ఈ నిశ్శబ్ద నిశీధిని, ప్రేమికులు
తమ దుఃఖాలని కాగలించుకు నిద్రించేవేళ
బయట స్వచ్ఛంగా వెన్నెల విరజిమ్ముతుంటే
లోపల రెపరెపలాడుతున్న దీపం ప్రక్కన
నేను సాధనచేస్తున్న ఈ నైపుణ్యమూ,ఈ కళా
పేరుప్రఖ్యాతులకోసమో, జీవికకో
బ్రహ్మాండమైన వేదికలపై వాటిని
దర్పంతో ప్రదర్శించడానికో కాదు;
వాటి అంతరాంతర రహస్యాలు ఇచ్చే
అతి సహజమైన ఆనందంకోసం.
గాలికి రెపరెపలాడుతున్న కాగితాలపై
అందమైన వెన్నెలనుండి దూరంగా బ్రతికే
అహంభావి మనిషికోసం కాదు నేను రాస్తున్నది;
వాళ్ళ కోయిలలతోనూ,వాళ్ల స్తుతిగీతాలతోనూ
అమరులైన కవిశ్రేష్ఠులకోసమూ కాదు;
ఏ ప్రశంసలూ, ఏ పారితోషికాలూ ఇవ్వలేక
అసలు నా కౌశలంతో,కళతో నిమిత్తంలేకుండా
అనాదిగా వస్తున్న బాధల భుజాలపై
చెయ్యివేసి నడిచే కవిత్వ ప్రేమికులకి.
డిలన్ థామస్
(27 October 1914 – 9 November 1953)
వెల్ష్ కవి
Hear the poem in Dylan’s Voice here

.
స్పందించండి