వర్గం: అనువాదాలు
-
దీపం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.
సుదీర్ఘమైన చీకటి దిగుడు బాటపట్టి నేను పోతున్నపుడు నీ ప్రేమని ఒక దీపంలా నా ముందు పట్టుకో గలిగితే అంతులేని నీడలు నను చుట్టుముట్టినా భయపడను; భీతితో కెవ్వుమని కేకలూ పెట్టను. నేను దేవుడ్ని కనుక్కోగలిగితే, కనుక్కుంటాను. ఎవరికీ అతను కనిపించకపోతే, నిశ్చింతగా నిద్రిస్తాను… భూమి మీద ఉన్నప్పుడు నీ ప్రేమ ఒక్కటే సరిపోలేదా చిమ్మ చీకటిలో దీపంలా… . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి…
-
అర్థ రాత్రి పచార్లు చేస్తున్న అబ్రహాం లింకన్ … వాషెల్ లిండ్సే, అమెరికను కవి
ఏదో అమంగళ సూచన, ఈ దేశానికి చెందిన ఆకారం అర్థరాత్రపుడు, అతిసామాన్యమైన మా నగరంలో, సంతాపంతో తిరుగుతోంది, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా, అదిగో కోర్టుకి దగ్గరగా, అటూ ఇటూ పచార్లు చేస్తోంది. తన ఇంటికి పక్కగా, నీడలు పాకే అతని ఆవరణలలో తనపిల్లలు ఒకప్పుడు ఆడుకున్న జాగాలో మెల్లగా ఆగి ఆగి ఒకోసారి బజారులో చరిస్తూ, అరిగిపోయిన రాతి బాటమీదా నక్షత్రాలు నివురుగప్పేదాకా అడుగులో అడుగువేసుకుంటూ… ఒక పొడవాటి వెల్లబారిన మనిషి పాత సూటులో పేరుబడ్డ High…
-
I know… Aluri Bairagi, Telugu, Indian
. I know I know No one meets with love on this miry agonizing cataclysmic mundane path; nor any plant takes root on this craggy surface; that we are all helpless soldiers fighting against hunger in the dark and the clueless sailors caught in a thunderstorm over high seas; that the scissoring gales of life…
-
గుర్తుంచుకోదగ్గ నవ్వు… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, జర్మన్- అమెరికను
మా ఇంట్లో అందమైన కర్టెన్లు వేలాడుతూ మరుగుపరిచే వెడల్పు ఏకాండీ కిటికీ ముందున్న మేజాబల్ల మీద అక్వేరియంలో “గోల్డ్ ఫిష్” గుండ్రంగా తిరుగుతూ ఉండేవి; మా అమ్మ, ఎప్పుడూ నవ్వుతూ, మేమందరం ఆనందంగా ఉండాలని చెబుతూ ఒకసారి ” హెన్రీ! ఆనందంగా ఉండరా!” అంది. నిజమే. ఉండగలిగితే ఆనందంగా ఉండడం మంచిదే. కానీ మా నాన్న నన్నూ మా అమ్మనీ వారంలో ఎన్నోసార్లు కొడుతూ ఉండేవాడు, ఆరడుగుల రెండంగుళాల విగ్రహం లోపల కోపంతో రగిలిపోతూ, ఎందుకంటే అతన్ని…
-
కవిమిత్రుడి మది ఊరుపు… శ్రీనివాస్ వాసుదేవ్, తెలుగు
