వర్గం: అనువాదాలు
-
బంగారం అయిన ప్రతీదీ మెరవదు… JRR టొల్కియన్, ఇంగ్లిష్ కవి
. బంగారం అయిన ప్రతీదీ మెరవదు. దేశాలు తిరుగుతున్నవాళ్లంతా దారితప్పినవాళ్లు కారు చేవ ఉన్నది పాతదయినా శిధిలమైపోదు. అంతరాంతరాల్లోని వేళ్లని గడ్డమంచు చేరుకోలేదు నివురులోంచే నిప్పు రాజుకుంటుంది నీడల్లోంచే వెలుగు ఒక్కసారి తలెత్తుతుంది; విరిగిపోయిన కత్తే, మళ్ళీ అతుక్కుంటుంది, కిరీటం లేనివాడే ఒక రోజు రాజవుతాడు. . JRR టొల్కియన్ 3 January 1892 – 2 September 1973 ఇంగ్లీషు రచయిత . Lord of the Rings పుస్తకం THE FELLOWSHIP OF…
-
సన్నిహితులు … D.H. లారెన్సు, ఇంగ్లీషు కవి.
నా ప్రేమంటే నీకు ఏమాత్రం లక్ష్యం లేదా? అని అడిగిందామె నిష్టూరంగా. ఆమె చేతికి అద్దాన్ని అందిస్తూ అన్నాను: ఈ ప్రశ్నని అడగవలసినవాళ్ళని అడుగు! నీ విజ్ఞాపనలని కేంద్ర కార్యాలయానికే పంపు! భావావేశ ప్రాధాన్యత ఉన్న విషయాలలో మీరు నేరుగా అత్యున్నత అధికారినే సంప్రదించవలెను… అని చెప్పి అద్దాన్ని చేతికి అందించేను. దాన్ని నాబుర్రకేసి పగలగొట్టి ఉండేదే, కాని అంతలో తన ప్రతిబింబాన్ని చూడ్డం తటస్థించింది. అది, రెండు సెకెన్లపాటు ఆమెని మంత్రముగ్ధురాలిని చేసింది. ఆ సమయంలో…
-
In The End… Vazir Rahman, Telugu, Indian
. Nothing remains in the end! Even the dreadful snake… that herald of death Dissolves like a scrawl on water. Some wild plant peeps out with passion Breaking through the grave Sapping the essence of the bod Only to wither away soon. Some small dirty cranial bone remains Wallowing in sun and dust… Rejected even…
-
ప్రతిఘటన … రషీద్ హుస్సేన్, పాలస్తీనా కవి.
నా దేశపు ఏ యోధుడూ ఒక చిన్న వరికంకుకైనా హాని చెయ్యడానికి నేను వ్యతిరేకం పిల్లలు… ఏ పిల్లలైనా సరే, తుపాకులు ధరించవలసిరావడానికి నేను వ్యతిరేకం నా చెల్లెలు సాయుధ కవాతు చెయ్యడానికి నేను వ్యతిరేకం ఆ మాటకొస్తే, నేను నీ అభీష్టాలకి వ్యతిరేకం… కానీ, వాళ్ల కళ్ళముందే నిరాఘాటంగా మనుషులప్రాణాలు పోతుంటే ఎంత స్థిత ప్రజ్ఞులైనా ఏమిచెయ్యగలరు? పదేళ్ళకే పిల్లలు వీరమరణం చెందడానికి నేను వ్యతిరేకం ప్రతిచెట్టూ పళ్ళకి బలు, తూటాలు కాయడానికి వ్యతిరేకం నా…
-
అన్వేషణ … గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్, అమెరికను
నేనొక పరమ పాపిని; కానీ నాకు ఋషిత్వం అంటే ఏమిటో తెలుసు అలసి వంగిన వాళ్ళ మోకాళ్ళూ, చిన్నా పెద్దా అపరాధాలూ, వేనవేల సూదులు గుచ్చుతున్నట్లు అంతులేని పశ్చాత్తాపాలూ, చిత్తంతో చేసిన పాపాలకి, జీవితాంతం నిజంగా చెల్లించే ప్రాయశ్చిత్తాలూ. . నాకు అన్నిదిక్కులా తిరగాలనుంటుంది, కాని నాకు జైలు అంటే తెలుసు, చెప్పుకోడానికెవరూ ఉండరు కాబట్టి, అలా రుద్రాక్షలకు చెప్పుకోడమే రాగరంజితమైన ఈ శరీరం, దాని చిత్రవిచిత్రమైన చమత్కారాలూ కళ్ళుమిరిమిట్లుగొలిపే శిలువ యశస్సుముందు చులకనచెయ్యడమే. . ఒకరితరఫున నేను వకాల్తా…
-
కవికావడం ఎలా… ఈవ్ మెరియం, అమెరికను.
