వర్గం: అనువాదాలు
-
శోకం… ఎడ్న సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను
పిల్లలూ, వినండి: మీ నాయన చనిపోయేడు. అతని పాత కోట్లు తీసుకుని వాటితో మీకు జాకెట్లు కుడతాను; అతని పొడుగాటి పేంట్లనుండి మీకు చిన్న పేంట్లు కుడతాను. అతని జేబుల్లో పొగాకు మరకలుపడి అతను అక్కడపెట్టే వస్తువులుంటాయి తాళం చెవులూ, చిల్లరడబ్బులూ… చిల్లర డబ్బులు డాన్ కి తన కిడ్డీబేంకులో దాచుకుందికి; తాళాలు మాత్రం ఏన్ కి చప్పుడుచేసుకుంటూ ఆడుకుందికి. జీవితం కొనసాగవలసిందే మరణించినవారిని మరిచిపోవలసిందే; ఎంత మంచివాళ్ళు చనిపోయినా జీవితం కొనసాగవలసిందే; ఏన్, పద, నీ బ్రేక్…
-
ముగ్గురు రాజులు … ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, బ్రిటన్
. గురువులకీ, గురుతుల్యులకీ, స్నేహితులకి, హితులకీ, కుటుంబసభ్యులందరికీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. . ఒక గొప్ప సామ్రాజ్యంలో రాజుగారు ఠీవిగా నిలబడి ప్రజల్ని అణగదొక్కడం చూశాను. అతని చే సంజ్ఞ చాలు, ప్రజలు తలవంచి నిల్చునేవారు అతని ఉక్కుపాదం ఎప్పుడూ వాళ్ళ కుత్తుకమీద ఉండేది అతని పేరు పాలకుల్లో, బాధితుల్లో మారుమోగేది అతని కత్తి వాళ్ళ స్తోత్రాలని ప్రతిఫలించేది. మరొక రాజు తలెత్తడం ఇంకొకచోట చూశాను. అతని మాటలు ఉదాత్తంగా, మంచిగా, వివేకంగా ఉండేవి; ప్రశాంతమైన…
-
I am just your shadow … Sowbhagya
Everything in Nature is just made out for you. The whole creation is your excursing ground. Planets of the cosmos are your play-dolls. Flowers just bloom for you and shower over you as you pass by. You pick one of them and bless it by decking it in your plait. That azure sky and moonlight…
-
Silence… Marianne Moore
మా నాన్నగారు అంటుండేవారు: “గొప్పవాళ్ళెప్పుడూ ఎవరిళ్ళలోనూ ఎక్కువరోజులుండరు. వాళ్ళకి లాంగ్ ఫెలో సమాధి(1)ని గాని హార్వర్డ్ లోని “గాజుపువ్వుల”(2) ని గాని చూపిస్తే చాలు. ఆత్మనిర్భరత గల పిల్లి ఏకాంతంలోకి తన ఆహారమైన ఎలుకని తీసుకుపోయి మూతినుండి దానితోక షూ లేసులా వేలాడుతున్నా ఎలా ఆశ్వాదించగలదో… అలా ఒక్కోసారి వాళ్లు ఏకాంతాన్ని ఆశ్వాదించగలరు. వాళ్లకి బాగా ఇష్టమైన సంభాషణేచ్ఛని కూడా అప్పుడు వాళ్ళనుండి దూరం చెయ్యొచ్చు. ఎందుకంటే, గాఢమైన అనుభూతులు మౌనంలోనే ఎక్కువప్రస్ఫుటంగా వ్యక్తమవగలవు. మౌనం అంటే…
-
ఈ శరీరం ఏమిటి? … సి. హెచ్. సిస్సన్ , ఇంగ్లండు
. ఈ శరీరం ఏమిటి? కేవలం ఊహేనా? అలా అయితే, “నా” లో నేను లేను. ఇదొక రూపకాలంకారమా? లేక, దేవునికి అన్యాపదేశమా? అదే నిజమయితే, నే నేమిటో నాకు తెలీదు. దీనికి స్పృహ ఉందని గర్వించపనిలేదు. ఎందుకంటే, సుఖం చర్మపులోతే. నువ్వు సంపాదించినవన్నీ మరొకడు అనుభవించడానికే. నీ వెలుగు మరొకరి చీకటిలో దీపకళిక. నువ్వు ఏమిచెప్పేవన్నదానితో నిమిత్తం లేదు ఎందుకంటే, నువ్వెవరైనా, ఏదైనా అది ఒక్కరోజు భాగవతమే. దానితో నీ చుక్క రాలిపోతుంది…
-
పూనకం … సుధీష్ కొట్టెబ్రం, మలయాళం, భారతీయ కవి
