వర్గం: అనువాదాలు
-
మానవ పరిజ్ఞానము… సర్ జాన్ డేవీస్, ఇంగ్లీషు కవి
నాకు తెలుసు నా శరీరము అతి బలహీనమైనది,కారణం బయట శక్తులూ, లోపలి జ్వరాలూ దాన్ని నశింపజేయగలవు; నాకు నా మనసు దివ్యాంశ సంభూతమనీ తెలుసు కానీ, దాన్ని అతితెలివీ, లాలసా రెండూ చెడగొడతాయి. నాకు తెలుసు నా ఆత్మ అన్నిటినీ తెలుసుకోగల శక్తిగలది, కానీ అది అన్నివిషయాల్లోనూ అజ్ఞానీ,అవివేకీను; నాకు తెలుసు నేను ప్రకృతిలో ఒక మాదిరి మహరాజుని, కానీ అధమమూ, నీచమూ అయిన విషయాలకి దాసుడిని. నాకు తెలుసు నా జీవితం క్షణికమూ, దుఃఖమయమూ నా…
-
తోటలో … హొరేస్ హోలీ, అమెరికను కవి
కురుస్తున్న వర్షానికి తోటలో నిలబడి నుదురు పైకెత్తి చినుకులని ముఖంపైకి ఆవాహనచేశా. వావ్! ఎంత మనోల్లాస భావన! ఎక్కడికో జారి పడిపోతున్నట్టు మేఘాలతో, స్థావరజంగమ ప్రకృతితో,అస్తిత్వ బంధాలతో ఒంటరిగా… అలాగని ఏదో పోగొట్టుకోడమో, పొందడమో, అయిపోడమో కాదు; క్షణికమూ అవ్యక్తమూ ఐన ఆత్మానుభూతి,అంతే! మనసుకలవరపరచి బాధలకుగురిచేసే బంధాలనుండీ అన్ని అవసరాలనుండీ పరిపూర్ణమైన స్వేచ్ఛ! ‘తేలిపో’ అంటూ అరిచా ఆ క్షణానికి జేజేలుపలుకుతూ! ఆ నిర్మలానందాన్ని స్తుతించవలసిందే; అది అంతరించినా ఆ క్షణంలో ఉదయించిన నూతనోత్తేజమూ, ఉదాత్తభావనలూ శాశ్వతంగా…
-
నా నైపుణి లేక కళ… డిలన్ థామస్, వెల్ష్ కవి
ఈ నిశ్శబ్ద నిశీధిని, ప్రేమికులు తమ దుఃఖాలని కాగలించుకు నిద్రించేవేళ బయట స్వచ్ఛంగా వెన్నెల విరజిమ్ముతుంటే లోపల రెపరెపలాడుతున్న దీపం ప్రక్కన నేను సాధనచేస్తున్న ఈ నైపుణ్యమూ,ఈ కళా పేరుప్రఖ్యాతులకోసమో, జీవికకో బ్రహ్మాండమైన వేదికలపై వాటిని దర్పంతో ప్రదర్శించడానికో కాదు; వాటి అంతరాంతర రహస్యాలు ఇచ్చే అతి సహజమైన ఆనందంకోసం. గాలికి రెపరెపలాడుతున్న కాగితాలపై అందమైన వెన్నెలనుండి దూరంగా బ్రతికే అహంభావి మనిషికోసం కాదు నేను రాస్తున్నది; వాళ్ళ కోయిలలతోనూ,వాళ్ల స్తుతిగీతాలతోనూ అమరులైన కవిశ్రేష్ఠులకోసమూ కాదు; …
-
సంతలో తిరుగుతూ ఆమె… పెడ్రాక్ కోలం, ఐరిష్ కవి
నా జవరాలు నాతో ఇలా అంది “మా అమ్మ ఏమీ అనుకోదు మా నాన్న నిన్ను చులకనచెయ్యడు నీకు ఆస్తిపాస్తులేం లేవని.” అంటూ నా పక్కనుండి తప్పుకుని పోతూ, “మరెన్నాళో లేదు, ప్రియతమా, మన పెళ్ళిరోజు. అందాకా,” అని వీడ్కోలు చెప్పింది. నానుండి వీడ్కోలు పలికి ఆమె సంతలో తిరగ సాగింది. పిచ్చిగా ఆమేవంకే చూడసాగేను ఆమె అటూ ఇటూ తిరుగుతుంటే. ఒక్క చుక్క మిగిలుందనగా ఇంటిముఖం పట్టింది చివరకి సెలయేటి అలలలమీద సాయంవేళ రాజసంగా విహరించే…
-
కంకార్డ్ యుద్ధం … రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, అమెరికను కవి
అదిగో, వరదనీటిమీది తాత్కాలిక వంతెనప్రక్కన వేసవి తొలి గాలులకు వాళ్లజండా రెపరెపలాడుతూ ఎగిరింది; ఒకప్పుడు యుద్ధానికి సన్నద్ధులై రైతులు నిలబడిందిక్కడే వాళ్ళు పేల్చిన తుపాకిగుండు ధ్వనే ప్రపంచమంతా మారుమోగింది. శత్రువేనాడో చప్పుడులేని నిద్రలోకి జారుకున్నాడు గెలిచినవీరులూ అలాగే శాశ్వతంగా నిద్రిస్తున్నారు; కాలప్రవాహం ఆ శిధిలమైన వంతెనను కొట్టుకుపోయింది సముద్రము వైపు పారే నల్లని ఉప్పుటేరురూపంలో. పచ్చని ఈ ఒడ్డున, నిలకడగా పారే సెలయేటి తీరాన మనమీ రోజు ఈ స్మృతి ఫలకాన్ని నిలబెడుతున్నాం; వాళ్ళు చేసిన త్యాగాలకు…
