వర్గం: అనువాదాలు
-
వర్ణన… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
జార్జి “దేముడు పొట్టిగా లావుగా ఉంటాడు,” అన్నాడు. నిక్ “లేదు, సన్నగా పొడవుగా ఉంటాడు,” అన్నాడు. “అతనికి తెల్లని పొడవాటి గడ్డం ఉంటుంది,” అని లెన్ అంటే “లేదు, అతను నున్నగా గడ్డం గీసుకుని ఉంటాడు,” అన్నాడు జాన్. విల్ “అతను నల్లని వాడు,” అంటే, “కాదు, తెల్లని వాడు” అన్నాడు బాబ్. రోండా రోజ్ అంది: “దేముడు పురుషుడు కాదు, స్త్రీ.” నాలో నేను నవ్వుకున్నాను గాని,…
-
ఎపుడో…… ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి
చక్కని కాంతులీను ఒక ఆమని పగటివేళో లేక మంచు పొడిగారాలే సుదూర హేమంతవేళో, ఏ ఆనందఛాయలూలేని శూన్యశిశిర వేళో… ఏదో రోజు మృత్యువు నన్ను సమీపిస్తుంది. . అన్ని రోజుల్లాగే బాధేసుఖమనిపించిన రోజునో, గతంలోమాదిరి ఏ సందడీలేని రోజునో నేటికీ రేపటికీ నకలుగా ఉండే రోజునో మృత్యువు నన్ను సమీపిస్తుంది. . నా కళ్ళు మసకచీకటి మార్గాలకి అలవాటుపడతాయి నా చెంపలు చల్లబడి కళతప్పిన పాలరాయిలా ఉంటాయి ఉన్నట్టుండి నిద్ర నన్ను ముంచెత్తుతుంది. నొప్పితో…
-
what does he do alone?… Nanda Kishore, Telugu, Indian
Suffering the turmoils within what does he do alone? Sitting on the sandy shore He would pen poems on the spurgy tides; going lyrical at the undulating waves and the swaying froth he would hum a tune striking a rhythm with their balletic steps. when the tide overwhelms him he would be perturbed like…
-
తరాలు … ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
నువ్వు బంగారు రంగు చివురులు తొడుగుతూ తిన్నగా ఎదుగుతూ కొమ్మలతో ఊగిసలాడే చిన్ని బాదాం (1) చెట్టు మొలకవి . నీ నడక కొండగాలికి రివ్వున కొమ్మలు జాచే బాదం చెట్టు వంటిది. నీ గొంతు సడి ఆకులమీద తేలికగా విహరించే దక్షిణగాలి ఒరిపిడి; నీ నీడ నీడకాదు, విరజిమ్మిన వెలుతురుపొడ; రాత్రివేళ నువ్వు ఆకాశాన్ని క్రిందకి దించుకుని నక్షత్రాలను చుట్టూ కప్పుకుంటావు. నేను మాత్రం, తనపాదాల చెంత పెరుగుతున్న పిల్ల బాదం మొక్కని మేఘావృతమైన…
-
నా ప్రియమిత్రుడు, జాన్ ఏండర్సన్, రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి
ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్, మనిద్దరికి తొలిసారి పరిచయమైనపుడు నీ జుత్తు ఎంత కారునలుపుగా ఉండేదని, ఒత్తైన నీ కనుబొమలు గోధుమరంగులో ఎంతో తీరుగా ఉండేవి; కానీ జాన్, ఇప్పుడు ఆ కనుబొమలు పల్చబడ్డాయి, నీ జుత్తు బాగా తెల్లబడింది; ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్, నీకు అనేకానేక ఆశీస్సులు. ప్రియ మిత్రమా, జాన్ ఏండర్సన్, మనిద్దరం కొండ కలిసి ఎక్కేవాళ్ళం ఎన్నో ప్రకాశవంతమైన రోజుల్ని ఇద్దరం ఒకరికొకరు తోడుగా గడిపేం, గుర్తుందా, కానీ, జాన్ ఇక…
