వర్గం: అనువాదాలు
-
Emendation… Gurajada Appa Rao, Telugu, Indian

“Tak!…Tak!!…Tak!!!”, Gopalarao tapped the door gently with his knuckles. There was no response. The door wasn’t opened . he waited for a while. The clock struck one. “My god! I am late again. Too late! I have been a fool! I must be careful from tomorrow. Far from being an anti-nauch, I have slid down …
-
నేను లేని లోటు నీకు తెలియదులే… హసన్ షహీద్ సుహ్రావర్దీ, భారత- పాకీస్తానీ కవి

నీ జడనుండి ప్రమత్తంగా రాలిన పువ్వులా నేను మరణించిన తర్వాత నేను లేని లోటు నీకు తెలియదులే. కానీ ఏదో ఒక తుఫాను రాత్రి చలినెగడు ప్రక్క కూర్చున్నపుడు అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులా నీ మదిలో ఎక్కడో మెదలకపోను. నువ్వొక చిరునవ్వు నవ్వి, ఆలోచిస్తుంటావు చేతిలోని పుస్తకాన్ని పక్కకి పెట్టి సుదూర తీరాల్లోకి చూపులు నిలిపి నువ్వు నెగడుకి దగ్గరగా జరుగుతావు. . హసన్ షహీద్ సుహ్రావర్దీ (24 October 1890 – 5 March 1965)…
-
ప్రేమ తత్త్వము… గోవింద కృష్ణ చెత్తూర్, భారతీయ కవి
ఈ అవనిమీద జీవించి, ప్రేమించి, సౌందర్యాన్ని దర్శించి పదునైన కలలు ఆయుధాలుగా చీకటినుండి వేకువ మొలిచేదాకా శ్రమించి, అందరూ నడిచేత్రోవకీ, కోలాహలాలకీ అతీతంగా ఎగరడానికి (ఆలోచనల) రెక్కలుగలిగినవా డెవడు దైవాన్ని చులకనచేసి మాటలాడగలడు? ఈ క్షణికమైన అనంతతత్త్వాన్ని తెలిసినవారు అనిమిషులతో సరిసమానులే. వారు సురలోక వాటికలపై సురలతో పాటుగా విహరిస్తారు. అనుపమానమైన గంధర్వ గానాన్ని ఆస్వాదిస్తూ. అలాగే, దివ్యమైన ప్రేమకి వారసులమైన మనం కూడా, దేవతల వలె, అమరానంద పారవశ్యంతో ఎదిగి దైవత్వాన్ని సంతరించుకుని, రానున్న భవిష్యత్తులో,…
-
వసంతాగమనం… నగేష్ విశ్వనాథ్ పాయ్, భారతీయ కవి
యవ్వనపు తొలి కోరికలలా వసంతుడు అడుగుపెడుతున్నాడు… వాటి హేమంతపు నిద్రనుండి మేల్కొలపడానికి జంకుతున్నాడా అన్నట్టు చెట్లమీదనుండీ, పొదలమీదనుండీ,పాదులమీదనుండీ చప్పుడు చెయ్యకుండా బొటనవేలి అంచుపై అడుగు లేస్తూ… ఆ సరోవరపు స్వచ్ఛమైన నీటిపై సున్నితమైన ఎర్ర తామరలు సూర్యుని వే వెలుగుకిరణాల స్పర్శకు సంతోషంతో మెరిసిపోతున్నాయి, అంతే సుకుమారమైన తెల్ల కలువలు సిగ్గుతో, బిడియంతో వెండివెలుగుల రేరాజుకై ఎదురుచూస్తూ తమ ముఖాలని నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి; మబ్బుతునక జాడలేని నిర్మలమైన ఆకాశాన్ని చూసి ఆనందిస్తున్నాయి; సమ్మోహపరిచే సుగంధాలు వెదజల్లుతూ బంగారు…
-
ఒక కన్నియ ప్రార్థన… జోసెఫ్ ఫ్యుర్టాడో, గోవా, భారతీయ కవి

