో పడి మునుగుతూ తేలుతూ, మునుగుతూ తేలుతూ, మళ్ళీ ములిగే మగాళ్ళని రక్షించగల ‘తేలే కలపముక్కా’ కాదు. ప్రేమ దాని ఊపిరితో ఆగిపోయిన గుండెను కొట్టుకునేలా చెయ్యలేదు రక్తాన్ని శుభ్రపరచలేదు, విరిగిన ఎముకను అతకనూ లేదు. నేను ఇలా చెబుతున్నప్పుడుకూడా, ఎంతో మంది పురుషులు కేవలం ప్రేమలేకపోవడం వల్ల మృత్యువుతో చెలిమిచేస్తున్నారు. హాఁ! ఒకటి నిజం. ఏదో ఒక…
-
Last Night’s Dream… Sowbhagya, Telugu, Indian
It was dark. Up the sky, someone had dropped a blue diaphanous veil over the earth. buildings were asleep; hillocks were asleep and forests were also in tranquil sleep. The speeding rivers slumbered And the sea was actually snoring. in the cradle of this somnolent world just you and I were awake. Even the flame…
-
A Loyalist’s Reply to Aurangzeb… Sripada Subrahmanya Sastry, Telugu, Indian Poet
When the Mughal Emperor Aurangzeb (31 July 1658 – 3 March 1707) tried to wean away the loyal soldier Abdur Razzak Khan Lari of Golkonda Nawab Abul Hasan Kutubshah (10 August 1600 – 1699) by sending him a message: “You join my army. I will put you in the coveted post. Send your elder son…
-
రజనీస్తుతి… ఋగ్వేదం నుండి
దిగంతపరీవ్యాప్తమై తమస్విని లేస్తుంటే చుక్కలు కళ్ళు మిటకరించి చూస్తున్నాయి; ఆమె ఉడుపుల ఆడంబరం అంబరాన్ని తాకుతోంది. చీకట్లను తరుముతూ అక్షయమైన తమస్సు భూమ్యాకాశాలను ఆవహిస్తోంది. సోదరి అహస్సు అడుగులో అడుగులేస్తూ పయనిస్తోంది. చీకట్లను వ్యాపించనీండి… ఓ విభావరీ! పక్షులు గూళ్ళకి ఎగసినట్టు నీ ఆగమనతో మేము ఇంటిదారి పట్టుతాము. మనిషీ, మెకమూ, విహంగమూ మొదలుగా సమస్త జీవవ్యాపారాలూ సద్దుమణుగుతాయి. విహాయస పథంలో నిర్విరామంగా ఎగిరే డేగలు సైతం విశ్రాంతికై తిరోన్ముఖమౌతాయి. ఓ రజనీ! మమ్మల్ని దొంగలూ, తోడేళ్ళబారినుండి…
-
మితభాషికి నిర్లక్ష్యం అంటగడతారు… భర్తృహరి, సంస్కృతకవి
మితభాషికి నిర్లక్ష్యాన్నీ, భక్తితో ప్రవర్తించే వానికి కపటత్వాన్నీ నిర్మల మనస్కునికి వంచననీ వీరునికి క్రూరత్వాన్నీ లోకాన్ని త్యజించినవానికి శత్రుత్వాన్నీ సరససంభాషికి నక్కవినయాలనీ హుందాగా ఉండేవ్యక్తికి అహంకారాన్నీ, మంచి వక్తకి వాచాలత్వాన్నీ విశ్వాసంగా ఉండేవారికి వ్యక్తిత్వలేమినీ లోకం ఆపాదిస్తూనే ఉంటుంది. దుర్బుద్ధితో ఆలోచించే వారి దూషణని తప్పించుకోగల సుగుణం లోకంలో, అసలు, ఉందా? . భర్తృహరి సంస్కృత కవి Apathy is Ascribed to the Modest Man . Apathy is ascribed to…
-
తనివి … లూ చీ, చీనీ కవి
రచయిత అనుభూతించే ఆనందం పూర్వం ఋషు లనుభవించినదే. నిరాకారంనుండి ఆకార మావిర్భవిస్తుంది; నిశ్శబ్దం నుండి కవి పాట పుట్టిస్తాడు. ఒక గజం పొడవు పట్టుదారంలో అనంతమైన రోదసి దాగి ఉంది; భాష గుండె మూలలనుండి పెల్లుబికే వరద ప్రవాహం. ప్రతీకల వలల వలయాలు యథేచ్ఛగా విశాలంగా విరజిమ్మి ఉన్నవి. ఆలోచనలు మరింతలోతుగా అధ్యయనంచేస్తున్నవి. లెక్కలేనన్ని పూల, అరవిరిసినమొగ్గల నెత్తావులు కవి వెదజల్లుతున్నాడు పిల్లగాలులు నవ్వుతూ ఉత్ప్రేక్షిస్తున్నాయి: వ్రాయు కుంచియల వనభూమినుండి మేఘాలు మింటిదారి నధిరోహిస్తున్నాయి. . లూ…
-
పదాలపొందిక… లూ చీ, చీనీ కవి
కవి తన ఆలోచనలని సొగసైన పదాలలోకి ఒడుపుగా ఒదిగిస్తున్నప్పుడు ప్రకృతిలో కనిపించే అనేకానేక ఆకారాలవలె సాహిత్యంకూడ అనేక రూపాలు, శైలులు సంతరించుకుంటుంది. కనుక కనులకింపైన చిత్రంలోని ఐదు రంగుల వలె ఐదు ధ్వని* స్థాయిలను అంచెలంచెలుగా వాడుకోవాలి. వాటి రాకపోకలు ఒక నిర్దిష్టక్రమంలో లేకపోయినా తారస్థాయిని అందుకోవడం కొంచెం కష్టంగా అనిపించినా మీకు స్థాయీభేదాల క్రమం, తేడాల మౌలిక లక్షణాలు పట్టుబడితే పంటకాలువల్లో పరిగెత్తే నదిలా మీ ఆలోచనలూ పరిగెడతాయి. కానీ, మీరు ఉపయోగించే పదాల గతి…
-
పనలమీద ప్రయాణం … లూ చీ, చీనీ కవి
ఒక్కోసారి మీ రచన రసభరితమైన ఆలోచనల సమాహారమైనప్పటికీ అవి ఒకదాన్నొకటి ఒరుసుకుంటూ ఇతివృత్తాన్ని మరుగుపరచవచ్చు. మీరు శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత అధిరోహించగల వేరు చోటు ఉండదు. మీరు రాసినదాన్ని ఇంకా మెరుగుపరచాలని ప్రయత్నిస్తే అది తరుగుతుంది. సరియైన సందర్భంలో వాడిన అద్భుతమైన పదబంధం, రచనపై కొరడాఝళిపించి గుఱ్ఱంలా దౌడుతీయిస్తుంది. తక్కిన పదాలన్నీ ఉండవలసిన చోట ఉన్నప్పటికీ పాలుపోసుకున్న చేను రాజనాలకై ఎదురుచూసినట్టు ఎదురుచూస్తాయి. కొరడా ఎప్పుడైనా చెడుకంటే మంచే ఎక్కువ చేస్తుంది. ఒకసారి సరిగా దిద్దిన తర్వాత,…