వర్గం: అనువాదాలు
-
సాహితీజీవిత ఆత్మకథ… ఫ్రాంక్ ఒహారా, అమెరికను
నా చిన్నతనంలో నేనొక్కడినే ఆడుకుంటూ ఉండే వాడిని స్కూలు ఆటస్థలానికి ఓ మూల, ఒంటరిగా. నాకు బొమ్మలంటే అసహ్యం ఆటలంటే అయిష్టం, జంతువులు స్నేహంగా ఉండేవి కావు, పిట్టలు పారిపోతుండేవి. నాకోసం ఎవరైనా వెదుక్కుంటూ వస్తే ఓ చెట్టు వెనక దాక్కుని “నేనొక అనాథని” అని ఏడుస్తుండే వాడిని. ఇప్పుడు చూడబోతే నేనిక్కడ, ఈ కవితలు రాసుకుంటూ, ఆనందానికి కేంద్రంగా! ఆశ్చర్యం! . ఫ్రాంక్ ఒహారా (March 27, 1926 – July 25, 1966) అమెరికను…
-
Son of Yasoda… Munipalle Raju, Telugu, Indian
1 I was under the wrong impression that I acquired the trait of “listening with utmost attention” from my childhood. That was not my nature. It was a trait I acquired from the compulsions of my profession. In the legal profession, particularly when you handle a major chunk of the criminal cases at district level,…
-
Confessions Of A Poet… Dr. Vamshidhar Reddy, Telugu, Indian
1 So, tell me something about you? About me? I am an itinerant mammal with the Processor Medulla oblongata tucked in my brain. I am a Homo sapien wiser than monkey by about 12 points. I am an animal hungrier than the wild … I am variously called a man Do you know? I am…
-
A Birth Deferred… Satish Chandar, Telugu, Indian
My heir always puts me the same question: “Father! When do you expect me?” I stand before the full length mirror. Not a six-pack body But six-lakh insults shall I see therein. Whenever I look at my close crop of curls Recalling the knotted hairs of my grandfather Who was denied both scissors and…
-
XII ఎమిలీ డికిన్సన్, అమెరికను
నా రథచక్రం చీకటిలో చిక్కుకుంది. నాకు ఒక ఆకూ కనిపించడం లేదు, అయినా నీళ్ళోడ్తున్న దాని కమ్ములు గుండ్రంగా ఉన్నచోటే తిరుగుతున్నాయని తెలుస్తోంది. నా అడుగు కెరటం మీద పడింది ఇదెన్నడూ నడిచినత్రోవ కాదు, అయినా అన్ని మార్గాలకీ చివర ఒక చక్కని మైదానం ఉంటుంది. కొందరు నావ తెడ్డు వదిలిపెట్టేరు, కొందరికి సమాధిలోనే ప్రశాంతమైన వ్యాపకం దొరుకుతుంది, కొందరు సమస్యలని నీకూ నాకు వదిలిపెట్టి దర్జాగా రాజసంగా అడుగులేసుకుంటూ ద్వారంలోంచి నిష్క్రమిస్తారు. …
-
కురుస్తున్న మంచులో దేవదారు చెట్లు… థామస్ వెంట్ వర్త్ హిగిన్సన్, అమెరికను