ప్రియతమా! అప్పుడే సంవత్సరం గడిచిపోయింది నువ్వు నా జీవితభాగస్వామిగా ఉంటానని ప్రమాణం చేసి, పైనున్న దేవతల సాక్షిగా ముద్దిడి ప్రమాణాలు చేసుకున్నాం ఆ ప్రమాణాలు నిలుపుకుంటామనీ బాస చేసుకున్నాం ఇపుడు రాత్రీ పగలూ పైనున్న దేవతలని ప్రార్థిస్తున్నాను మన బాసలు కలకాలం నిలిచేలా దయతో అనుగ్రహించమని. ఒళ్ళెరగని గాఢమైన నిద్రలో మునిగినపుడు ప్రతిరాత్రీ నీ ముఖం నా కలలో కనిపిస్తుంటుంది ఆతృతగా నిన్ను కాగలించుకుందికి పరిగెత్తుతానా, అంతలో తెలివి వచ్చి, కల మోసంచేసిందని తెలుస్తుంది అప్పుడు నా…
-
ఏ చూపు?… పూండి శేషాద్రి, భారతీయ కవి
నీ చూపుల్లో ఏది నా గుండెపై గాఢ ముద్రవేసిందనిచెప్పను? ఆ రోజు సాయంత్రం … అలవాటుగా నువ్వు సన్నగా చిరునవ్వు నవ్వుతూ సరదాగా పేరుపెట్టి గట్టిగా పిలుస్తూ చూసావే ఆ చూపని చెప్పనా? ఒక రోజు ఊరికి దూరంగా, సమీపంలోని అడవిలోకి కారులో వెళ్ళినపుడు, కాలమహిమచే శిధిలమై నలుదిక్కులా పడి ఉన్న అమహావృక్షాల మౌనముద్రలు చూసి ఆశ్చర్యపడినదా? నేను కొత్తగా రాసిన కవిత్వ పుస్తకంపై వాలి ఒక్కొక్క కవిత గురించి అడిగినప్పటిదా? లేక, ఆ రోజు రాత్రి…
-
ఇంటితోవ పట్టినపుడు… చాంగ్ ఫాంగ్ షెంగ్, చీనీ కవి
అంతరాయంలేకుండా వేల అడుగులు ఎత్తునున్న కొండశిఖరాల్లారా! ఒక్క అలకూడా లేకుండా వందలమైళ్ళు పరుచుకున్న సరస్సులారా! ఏడాది పొడుగునా ఒక్క నీడకూడా లేకుండా తెల్లగా ఉండే ఎడారులారా! వేసవిలోనూ, హేమంతంలోనూ పచ్చగా ఉండే పైన్ వనసీమలారా! విరామమెరుగకనిరంతరం పరుగులుతీసే సెలయేళ్ళలారా! వేల యేళ్లబట్టి మీ మాట నిలబెట్టుకుంటున్న మహావృక్షాల్లారా! మీరు ఒక్కసారిగా ఈ దేశదిమ్మరి బాధలకు ఉపశమనము కలిగించారు అతని కలం కొత్తగీతాలను వ్రాయడానికి ప్రేరణనిచ్చారు>. . చాంగ్ ఫాంగ్ షెంగ్, 4వ శతాబ్దము చీనీ కవి .…
-
స్త్రీ…. ఫ్యూ హ్యువాన్, చీనీ కవి
స్త్రీగా పుట్టడ మెంత దుఃఖభాజనమో కదా! ప్రపంచంలో అంతకంటే విలువతక్కువది మరొకటి ఉండదు. కుర్రాళ్ళు తలుపుకి చేరబడి నిలుచుంటారు దివినుండి దిగివచ్చిన దేవతల్లా. వాళ్ళ హృదయాలు నాలుగు సముద్రాలకీ, వేలమైళ్ళ దుమ్మూ ధూళీ, పెనుగాలులకీ వెరువరు. ఆడపిల్ల పుట్టినపుడు ఎవరూ ఆనందంగా ఉండరు. ఆమె వల్ల ఆ వంశవృద్ధి జరగదు. ఆమె పెరిగి పెద్దయ్యేక తనగదిలోనే దాగుంటుంది. మగవాళ్ళని ముఖాముఖీగా చూసే ధైర్యంలేక. ఆమె అత్తవారింటికి పోయినపుడు ఎవరూ ఏడవరు వర్షం వెలిసిన తర్వాత నెలకొన్న మేఘాల…
-
మందసమీరము… ఫ్యూ హ్యువాన్, చీనీ కవి
ప్రశాంతమైన రాత్రివేళ సమీరము మంద్రంగా వీచుతోంది. గోపురం మీద చంద్రబింబం తెల్లగా మెరుస్తోంది. ఏదో గొంతు గుసగుసలాడుతోంది కానీ పిలిస్తే ఎవరూ బదులివ్వరు నీడ ఏదో కదుల్తోంది, కానీ రా రమ్మని పిలిస్తే ఇటు రాదు. వంటవాడు కప్పుడు ఉడకబెట్టిన లెంటిల్స్ తెస్తున్నాడు. మదిరకూడా ఉంది, కానీ నా కప్పులో నింపుకోను. సంతృప్తితో నిండిన పేదరికం విధి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం సంపదలూ, కీర్తిప్రతిష్టలూ అనర్థానికి చెలికత్తెలు ప్రపంచమంతా బంగారానికీ, రత్నాలకీ ఆశపడి దాచుకున్నా, నా దృష్టిలో…
-
సందులో విద్వాంసుడు… సో సూ, చీనీ కవి
పంజరంలో బంధించబడ్డ పక్షి టపటపామని తన రెక్కల్ని నాలుగుపక్కలా కొట్టుకుంటోంది. ఆ ఇరుకు వీధిలోని విద్వాంసుడు నిరాశా నిస్పృహలతో ఉన్నాడు నీడని అప్పళించుకుని ఆ ఖాళీ ఇంట్లో ఉంటున్నాడు. అతను బయటకి వెళ్ళాలంటే వెళ్ళడానికి గమ్యం ఏదీ లేదు, అతని త్రోవనిండా ముళ్లకంపలూ, విరిగిన కొమ్మలూ. అతనొక స్మృతికావ్యం రాస్తాడు, ఎవరూ చదవరు, ఆదరించరు. ఎండిన చెఱువులో చేపలా ఉన్నచోటే చిక్కుపడిపోయాడు. బయట… దమ్మిడీ సంపాదన లేదు లోపల… వంటగదిలో గింజ ధాన్యం లేదు. అతని అసమర్థతకి…