వర్గం: అనువాదాలు
-
మృదువర్షధార … సారా టీజ్డేల్, అమెరికను
ఓ రోజు వస్తుంది… సన్నని ధారలుగా వర్షం పడుతుంటే నేల కమ్మని వాసనలేస్తుంటుంది, పిచ్చుకలు కిచకిచలాడుతూ చక్కర్లు కొడుతుంటాయి; రాత్రుళ్ళు చెరువులలో కప్పలు బెకబెకలాడుతుంటాయి; పిచ్చిగా మొలిచిన అడవిరేగు పూలుతెల్లగా గాలికి వణుకుతుంటాయి క్రిందకి వాలిన సరిహద్దు తీగలపై ఎర్రని రెక్కల రాబిన్ లు ప్రేమసరాగాలాడుకుంటుంటాయి; ఒక్కదానికీ యుద్ధం గురించి ఎరుక ఉండదు, ఒక్కదానికీ యుద్ధం ఎప్పుడు అంతమయిందో పట్టదు. చెట్టుకిగాని, పిట్టకిగాని బాధ ఉండదు మానవజాతి సమూలంగా నాశనమయిందే అని. సూర్యోదయంతోనే మేల్కొన్న వసంతం సయితం…
-
ఒక మంచుపెర్ల తో… ఫ్రాన్సిస్ థామ్సన్, ఇంగ్లీషు కవి
అసలు నిన్ను ఏ మనసు ఊహించగలిగింది? మా కల్పనాశక్తికి పరిధి దాటిపోయింది. (ఓ జిలుగుపనితనాప్ల పూరేకా!) ఎంతో స్వచ్ఛంగా, సుకుమారంగా, యదార్థంగా సృష్టించబడ్డావు. ఏ ఊహాతీతమైన స్వర్లోకపు లోహంతో చెయ్యబడ్డావు? ఎంత అమూల్యమైన దానివి? నిన్నెవరు తీగలా సాగదీసారు, నిన్నెవరు వెండి ఆవిరులతో రూపుదిద్దారు? “నన్ను రూపుదిద్దినది ఆ భగవంతుడే. ఊహాగానాలకి అతీతంగా తనే నన్ను సాగదీసి, సొగసు వంకరలుపోయే వెండి ఆవిరులనుండి తన మనసు తనివి తీరేలా సృష్టించేడు. ఇంత స్వచ్ఛంగా, అంత లీలగా, అంత…
-
నీరొక వరం… హేమ్లిన్ గార్లాండ్, అమెరికను
“ఇక్కడ దగ్గరా నీళ్ళు దొరుకుతాయా?” అని మైదానపు వ్యక్తులు అడుగుతుంటారు, ఎడారిలో తారసపడినపుడు. పెదాలకి వేలు ఆనించి నల్లగా ఉన్న నవాజోను అదే అడుగుతాను. ఆ మనిషి నవ్వుతూ సమాధానం చెబుతాడు, “అదిగో!” అంటూ వేళ్ళు పైకెత్తి మైళ్ళదూరాన్న ఉన్న ఒయాసిస్సును చూపిస్తూ. మేము అలా నడుచుకుంటూ ఎడారిలో వెళ్తాం నీటికోసం వెతుకులాట పెనవేసిన సోదర బంధంతో. . హేమ్లిన్ గార్లాండ్, అమెరికను . Hamlin Garland . The Gift of Water . “IS…
-
ఫిర్యాదు… మార్క్ అకెన్ సైడ్, ఇంగ్లీషు కవి
దూరం! దూరం! మోసకారీ, ప్రేమా! నన్నిక మభ్యపెట్టకు: నీ మెత్తని మాటల ప్రభావానికి నా అమాయకపు యువహృదయం బలైంది, చివరికి ఎలాగైతేనేం నీ కుట్ర బహిర్గతమైంది కడకి ఖరీదైన అనుభవంతో జాగ్రత్త తెలిసొచ్చింది. దూరం! ఈ వయసులో నన్ను లొంగదీస్తాననుకోకు నాకు తెలుసు, ఆమె గొప్పదనాన్ని గ్రహించగలను. ఇప్పుడు ఇంకా చూపించాలా? ఆమె గురించి? నాకు? నాకు నాకే తెలియకుండా ఆ యువతి సొగసునీ, నమ్రతనీ, సుగుణాలనీ ప్రశంసించలేదు! ఎన్నిసార్లు అనలేదు ఆమె హృదయాన్ని తనదిగా చెప్పుగలగడం…
-
ఒక ప్రస్థానం… రైనర్ మారియా రిల్కే, ఆస్ట్రియన్ కవి
