వర్గం: అనువాదాలు
-
చివరి కవితలు… 12…. ఏ ఇ హౌజ్మన్, ఇంగ్లీషు కవి
దూరంగా పొద్దు కళ్ళు నులుపుకుంటోంది: సూర్యుడు ఉదయించేడు, నేనూ లేవాలి, కాలకృత్యాలు తీర్చుకుని, బట్టలేసుకుని, తిని, తాగి, ప్రపంచాన్ని పరిశీలించి, మాటాడి, ఆలోచించి, పనిచేసి… ఇవన్నీ ఎందుకుచేస్తున్నానో దేముడికెరుక. ఓహ్! ఎన్నిసార్లు స్నానంచేసి, బట్టలేసుకోలేదు! ఇంత శ్రమపడినందుకూ ఫలితం ఏమైనా ఉందా? హాయిగా పక్కమీద పడుకుని విశ్రాంతి తీసుకుంటాను: పది వేలసార్లు నా శక్తివంచనలేకుండా పనిచేశాను తిరిగి ప్రతీదీ మరోసారి చెయ్యడానికే. . ఏ ఇ హౌజ్మన్ 26 March 1859 – 30 April 1936…
-
When will you be back, Pa?… Dr. Pulipati Guruswamy, Telugu, Indian
బ్లాగు మిత్రులకీ, పాఠకులకీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాలలో కొత్తకాంతులు నింపుగాక! . “Where is your Pa? Where is your Pa, shorty?” They ask me everybody, Pa! The other day In pitch darkness Police caught Ma by her hair And abused her saying ‘You bitch, When will your man return?” Whenever my sib wails,…
-
నేనో అనామికని… మరి నీ సంగతి?… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
నేనో అనామికని… మరి నీ సంగతి? నువ్వు కూడా… అనామికవేనా, ఆ? అలాగయితే మనిద్దరం జంట, సరేనా ? ష్! ఎవరికీ చెప్పకు! చెబితే దండోరా వేస్తారు. తెలుసుగా! ఎంత రసహీనం: ఏదో ఒకటవడం ! ఎంత బట్టబయలు… ఒక కప్పలాగ… మన పేరు చెప్పుకోవడం… జీవితం సాగదియ్యడం… బాడవ నేలలు మెచ్చుకుంటూండడం! . ఎమిలీ డికిన్సన్ December 10, 1830 – May 15, 1886 అమెరికను కవయిత్రి. . . I’m Nobody!…
-
జాలి… హెరాల్డ్ వినాల్, అమెరికన్ కవి
ఒక అందమైన వసంతవేళ వీధుల్ని చల్లని తెమ్మెర సంగీతంతో ముంచెత్తినపుడు మనసుపారేసుకున్నానని జాలిపడవద్దు; ఒకప్పుడు జ్వాలగా రగిలిన నీ ప్రేమని తిరస్కరించేనని నా మీద జాలిపడవద్దు, ఇప్పటికీ తాపంతో తపించే పువ్వు తన హృదయాన్ని తొలకరి చినుకులకి ఆర్తితో ఎదురుచూసినట్టు వీచే ప్రతిగాలికీ తనహృదయాన్ని ఆరబెట్టినట్టు … నా దప్పితీరలేదు. జాలిపడదలుచుకుంటే, రాబోయే క్షణాలకు జాలిపడు సుదూరభవిష్యత్తులో, ఏదో ఒక రోజు మళ్ళీ నేను ఈ త్రోవనే మన ఇంటి ముంగిట నిలవబోయినపుడు గుమ్మం నన్ను నా…
-
మొర… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
అంతా మారిపోయింది… నేను పేదనైపోయాను; మొన్న మొన్నటి వరకూ, నీ ప్రేమ నా హృదయ కవాటం ముందు ప్రవహించడమే తన ధర్మంగా ఉండేది. నా అవసరం, దాని ఔదార్యం అన్న ఆలోచన లేకుండా అనంతంగా ప్రవహించింది. ఎన్ని మధుర క్షణాలు లెక్కపెట్టుకుంటూ గడిపేను! కైవల్యాన్ని మించిన ఆనందంలో మునకలేశాను నేను! గలగలా, తళతళా, నిత్య చైతన్యంతో ప్రవహించిన పవిత్రమైన ప్రేమకు బదులు, ఇప్పుడు, నా దగ్గర ఏముంది? ఏముందని ధైర్యంగా చెప్పను? పాడుబడి, అగాధమైన, అగోచరమైన దిగుడుబావి తప్ప! ఒక…