-
A book slipping from a rack… Mallavajjala Narayana Sarma, Telugu, Indian
Like an unexpected call from an old friend A book slips down from the bookrack. How many tears he might have shed, the poet, And how much he must have struggled to gather himself … He was tenderly humane here and there And equally arrogant even times, Sometimes, strong and severe Like the ever effusive…
-
After bidding Adieu…Afsar, Telugu, Indian
She walks silently across the bridge… As if she has caressed a flower with her delicate hands; Or, has feathered a branch along her rosy cheeks… The bridge whelms in Spring Himself becoming a flower And a greenish sprig… After she crosses the bridge over She looks back for a brief moment And then swiftly…
-
మనసులో శిశిరం… HW లాంగ్ ఫెలో, అమెరికను
ఇది శిశిరం; బయట ప్రకృతిలో కాదు, నా మనసులోనే ఉన్నది…ఈ అచేతన. యవ్వనం, వసంతమూ నన్నుఆవరించి ఉన్నా ఇక్కడ వయసు మీరినది కేవలం నేనొక్కడినే. . పక్షులు గాలిలో రివ్వునదూసుకుపోతున్నాయి, పాడుకుంటూ, విరామంలేక గూడుకట్టుకుంటూ; నలుదిక్కులా జీవం సందడిస్తోంది ఒక్క నా మనసులో తప్ప. . అంతా నిశ్శబ్దం; ముదురాకులు గలగలా రాలి కదలకుండా పడున్నై; ధాన్యం నూరుస్తున్న చప్పుళ్ళు వినరావు మిల్లు కూడా మూగపోయింది. . HW లాంగ్ ఫెలో (February 27,…
-
విచికిత్స .. డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
నేనే మెత్తనిదాన్నై ఉండి, అందంగా ఉండి నా మనసు నీ పాదాలముందు పరిచితే; నా మనసులోని ఆలోచనలన్నీ నీతో చెప్పుకుని నువ్వు తేలికగా చెప్పే అబద్ధాలన్నీ నిజమని పొగిడితే; “నిజం సుమీ” అని నెమ్మదిగా మనసులోనే అనుకుని “ప్రియా! ఎంత నిజం చెప్పావు,” అని పదేపదే చెపుతూ; సందర్భానికి తగ్గట్టు కళ్ళువాల్చుకుని నీ నొసలుచిట్లింపులకు ముఖంపాలిపోయేలా భయపడుతూ, నా మాటల్లో నిన్నెక్కడా ప్రశ్నించనంతవరకు ప్రియతమా, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావు. అదే నేను బలహీనురాల్నై, పిచ్చి…
-
తుదీ- మొదలూ … జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి
యుద్ధం ముగిసిన ప్రతిసారీ ఎవడో ఒకడు అంతాశుభ్రం చెయ్యాలి. విషయాలు వాటంతట అవి చక్కబడవుకదా. శవాలతో నిండిన బళ్ళు ముందుకు నడవాలంటే, ఎవరో ఒకరు రోడ్డుమీదున్న చెత్తను రోడ్డుపక్కకి ఊడ్చిపోయాలి. ఎవడో ఒకడు కూరుకుపోవాలి … చెత్తా, బుగ్గీలో, సోఫా స్ప్రింగుల్లో, పగిలినగాజుముక్కల్లో రక్తాలుచిమ్మిన గుడ్డపీలికల్లో… గోడకూలిపోకుండా ఒకడు పొడవాటి దూలం పూటు పెట్టాలి ఊడిపోయిన తలుపు తిరిగి తగిలించి కిటికీ అద్దాలు పగిలినవి తీసి కొత్తవి వెయ్యాలి. చూడటానికి అంతగొప్పగా ఏం ఉండదు, చాలా ఏళ్ళుపడుతుంది…