నేను ప్రారంభించిన ఈ ప్రయాణంలో నా దారికి ఎదురుగా అనంతదూరంలో సూర్యకిరణాలుసోకిన కొండ చూస్తున్నాను. ఒకోసారి మనం అందుకోలేనిది మనల్ని అందుకుంటుంది; దానిలో ఒక అంతర్గత కాంతి ఉంటుంది…అంత దూరం నుండి కూడా, మనం అక్కడకి చేరుకోలేకపోయినా, మనల్ని ఉత్తేజపరచి మనం ఏమాత్రం గ్రహించలేకుండానే మనల్ని వేరే వ్యక్తులుగా మార్చెస్తుంది; మన చెయ్యూపుతూ చేసిన సంజ్ఞకి ప్రతిగా మరొక సంజ్ఞ మనల్ని ముందుకి పురికొల్పుతుంది… మనం తెలుసుకోగలిగింది మాత్రం ముఖాన్ని చిరుగాలి తాకుతూ పోవడం. . రైనర్…
-
దురదృష్టం… జేమ్స్ ఏండర్సన్, స్కాట్లండు
నిన్నరాత్రి ఒక మిత్రుడి శయ్య పక్కన కూర్చుని అలా పరికిస్తున్నాను బయటా లోపలా నిశ్శబ్దమే నెత్తిమీద గోడగడియారం చేసే చప్పుడు తప్ప నా ఆలోచనలు ముందుకీ ఊగిసలాడేయి అలా చాలా సమయం గడిచిపోయింది, “నా కంటే దురదృష్టవంతుడు ఉంటాడా?” అన్న సంశయం చివరకి నివృత్తి అయేదాకా. నా చెవులో ఒక మాట వినిపించింది… బాగా అలసి, నీరసించిన గొంతు అది… “నిస్సహాయులు” అని మూడుసార్లు అంది ఆ మాటలు నే వినడం తప్ప వద్దనగలిగేవి కావు. ఆ…
-
కవితతో స్వగతం… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
ఓ నా కవితా! ఫర్వాలేదు వెళ్ళు! భయపడకు, అంతటి అందం ముందు పురుషులు భయపడినట్టు; నిన్ను ఆమె తీక్షణంగా చూడదు, నీనుంచి దృష్టికూడా మరల్చదు. ఆమె జ్ఞాపకాల్లో నువ్వు పదిలంగా నిలిచేలా నేను కొన్ని సొగసులు నీకు అద్దుతాను, చిన్న చిన్న లోపాలుకూడా కలగలుపుతాను ఆమె నిన్ను సంతోషంగా క్షమించేసేలా… . వాల్టర్ సేవేజ్ లాండర్ (30 January 1775 – 17 September 1864) ఇంగ్లీషు కవి . Image Courtesy: Poetry Foundation http://www.poetryfoundation.org/bio/walter-savage-landor…
-
Nothing New… Nanda Kishore, Telugu, Indian
1 It is not possible for her. And, it is beyond me. There is no gain blaming each other. 2 Nobody would admit us. Secure are her people’s houses with doors and windows shut, Mine is an open sky where sun visits at will. 3 It is just the…
-
The Chemistry of Tears … Kopparthy, Telugu, Indian
Yes! Tears are nobler than blood. The saying that “Blood is thicker the water’ Maybe true But, is certainly not thicker than tears. When a needle pricks, or a blade cuts Blood oozes out; Blood spills out; For the swish of a knife It founts like an earthly spring; To witness blood One has…
-
A poem about a poem… Si. Ra. Telugu, Indian
. Let me tell you! These words are not so great. Even if you don’t read this poem, you aren’t at loss. It’s just a passel of words strewn carelessly…. and, An inchoate song taking shape By a chancy chancy alignment. You ask me for its meaning? Well, what meaning can you find behind…