వర్గం: అనువాదాలు
-
A Black Love Poem… Afsar, Telugu, Indian
1 Will you agree at least now That there is no invisible love? 2 All that remained between us were some apprehensions And few insults still. And after that Either you shoot me Or I shoot you. 3 No. Faces of people Are not just colourful flora Or green foliage; Neither woods, nor skies Nor…
-
Some Stars and a Few Drops of Tears … Vimala. Telugu, Indian
(The agony and angst of the story can be understood better by the readers if they come to know that the poetess Vimala was once an active revolutionary spending the prime of her youth in forests, married to another revolutionary (but had very little family life with both attending to different assignments) who was later…
-
నల్లమందు చేలలో … జేమ్స్ స్టీఫెన్స్, ఐరిష్ కవి
. పాట్నీ ఓ పిచ్చోడు. వాడు నాతో అంటాడు: ప్రతిరోజూ ఉదయం వాడు చూస్తుంటాడట ఆకాశంలో ఒక దేవదూత విహరించడం; ప్రభాత సూర్యకాంతుల ఆకాశం నుండి దోసిళ్ళకొద్దీ నల్లమందు విత్తనాలను అన్నిదిక్కులా పైరులమీద జల్లుతూ పోతాడట. అని చెప్పి, తర్వాత ఆ దేవదూత సూర్యుడిలో ఎరుపు రంగు కోసం పరిగెడతాడని చెప్పేడు. అరే, నల్లమందు ఒక కలుపు మొక్క అంటాన్నేను; కాదంటాడు వాడు. పొడుగ్గా అందంగా ఉండే ఆ పువ్వుల్ని పైరులమధ్యా, మైదానాలమీదా తోటల్లో దొడ్లల్లో వ్యాప్తిచెయ్యడంలో…
-
ఎవరి ప్రపంచం వాళ్లది… మార్తా గిల్బర్ట్ డికిన్సన్ బియాంచీ అమెరికను
ఒక వేసవి పొద్దు ఉరకలేస్తున్న సెలయేటి ఒడ్డున కొబ్బరాకుల బూరాలు ఊదుకుంటూ ఒక కాలక్షేపరాయుణ్ణి చూసేను అతని ప్రపంచం అంతా హాయిగా ఉల్లాసంగా ఉన్నట్టుంది ప్రతి వంపులోనూ అతని చేష్టల్లో కొంటెతనం కనిపిస్తోంది. . కలలప్రపంచంలో తేలియాడుతున్న ఒక చిత్రకారుణ్ణి చూసేను అతని దేదీప్యమానమైన సృష్టిలోంచి హరివిల్లు ఉదయిస్తోంది కామరూపిలా పలు అవతారాలు ధరిస్తున్న ఆలోచనాస్రవంతిపై దాని సమ్మోహకరమైన పట్టకపు రంగులను ప్రసరిస్తూ . . నేనొక ఉచ్చును చూశాను… మరోలోకాన్ని కప్పుతూ… దానిమీద వేట పక్షులు…
-
పనికిమాలిన వివరాలు… సీ ఫ్రై ససూన్
నాకే గనక బట్టతలై, కోపంతో ఎగశ్వాసవస్తుంటే నేను స్థావరానికి పోయి ఇతర మేజర్లతో కూచుని కుర్రాళ్లని యుద్ధరంగానికి పంపేవ్యూహాలు పన్నేవాణ్ణి. ఉబ్బిన నా ముఖం ఎప్పుడూ చిటపటలాడుతూ కనిపించేది; ఉన్నంతలో ఉత్తమమైన భోజనశాల్లో తిని తాగుతూ, కవాతుల్లో అమరవీరుల చిఠాచదువుతుండే వాడిని: “పాపం, ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉన్న కుర్రాడు!” వీళ్ళనాన్నని నాకు బాగా తెలుసు; నిజమే! ఈ తాజా పోరాటంలో మనం భారీగా నష్టపోయాం,” అనే వాణ్ణి, యుద్ధం ముగిసిన తర్వాత, యువకులందరూ శిలాఫలకాలైనపిదప మా ఇంటికి…
-
పగటిపూట విమానప్రయాణం… జాక్ డేవిస్, ఆస్ట్రేలియను కవి