-
కానుకలు… జేమ్స్ థామ్సన్, స్కాటిష్ కవి
మనిషికి అతను స్వారీ చెయ్యగల గుర్రాన్నీ నడపగల ఓడనీ ఇవ్వు; అతని హోదా, సంపదా, శక్తీ, ఆరోగ్యం నేలమీదగాని, నీటిమీదగాని చెడవు. మనిషికి అతను తాగగలిగిన చుట్టా అతను చదవగలిగిన పుస్తకమూ ఇవ్వు; అతని ఇంట్లో ఏమీ లేకపోవచ్చు గాక, కానీ ప్రశాంతతతో కూడిన ఆనందం వెల్లివిరుస్తుంది. మనిషికి తను ప్రేమించగలిగిన స్త్రీని ఇవ్వు, ప్రియతమా, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు, అతని హృదయం అదృష్టంతో ఉరకలేస్తుంది ఇంట్లోనూ, నేలమీదా, నీటిమీదా. . జేమ్స్ థామ్సన్…
-
మిసెస్ థాచర్… స్యూ టౌన్ సెండ్, ఇంగ్లీషు రచయిత్రి
(ఇది చాలా ప్రతిభావంతమైన కవిత. ఏ అలంకారాలూ లేనట్టు కనిపించినా, పదునైన వ్యంగ్యం ఉంది ఇందులో.ఇంగ్లండు ప్రథానమంత్రి థాచర్ ప్రభుత్వం చేపట్టిన విధానాలకు 30 లక్షలమంది నిరుద్యోగులుగా మారినపుడు రాసిన కవిత ఇది. ఓట్లు దండుకుందికి, అందరూ మొసలి కన్నీళ్ళు కారుస్తారు. పాకలలో దూరుతారు. వాళ్ల మంచాలమీద కూర్చుని చెప్పలేని సానుభూతి ఒలక బోస్తారు. అదంతా అందలం ఎక్కడనికే తప్ప వాళ్ళ కన్నీళ్ళు తుడవడానికి కాదు. ఈ సత్యాన్ని చాలా నిశితంగా విమర్శించిన కవిత) మిసెస్ థాచర్, …
-
చివరకి… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి
కాలం కూడా ఎలాంటి దంటే, మన యవ్వనం, మన సుఖాలు, మన సర్వస్వం కుదువబెట్టుకుని, చివరకి మనకి మన్నూ, మశానంతో తీర్మానం చేస్తుంది; మనం జీవితాంతమూ ఎంత తిరిగినా ఆ నీరవ నిశ్శబ్ద చీకటి కుహరంలో మన జీవిత గాథని మరుగుచేస్తుంది; కానీ, నాకు నమ్మకం ఉంది: భగవంతుడు నన్ను ఈ నేల,ఈ సమాధి, ఈ మట్టిలోంచి లేపుతాడు. . సర్ వాల్టర్ రాలీ 1554 – 29 October 1618 ఇంగ్లీషు కవి . The Conclusion…
-
అందమైన గాయని … ఏండ్రూ మార్వెల్, ఇంగ్లీషు కవి
నా మీద ఆఖరి అస్త్రం ప్రయోగించడానికా అన్నట్టు ప్రేమ ఎటువంటి శతృవుని సృష్టించిందంటే ఆమెలో రెండు అందాలూ ఎంతో సొగసుగా కలగలసి నేను మరణమెదురైనా ఒప్పుకోక తప్పని స్థితి; ఆమె కళ్ళు నా హృదయాన్ని బందీని చేస్తే తన గాత్రం నా మనసుని వివశం చేస్తోంది. కేవలం అందంగా మాత్రమే ఉంటే దూరంగా పోగలిగేవాణ్ణి; దట్టమైన ఆమె ఉంగరాలజుట్టు బంధనాలు తెంచుకున్న ఆత్మను కాపాడుకోగలవాణ్ణేమో; కానీ, నేర్పుగా, కనిపించకుండా నాకు ప్రాణమందిస్తున్న వాయువుతోనే నన్ను బంధిస్తున్న ఆమె…
-
Isn’t Bod Synonymous With Being?… Kondepudi Nirmala, Telugu, Indian
. Well, this earth may not be ours But how can our body be not ours? The corpse consigned to flames May not dry get angry or dry your tears But how can the friendships twined for years disappear Or the lessons assiduously taught till yesterday? How can the rest of the story Page-marked after…