1 నా నరాల్లో సంగీతం ఉరకలెత్తుతోంది అయినా, సరియైన స్వరం అందడం లేదు. నా దగ్గర తీగతెగిన వీణియ ఉంది దాన్ని సరిచేసి శృతిచేయగల వైణికుడు కనిపించడంలేదు. 2 విషాదభరితమైన గాథ ఉంది చెప్పడానికి కాని చెవిఒగ్గివినే శ్రోతే కరువైపోయాడు. పదాల ప్రవాహంతో గొంతు ఉక్కిరిబిక్కిరి అవుతోంది రసావిష్కారమై పొరలే తీరు మాత్రం కనిపించడం లేదు. 3 నా విశ్వాసాల ప్రపంచం దిగంతాలకి వ్యాపించి ఉంది అయినా అప్పుడప్పుడు సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి నా దగ్గర ఎన్నో…
-
ఆరితేరిన సైనికుడు… ఛార్లెస్ సిమిక్, సెర్బియన్- అమెరికను కవి
నాకు పదేళ్ళు వచ్చేసరికి నేను కొన్నివందల యుద్ధాల్లో పాల్గొన్నాను, లెక్కలేనన్ని గాయాలయ్యాయి, కొన్ని వేల మందిని హతమార్చాను. మా అమ్మ నన్ను చెయ్యిపట్టుకుని తోటలోకి చకచకా లాక్కెళ్ళింది. వాకచెట్లు పూలతో నిండుగా ఉన్నాయి. గడ్డిలో ఒక పిల్లి ముడుచుకు పడుకుంది. దాని తోక లాగుదామనుకున్నాను గాని పోనీ ఎందుకులే అని దానిమానాన్న వదిలేశాను. విమానదాడి పూర్తయ్యాక ఆకసం నిండా పక్షులూ, నిప్పుకణికలూ ఎగురుతున్నాయి. కానీ, నా కాళ్ళదగ్గర చీమలు మాత్రం కూలుతున్న గోడలను ఆనుకుని తమపనులు చేసుకుంటూ…
-
ఋణం… సారా టీజ్డేల్, అమెరికను
ఎన్నాళ్లనుండో నన్నింత గాఢంగా ప్రేమిస్తున్నావు కదా నీకు నేనేమి ఋణపడి ఉన్నాను? నువ్వెన్నడూ నా ఊహలకి రెక్కలు తొడగలేదు నా మనసులో కూనిరాగాన్నైనా పలికించలేదు. కానీ, ఓ, నేను ప్రేమించినతనికా? అతను నన్నసలు ప్రేమించనే లేదు. స్వర్గం లోకి దారితీసే ఆ చిన్న ద్వారం ఉందే అదీ నేనతనికి బాకీ పడ్డాను. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి. . . Debt . What do…
-
A Plot of Mushrooms … K. Geetha, Telugu, Indian
A filament of white hair flashes on my forehead rather disconcertingly… Like a ripened leaf grazing against the branch, Like, say, for the first time the cruel Fall setting in rather too early… the cracking sounds of aged dry branches reverberate somewhere within me… A new pain aches sitting heavy on the head at…
-
నిశ్శబ్దపు నిట్టూరుపు… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఆ చిన్ని గుట్టమీద మునివేళ్ళమీద నిలబడ్డాను; వాతావరణం చల్లబడుతూ ఆకు అల్లాడకుండా ఉంది. సుకుమారమైన మొగ్గలు కించిత్ గర్వంతో ఒక పక్కకి తలవాల్చి ఉన్నాయి, ఒకటీ అరా ఆకులతో సన్నగా మొనదేలిన కొమ్మలు తొలి వేకువ నిట్టూర్పులలో చిక్కిన వాటి నక్షత్రఖచితమైన మకుటాల్ని ఇంకాకోల్పోలేదు. మేఘాలు తెల్లగా స్వచ్ఛంగా, అప్పుడే ఉన్నితీసిన గొర్రెలు ఏటిలో మునకేసివచ్చినంత నిర్మలంగా ఉన్నాయి, నిశ్శబ్దం విడిచిన గాఢమైన నిట్టూర్పునుంచి వెలువడిన సడిలేని సవ్వడేదో ఆకులదొంతరలలో కదలాడింది; ఎందుకంటే ఆ పచ్చదనంపై విరిసిన…