జెట్ లో కూచుని కళ్ళుమూసుకున్నాను. నాతో పాటే ఒక వినీలాకాశపు తునకనీ, ఒక చారెడు మైలుతుత్తంవంటి సముద్రపు చెలకనీ తీసుకెళ్ళనిస్తుందేమోనని ఎయిర్ హోస్టెస్ ని అడిగేను బాగా దిగువన నా దేశం తళతళలాడుతోంది బక్క చిక్కుతున్న నదుల్తో, లేతనీలి సరస్సులతోనూ; నేను కలగంటూ కోరున్నది నిద్రతోవాలిన తలక్రిందకీ తలగడలా మడుచుకుందికీ, పైన కప్పుకుందికీ ఉత్త ఎర్రటి ఎడారి చౌకాన్ని. . జాక్ డేవిస్, ఆస్ట్రేలియను కవి 11 మార్చి 1917- 17 మార్చి 2000. జాక్ డేవిస్,…
-
వందల తెరచాపల్లో …మిహైల్ ఎమినెస్క్యూ, రుమేనియా
తీరాల్నీ, వొడ్లనీ, అఖాతాల్నీ విడిచిపెట్టే వందల తెరచాపల్లో అలలతాకిడికీ, తుఫాన్లకీ బలైపోయేవి ఎన్ని ఉండవు? సంద్రాలమీదా నేలమీదా బారులుతీర్చి ఎగిరే పక్షుల్లో కెరటాలకిచిక్కి సముద్రంలో మునకలేసేవి ఎన్ని ఉండవు? నువ్వు నీ అదృష్టాన్ని, ఆదర్శాలనీ, నువ్వు నీ సర్వస్వాన్నీ వెంటాడుతూపోతే నీ వెనకే పరిగెత్తుకొస్తాయి సుడిగాలులూ, సుడిగుండాలూ. నీ ప్రార్థనలనుండి వెలువడే ఆలోచనల గూఢార్థం ఎవరికీ తెలీదు ఈ గాలులూ, ఈ సుడిగుండాలూ పరిగెడుతూ, ప్రవహిస్తూ, గుసగుసలాడతాయి. . మిహైల్ ఎమినెస్క్యూ (January 15, 1850 –…
-
హెరాక్లైటస్ … విలియం జాన్సన్ కోరీ, ఇంగ్లీషు కవి
వాళ్ళు అంటున్నారు హెరాక్లైటస్! వాళ్ళంటున్నారు ఇక నువ్వు లేవని. భరింపశక్యంకాని వార్త మోసుకొచ్చేరు వాళ్ళు వినడానికీ, ఏడవడానికీ; మనిద్దరం ఎన్నిసార్లు మనమాటలతో సూరీడ్ని విసిగించి,నింగి వీడేదాకా మాట్లాడుకున్నామో తలుచుకుని తలుచుకుని కన్నీళ్ళు కార్చేను. ఇప్పుడు నువ్వు నిద్రిస్తున్నావు, నా ప్రియమైన కేరయాన్ అతిథీ! ఒక పిడికెడు బూడిదై, ఎన్నాళ్లనుండో, ప్రశాంతంగా. అయినా, నీ మధురమైన స్వరాలు, నీ కోయిలలు మేలుకున్నయిలే మృత్యువు దేన్నైనా హరించగలదేమో గాని, అవి దాని తరం కాదు. . విలియం జాన్సన్ కోరీ…
-
అజ్ఞాత పౌరుడు … WH ఆడెన్, ఇంగ్లీషు కవి.
(JS/07/M/378 స్మృతిలో ఈ పాలరాతి విగ్రహం ప్రభుత్వంచే నెలకొల్పబడింది) . గణాంకశాఖ సేకరించిన సమాచారం ప్రకారం ఇతని మీద అధికారికంగా ఏ రకమైన ఫిర్యాదులూ లేవు. అతని నడవడి గురించి వచ్చిన అన్ని నివేదికలూ అతను ‘ఋషి’ అనే ప్రాచీన శబ్దానికి ఆధునిక నిర్వచనం అంటున్నాయి. ఎందుకంటే, అతను చేసిన ప్రతీదీ విశాలసమాజానికే అంకితం. యుద్ధ సమయంలో తప్పితే, అతను పదవీ విరమణచేసే వరకూ అతనొక కర్మాగారంలో పనిచేశాడు, ఏనాడూ తొలగించబడలేదు. అతను తన యజమానులు ……
-
స్వాతంత్య్రాన్నయినా యినా ఇవ్వు, లేకుంటే మృత్యువైనా !… పాట్రిక్ హెన్రీ, అమెరికను
(అమెరికా స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఆ దేశ స్వాతంత్య్రానికీ, వ్యక్తి స్వేచ్ఛకీ, సర్వమానవ సౌభ్రాతృత్వానికీ అసలు అమెరికను తత్త్వానికి పునాది వేసిన జార్జి వాషంగ్టన్, అబ్రహాం లింకన్ వంటి మహానుభావుల్ని వారి మానవీయ ఆదర్శాలనీ స్మరించుకుంటూ, వారి ఆదర్శాలని ఆచరణలో పెట్టడానికి చిత్తశుద్ధిగల రాజకీయ నాయకులు మళ్ళీ అమెరికాలో అవతరించాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటూ అమెరికను పౌరులందరికీ శుభాకాంక్షలు. అధికారాన్ని తమ స్వంతలాభానికీ, తమపిల్లలకి దోచిపెట్టడానికి కాకుండా, తాము పదవీ ప్రమాణం చేసినప్పుడు పలికిన మాటలకి కట్టుబడుతూ దేశప్రజలకీ,…