నిశ్శబ్దం కన్నా మెల్లగా, నిలిచిపోయిన గాలికంటే నిశ్చలంగా ఎత్తైనదేవదారువులనుండి జాలువారుతున్నాయి లేతఆకుల్లా…మంచుపరకలు. ఈ అడవి నేలంతా వార్షికపు వరాన్ని అందుకుంటోంది నిర్విరామంగా, ప్రశాంతంగా, సమృద్ధిగా కురిసే హిమపాతం రూపంలో. చాలా సున్నితంగా తేలియాడుతూ, వయసుమీరిన ఆ గండశిలల్ని అంత సున్నితంగానూ, సొగసుగానూ అలంకరిస్తున్నాయి. శిశిరంలో పనలు పనలుగా రాలిన ఆకులుకంటే వెలబోయిన పసుపురంగు వస్త్రాన్ని నేస్తున్నాయా లేక, ఆ చిత్రమైన మంచుపుష్పాలు “విచ్ హేజిల్స్” (1) ని ధరిస్తున్నాయా? పొడవైన చెట్లవరుసలోంచి సూర్యకిరణాలు అడ్డంగా దూసుకొస్తున్నై…
-
చేతిరుమాలు … అజ్ఞాత కవి, యుక్రెయిన్
(యుక్రెయిన్ పడుచులలో ఒక ఆచారం ఉంది. పెళ్ళికి ముందు వాళ్ళు అల్లిన చేతిరుమాలు, నిశ్చితార్థం నాడు వరుడు ముంజేతికో, ఇంకెక్కడైనా ప్రస్ఫుటంగా కనిపించేచోట కడతారు. ) . సముద్రానికి ఆవలి అంచున సూర్యుడు మునిగి ఉన్నాడు ఎర్రగా, రక్త వర్ణంతో; ఆ కెంపువన్నె ప్రవాహంలో ఒక పడుచు మేలిమి రుమాలు అల్లింది. బంగారంలాంటి చక్కని చేతికుట్టుతో అల్లింది… ఈ రేయి ఆమె చెక్కిళ్ళు తెల్లకలువల్లా కనిపిస్తాయి, కన్నీట కడిగిన స్వచ్ఛమైన కలువల్లా ఆల్లిక పూర్తవగానే గుండెలకి గాఢంగా…
-
Habit … BVV Prasad, Telugu, Indian
Sometimes, we should get out of our daily rut And declare independence from the rote routine. For a change, we should leave the vehicle behind and go on foot; Greet for the first time the unknown person we regularly meet on the road; Forget all the cares and sleep whole day and wake through…
-
(స్వర) సంగతులు- 1… కాన్రాడ్ ఐకెన్, అమెరికను
నెలఱేడు తెలినీలి వెన్నెల కురిపిస్తునాడు నలుదిక్కులా నీరవము అలముకుంటోంది . కరిమబ్బులు చుక్కల్ని మరుగుచేస్తూ కమ్ముకుంటున్నై నిర్మానుష్యమైన ఈ ఉద్యానంలో ఎండుటాకులను కాళ్ళక్రింద తొక్కుతూ నడుస్తున్నాను ప్రేమికులు మౌనంగా కూచున్న ఈ పాలరాతి పలకపై ఆకులు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఖాళీ పలకలమీద ఎండుటాకులు పేరుకున్నాయి క్రింద మురికిగుంటలోని నీరు, వణుకుతున్నట్టు చంద్రుణ్ణి అలలపై తేలియాడిస్తోంది. అల్లంతదూరంలో పొడుగాటి చెట్లు చందమామక్రింద అసహనంగా కదులుతున్నాయి. ప్రేయసీ! నేను ఒంటరిగా నడుస్తున్నాను… నాతో పాటే ఎప్పుడూ నడిచే…
-
మిస్సిస్సిపి నది మీద… హేమ్లిన్ గార్లాండ్ అమెరికను
వర్షపుచినుకుల మచ్చలతో, చీకటిలో బూడిదరంగులో మారి, దట్టంగా విశృంఖలంగా పెరిగిన అడవుల్లోంచి విశాలమైన ఆ నది, చాలా ప్రశాంతంగా పారుతోంది. వంపులు తిరిగిన దాని గుండెమీద కదులుతున్న ఒంటరి పొగపడవలోంచి, ఎడమవైపు దీపం మిణుకుమంటోంది నీడల్లా కదులుతున్న ‘ఓక్ ‘ చెట్ల మీదనుండి అరుణతార కనిపిస్తున్నట్టు. సడిచెయ్యని ప్రేతాత్మలా, మిణుగురుల పచ్చని మిణుకుల్లోంచి పడవ పెట్టిన పెనుబొబ్బకి నిశ్శబ్దం బెదిరి పారిపోతున్నట్టు ఒక హెరాన్ రెక్కలల్లార్చుకుంటూ ఎగిరిపోయింది. . హేమ్లిన్ గార్లాండ్ సెప్టెంబరు 14, 1860 –…