-
వెలుగు… ఫ్రాన్సిస్ విలియం బూర్డిలాన్, ఇంగ్లీషు కవి
రేయికి ఎన్నో వేల కన్నులున్నాయి పగటికి మాత్రం ఒక్కటే. అందుకే సూర్యుడు కనుమరుగవడంతోనే ఈ ప్రపంచం మీది వెలుగంతా నశిస్తుంది. మనసుకి వెయ్యి కన్నులున్నాయి హృదయానికి ఉన్నది ఒక్కటే అందుకే, ప్రేమ నిండుకుందంటే చాలు జీవితంలోని వెలుగంతా మటుమాయమౌతుంది. . ఫ్రాన్సిస్ విలియం బూర్డిలాన్ (22 March 1852 – 13 January 1921) ఇంగ్లీషు కవీ, అనువాదకుడూ. . . Light . The night has a thousand eyes And the day…
-
నిండా ఐదు నిలువులలోతు… షేక్స్పియర్
మీ నాన్న నిండా ఐదు నిలువుల లోతులో ఉన్నాడు పగడాలు అతని ఎముకలతోనే తయారవుతాయి; ఆ మెరుస్తున్న ముత్యాలు అతని కన్నులే అతనికి సంబంధించినవేవీ కళావిహీనమవవు బదులుగా,ఒక అద్భుతమూ అపురూపమూ ఐన వస్తువుగా రూపుదాలుస్తాయి; జలదేవతలు అతని స్మృతిలో గంట గంటకీ సంగీతం ఆలపిస్తుంటారు. అదిగో విను! నాకు వినిపిస్తోంది … గంట గణగణ. . షేక్స్ పియర్ విలియం షేక్స్పియర్ అందరికీ ఒక గొప్ప నాటక కర్తగా పరిచయం. ఆ రోజుల్లో కవిత్వ సంప్రదాయం అంతా…
-
శృతిలేని స్మృతిగీతం … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
కరకు నేల ప్రేమ మయమైన హృదయాలను కప్పిపుచ్చడానికి నేనింకా అలవాటు పడలేదు; కానీ నిన్నా, నేడూ, రేపూ, అనాదినుండీ అలాగే జరుగుతోంది. పండితులూ, స్ఫురద్రూపులూ చీకట్లో కలిసిపోతారు. పూలహారాలతో లిల్లీలతో అలంకరింపబడి మరీ వెళతారు; అయినా అంగీకరించబుద్ధి కావటం లేదు. ప్రేమికులూ, ఆలోచనా పరులూ అంతా నీతోపాటే మట్టిలోకి… ఏ తేడాలూ తెలియని రసహీనమైన మట్టిలో అంతా ఒకటైపోతారు. నీకు తెలిసినదీ, నువ్వు అనుభవించినదాంట్లో ఒక లేశం, ఒక కొండగుర్తు, ఒక పేరు మాత్రం మిగిలి… ఉత్తమమైనది…
-
మార్జిన్లో రాతలు … బిల్లీ కాలిన్స్, అమెరికను కవి
ఒక్కోసారి వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉంటాయి సన్నని నల్లటి చేవ్రాలులో… ప్రతి పేజీ మార్జిన్లోనూ చెల్లాచెదరుగా కోపంతో రచయితమీద వ్యతిరేకంగా. “నా చేతికిగాని దొరికితే, Kierkegaard ! Conor Cruise O’Brien! తలుపు గడియపెట్టి మీ తలలోకి కాస్తతర్కం ఎక్కేలా చేస్తాను,” అన్నట్టు ఉంటాయి. కొన్ని వ్యాఖ్యలు మాత్రం అప్పటికప్పుడు వ్రాసినవి “అర్థం పర్థంలేదు,” అంటూ తీసిపారేసే రకమో, “ప్లీజ్”, “హ్హహ్హహ్హా” అని రాసే రకమో అన్నమాట. నాకు బాగా గుర్తు, ఓ సారి పుస్తకం చదువుతూ……
-
నీలాంబరాలు… Sara Teasdale
ఎన్ని లక్షల వసంతాలు గడిచిపోయి ఉంటాయి నీలాంబరి పూలు అంత నీలంగా ఉంటాయనీ, వాకకాయలు అంత తెల్లగా ఉంటాయని నేను తెలుసుకునే లోపు. ప్రాణం నాతో తెగతెంపులు చేసుకున్నాక అల్లనల్లన వచ్చే ఎన్ని వేల వసంతాలు నీలాంబరాలతో నీలిమంటలనీ వాకపొదల్లో తెల్లమంటల్నీ పుట్టిస్తాయో. ఓహ్! మీ అందంతో నన్ను దహించండి! ఓ చెట్టూ చేమల్లారా! నన్ను గాయపరచండి, లేకపోతే చివరికి మృత్యువు ప్రయత్నిస్తుంది ఈపాటి సంతోషసమయాన్ని కూడా మిగల్చకుండా లాక్కుపోడానికి. తూగాడే పువ్వుల్లారా!తళతళలాడే…