మహానగరాలలోనూ, పల్లెల్లోని సందుల్లోనూ ఒక్కణ్ణే తిరుగులాడేను. పిచ్చిగా వాహనాలు పరుగులెత్తే రోడ్డు మధ్యలోంచి తీరిగ్గా నడుచుకుంటూ వెళ్ళేను ఏ వాహనమైనా నన్ను చచ్చిపడేలా గుద్దెయ్యకపోతుందా అన్న ఆశతో. గురుత్వాకర్షణశక్తిని ధిక్కరిస్తూ ఆకాశాన్నందుకొంటున్న ఓక్ చెట్టు కొనకొమ్మమీద కాళ్ళు బారజాపుకుని పడుక్కున్నాను అగ్నిగుండంలో దూకాను మంచుపలకలమధ్య రోజులతరబడి పడుక్కున్నాను. అయినా ఏం ప్రయోజనం లేదు. అంతరద్దీగా ఉన్న రాదారిమధ్యనుంచీ చెక్కుచెదరకుండా బయటపడ్డాను. ఓక్ చెట్టు కొమ్మ ఆశించినట్టుగా వంగలేదు, విరగలేదు. మంటల్లోంచి నల్లగా మాడిపోయినా మంచుకి గడ్డకట్టుకుపోయినా క్షేమంగా…
-
జనప్రవాహాన్ని చూస్తుంటే… ఏ ఈ హౌజ్మన్, ఇంగ్లండు
అద్దెకు దిగిన ఈ లాడ్జిలోంచి వీధిలో వెచ్చగా ఊపిరులూదుకుంటూ ఒకరివెనక ఒకరు ఉత్సవ ప్రభల్లా వెళుతున్న జనసందోహాన్ని చూస్తుంటే… ప్రేమక్రోధాల ఆవేశాలు నిజంగా ఈ మాంస గృహంలో బలీయమైనవయితే నేను శాశ్వతంగా నివసించవలసిన ఆ మట్టింటి గురించి కాస్త ఆలోచించనీండి. అగోచరమైన ఆ దేశంకాని దేశంలో పూర్వఛాయలేవీ అక్కడ మిగిలుండవు అక్కడ ప్రతీకారాలు మరుగునపడతాయి ద్వేషించినవాడికి ద్వేషం గుర్తుండదు. రెండువరుసల్లో నిద్రిస్తున్న ప్రేమికులు పక్కనున్నవారు ఎవరు అని అడగరు రాత్రిగడిచిపోతునా, పెళ్ళికొడుకు పెళ్ళికూతురుదగ్గరకి చేరుకోడు. . ఏ…
-
In the Dark room … Koduri Vijayakumar, Telugu, Indian
. That night… when failures banished sleep to the eves of eyelashes; when this wounded bod sang blues all night with darting pain; Death, escorted by rain, entered the dark room and said: “Friend! Look here! Your grief is a ceaseless torrent! Life is but a bout of grief… nothing more; Come! hug me! Let…
-
అద్దంలో చూసుకుంటూ… థామస్ హార్డీ, ఇంగ్లండు
అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ముదిమితేరుతున్న చర్మాన్ని చూసి అనుకున్నాను: “దేముడికి ఆలోచనవచ్చి చర్మమంత పల్చగా హృదయాన్ని కూడా కృంగదీస్తే ఎంతబాగుండును!” ఎందుకంటే, అప్పుడు, నాపట్ల నిర్లిప్తంగా ఉండే హృదయాలను చూసి ఏ బాధలూ లేకుండా, నిశ్చింతగా అంతులేని విశ్రాంతికి ఒంటరిగా ఎదురుచూడొచ్చు. కానీ, కాలం ఉందే, నన్ను ఏడిపించడానికి కొన్ని లాక్కుని, కొన్ని వదిలేస్తుంది; ఈ జీవన సంధ్యలో శుష్కించిన శరీరంలో మధ్యాహ్నపు గుండెగుబుళ్ళు రగుల్కొల్పుతుంది. . థామస్ హార్డీ (2 June 1840 –…
-
ఆడకుక్క … స్మిత మీనాక్షి, మలయాళం, భారతీయ కవయిత్రి
నేను రోజూ క్రమంతప్పకుండా వరండామీదే పడుక్కుంటాను. మీరు రోజూ ఉదయాన్నే మొట్టమొదటగా, తలుపుతీసి బయటకొచ్చినపుడు ముందు కాళ్ళను నేలకి ఆనించి, బారజాపి మీపాదాలకి సాష్టాంగం పెడతాను. మీరు వాకిట్లోకి దిగగానే, మీపాదాలనొకసారి చుట్టి, నాకి, నా ముఖాన్ని ఆంచి, మీకు రాత్రి నిద్ర బాగా పట్టిందా అని పలకరిస్తాను. తోకాడించుకుంటూ, మరొక రాత్రిగడపడానికి అనుమతించినందుకు కృతజ్ఞతతో, కళ్ళు తిప్పుతూ, మీరు తిరిగొచ్చేదాకా ఇక్కడే ఉంటానని చెబుతాను. సాయంత్రంవేళ మీరు ఇంటికొచ్చినప్పుడు గుమ్మమ్ముందు నిలబడి…