వర్గం: అనువాదాలు
-
నేను యుద్ధగీతిక ఆలపిస్తాను… హారీ కెంప్, అమెరికను కవి
(వంద సంవత్సరాల క్రిందట మొదటి ప్రపంచ సంగ్రామం నేపధ్యంలో Phoenix పత్రిక 1914 డిశెంబరు సంచిక 208 వ పేజీలో ప్రచురించబడ్డ కవిత. ) నేను ఎప్పుడు పడితే అప్పుడు మృత్యువులా కబళించి, త్రేంచే పెద్ద ఫిరంగులను కీర్తిస్తాను. అబ్బా! మధ్యలో ఈ ఏడ్చే తల్లులొకళ్ళు, చలనం లేకుండా పడున్న ఆకారాలూను. రెపరెపలాడూ ఎగిరే జండాల పాటలుపాడతాను, నా ముందు యుద్ధబాకాలూ, హాహాకారాలూను. అబ్బా! జీర్ణవస్త్రాలెగిరే ఈ అస్థిపంజరాలొకవంకా మరి ఎన్నడూ పలుకలేని పెదవులు మరోవంకానూ. ఒకదాన్నొకటి…
-
Packing Up… HRK, Telugu, Indian
I am sitting in some railway station Whichever way I look, there is Just this bench-long space to move about I don’t know who these people are What country and what language it is. I don’t like railway stations For, the rails lie there idly Stretching into the unknown both ways The signals suffer from…
-
The Moment I turn Into a Poem…Vadrevu Chinaveerabhadrudu, Telugu, Indian
Just like my brethren who turn westwards when it’s prayer time No matter what they do or where they move about the whole day, I turn skywards when it’s time for me to turn into a poem; It’s the moment when I dock myself with you people. All through the day umpteen notes, voices, some…
-
ఎలిస్ పార్క్ … హెలెన్ హోయెట్, అమెరికను కవయిత్రి
ఓ నా చిన్ని ఉద్యానమా! నేను నీలోంచి వెళ్ళిన ప్రతిసారీ నీ నుండి ఒక భాగాన్ని తీసుకుపోతుంటాను. ప్రతిరోజూ పట్టణంలో ఉద్యోగానికి నీపక్కనుండి తొదరతొందరగా వెళ్తు వెళ్తూ నగర మార్గాన్ని సమతూకం చెయ్యడానికి నిన్నక్కడికి తీసుకుపోతాను. నీ చెట్లనీ నీ చల్లగాలినీ నీ పచ్చదనాన్నీ నీ స్వచ్ఛతనీ, నీలోని కొంత నీడనీ, కొంత ఆకాశాన్నీ నిలోని కొంత ప్రశాంతతనీ నాతో తీసుకుపోతాను. దారుణంగా కనిపించే ఆ త్రోవల్ని శుభ్రపరచడానికి నీ పువ్వుల్నీ, ఇరుకుగా ఉండే వీధులకి కొంత…
-
Longing Eye… Aranya Krishna, Telugu, Indian
In some enduring aridity of life Even smiles dry up from the lips. Just a stub of stubborn existence remains Like a deciduous autumnal tree. And into the enveloping shadows Do the long accustomed feet blindly move Stomping the dead leaves and hopes. Nobody loves a withered tree Or a man wounded at heart. Perhaps everybody is…
-
మర్మము… రాల్ఫ్ హాడ్జ్ సన్, ఇంగ్లీషు కవి