ఒక చెట్టునుండి ఆకు తీసుకో దాని ఆకారం యథా తథంగా అనురేఖనం చెయ్యి దాని అంచులూ లోపలి గీతలూ రెమ్మకి ఎలా అతుక్కుని ఉందో జ్ఞాపకం పెట్టుకో (అలాగే, కొమ్మకి ఈ రెమ్మ ఎలా వాలి ఉందో కూడా) అది ఎలా ఏప్రిల్ లో చిగురిస్తుందో అదే జులై ఆగష్టు నెలాఖరు వచ్చేసరికి ఎంత సర్వాంగసుందరంగా ఉంటుందో. దాన్ని నీ చేతిలో నలిపి చూడు అప్పుడు గ్రీష్మాంతవేళ దాని విషాదాన్ని వాసనచూడొచ్చు; దాని కాండాన్ని నమిలి చూడు…
-
ఏడం ఫిర్యాదు … డేనిస్ లెవెర్టోవ్, బ్రిటిష్ అమెరికను కవయిత్రి
కొంతమంది మనుషులకి నువ్వు ఎన్ని ఇవ్వు; చాలదు. ఇంకా కావాలనే అడుగుతుంటారు. ఉప్పూ పప్పూ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఇంకా ఆకలే అంటారు. పెళ్ళి చేసుకున్నా పిల్లలని కన్నా ఇంకా దేహీ అంటూనే ఉంటారు అఖండభూదానం చెయ్యండి వాళ్లకాళ్లకిందభూమినే వాళ్ళకి ఇచ్చెయ్యండి అయినా ఛాలలేదని వీధినపడతారు. వాళ్ళకి లోతెరుగని నూతిని తవ్వించండి నీళ్ళకి అయినా వాళ్ళకి దాని లోతు చాలదు వాళ్ళు చంద్రుణ్ణికూడా తాగెయ్యాలి. . డెనిస్ లెవెర్టోవ్ (October…
-
ముత్యపుపడవలో వీనస్… ఏమీ లోవెల్, అమెరికను
ఒక విషయం చెప్పు నాకు, ముత్యపుచిప్ప పడవలో ముడుతలుపడుతున్న అలలమీద తేలుతూ తీరానికి కొట్టుకొస్తున్న వీనస్ నీకంటే అందంగా ఉందా? ఏమిటి, బోట్టిచెల్లీ* చూపు నాకంటే గొప్పగా అంచనా వెయ్యగలదా? ఆమెపై అతను విసిరిన రంగుపూసిన గులాబి మొగ్గలు వెండిజరీ ముసుగులో నీ అపూర్వ సౌందర్యం దాచడానికి నీపై వెదజల్లుతున్న నా అక్షర సుమాలకంటే విలువైనవా? నా మట్టుకు నువ్వు వినీలాకాశంలో తేలియాడుతూ వెలుగులవడ్డాణం ధరించి కిరణాలమీద చిద్విలాసంగా నడవడానికి సన్నద్ధంగా ఉన్నావు. నీకు ముందు పరిగెత్తుతున్న…
-
Evening Perfumes… Ismail, Telugu, Indian
She daubs Evening perfumes For my sake every eve. The scent of thin shadows Creeps under her chin and ears. The aroma of a Steady standing rain Over a Casuarina plantation On the sea-shore Flares in her tresses. A whiff of the caves The sun-lion sleeps at night Sweeps over her body. And in her…
-
ఒక మెట్రో స్టేషనులో… ఎజ్రా పౌండ్, అమెరికను
జన సమూహంలో ఈ వదనాల దివ్య సందర్శనం… తడిసిన గుబురుపొదలలో కవటాకుల సౌందర్యం. . ఎజ్రా పౌండ్ (30 October 1885 – 1 November 1972) అమెరికను ఈ కవిత చిన్నదే గాని, దీని వెనక పెద్ద కథ ఉంది. ఎజ్రాపౌండ్… కవిత్వానుభవం. ఒక రోజు పారిస్ లో “Concorde” మెట్రో స్టేషన్ లోంచి బయటకి వస్తూ ఎజ్రా పౌండ్ ఒక అందమైన ముఖాన్ని చూశాడు. తర్వాత మరొకటి, మరొకటి, ఇంకొకటి చూశాడు. ఆ తర్వాత ఒక…