దేముడు దిగి వచ్చి ఎర్రని గులాబిమొక్క చెంతకి నన్ను చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్ళేడు, అతని ఉద్దేశ్యము తెలుపకుండా నాకో గులాబిని మాత్రం అందించేడు. తన మనసులో ఏముందో చెప్పమని నేను దేముణ్ణి ప్రార్థించలేదు. అతని ముఖాన్ని చూస్తూ గడపడమూ, స్వర్గాన్ని తలపించే పూపరిమళమూ నాకు చాలు. . రాల్ఫ్ హాడ్జ్ సన్ 9 September 1871 – 3 November 1962 ఇంగ్లీషు కవి . Ralph Hodgson . The Mystery .…
-
వెన్నెల్లో… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
“ఓ ఒంటరి పనివాడా, ఊహలలో తేలుతున్నట్టు అక్కడ నిలబడి ఆమె సమాధివంక అలా ప్రక్కన మరో సమాధిలేనట్టు ఎందుకు తేరి చూస్తావు? శుష్కించిన నీ పెద్ద కన్నులు అంతగా ప్రాధేయపడితే శవంలా చల్లబడిన ఈ వెన్నెల వెలుగులో, ఆమె ఆత్మ బహుశా నిరాకారస్వరూపాన్ని ధరించి పైకి లేస్తుందేమో.” “ఓయ్ వెర్రిడా! ఇక్కడ మనుషులెవరికీ అక్కరలేకపోయినా నేను ఇపుడు చూద్దామనుకుంటున్నది సరిగ్గా అదే. కాని ఏం లాభం? నా కలాంటి అదృష్టం లేదు.” “అయితే, నిస్సందేహంగా ఆమె నీ…
-
బార్జిస్ లో ఉషోదయం… హెర్మన్ హేగ్ డోర్న్, అమెరికను కవి
స్వచ్ఛమైన గాలి, పచ్చని మైదానం, సెలయేటి పాట, గంగడోలుగంటల గణగణ… ఓ మనిషీ! మనం ఎంత మూర్ఖులమి జైలు గదుల్లో జీవితం గడపుతున్నాము! పచ్చని దృశ్యాలూ, విశాలమైన ఆకాశాలూ మనజీవితంలో భాగం కాకుండా ఉరకలేసే హృదయాన్ని అబద్ధాలతో కోసి చంపుతూ… మెరిసే శిఖరాలు, ఒక్కసారిగా ప్రశాంతమైన లోయలోకి వెలుగు వరద, పచ్చని చేలు నా మోకాళ్ళు తడుముతున్నాయి: మంచి దిగుబడి వస్తుంది అంతా బాగానే ఉంది! ఓ మనిషీ! మనం ఎంత మూర్ఖులమి జైలు గదుల్లో జీవితం…
-
Sonnet 2… షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం ఈ కవితలన్నీ ఒక అజ్ఞాత యువకుణ్ణి (Mr. W H) ఉద్దేశించి వ్రాసినవి (బహుశా పెళ్లి చేసుకుందికి నిరాకరిస్తున్న ఈ యువకుణ్ణి సున్నితంగా పరోక్షంగా మందలిస్తున్నట్టు కనిపిస్తుంది) నలభై వసంతాలు నీ ఒంటి పైబడి, నీ సౌందర్యక్షేత్రంలో లోతుగా నెరియలు తీసినపుడు, నీ గరువపు పరువాల ఉడుపులు పరీక్షించినపుడు అవి పీలికలై, పనికిమాలి విలువలేనిగా కనిపిస్తాయి; ఇపుడు ఎవరైనా “నీ సౌందర్యమంతా ఏమయింది?”అనో, “నీ జవ్వనపు సిరులేమయినా?”యనో…
-
తారానివహపు మాయ… రిచర్డ్ బట్లర్ గ్లేంజర్, అమెరికను
నేనూహంచలేని ఏ దివ్యకుసుమాన్ని మించి ఈ రోజు మీ సౌందర్యం ఉన్నా ఈ రాత్రి మీరు నా మనసు దోచలేరు ఎందుకంటే నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. విరబూచిన గన్నేరులా గాలి అలలలో తేలిపోతూ… ప్రతి పువ్వునీ చెంతనున్న మరోపువ్వు అధిగమిస్తూ… భగ్గున వెలిగిన మంటలా, ఆకుపచ్చని చారల రత్నంలా; నక్షత్రాల తళతళలతో ఆకాశం అద్భుతమైన స్ఫటికంలా అక్కడక్కడ నీలి పొడిజల్లినట్టు ఉంది. ఈ ఒక్క రాత్రికి నా మనసు గండుతుమ్మెద అయిపోయింది నక్షత్ర నివహాన్ని విరినికుంజముగా ఊహించుకుంటూ ……