వర్గం: కవితలు
-
The Ultimate Survivor … Vinnakota Ravi Sankar, Indian Poet
. Gradually Life becomes a reconciliation to death. Instead of pigeons, now Lapwings carry messages. The smiling faces of the childhood group-photo leave one by one searching for their own. Not only the actors, even the audience recede one after another. There will be nobody left on either side, to share tears for the tragedy…
-
Android … Kiran Gali
. I need some pain. a pain that can squeeze my heart dry Honestly! There is no catch here, nor an ounce of exaggeration. . For, somehow, I became immune and turned mechanical and exiled myself from me. There are no longer any sleepless nights, haunting memories, or, burning passions. Nor have I the faith…
-
Pablo Neruda
. మిధ్యగా కనిపిస్తున్న ఈ బహుళంలో, అన్ని ఆకులూ … ఈ ఆకే అన్ని రేకులూ… ఈ పువ్వే. అన్ని పళ్ళూ ఒక పండే అన్ని చెట్లూ ఒక చెట్టే ఒక్క పువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించగలదు. పావ్లో నెరూడా (పైకి ఎంతో సరళంగా కనిపిస్తున్న ఈ కవితలో, గొప్ప తాత్త్విక సత్యం ఉంది. నిజానికి అన్ని రూపాలలో కనిపిస్తున్న పువ్వైనా, ఆకైనా, అవి ఒక్కటే. ఆ ఒక్కటీ మిగతావాటికన్నిటికీ ప్రాతినిధ్యం…
-
నాన్నంటే… అజ్ఞాత కవి.
. భగవంతుడు మహా పర్వతాల పటుత్వాన్నీ మహా వృక్షాల ఔన్నత్యాన్నీ వేసవి సూర్యుడి వేడిమినీ మహాసముద్రాల ప్రశాంతతనీ విశ్వాత్మ ఔదార్యశీలతనీ నిర్భీతిగా నిదురపుచ్చే రేయి నెమ్మి హస్తాన్నీ గతకాలాల విజ్ఞతనీ గరుడుడి వియద్విహార శక్తినీ వాసంత ప్రభాతపు ఆనంద హేలనీ ఆవగింజ మొక్కవోని ఆత్మస్థైర్యాన్ని అనంతమైన సహనాన్నీ సంసారమంత గంభీరమైన అవసరాల్నీ ఎంచెంచి ఏర్చి ఈ లక్షణాలన్నీ కలగలిపి ఇంకేమీ అవసరంలేకపోవడంతో తను ఊహించిన అత్యుత్తమ ఆకృతి అతనికి పూర్తయిందని దానికి తండ్రి అని నామకరణం చేశాడు.…
-
మనసే నా సామ్రాజ్యం …ఎడ్వర్డ్ డైయర్, ఇంగ్లీషు కవి
. మనసే నా సామ్రాజ్యం. అక్కడ నాకు ఎంత మహదానందం దొరుకుతుందంటే… దాతలు కనికరించడం వల్లనో, లేక స్వతస్సిద్ధంగానో సృష్టిలో లభించే ఆనందాలన్నీ దాని ముందు దిగదుడుపే. అందరూ కోరుకునేవే నేను కోరుకున్నప్పటికీ నా మనసు అలాంటివి అడక్కూడదని నిషేధిస్తుంది. రాజుల ఆడంబరాలూ, అంతులేని సంపదలూ… యుద్ధంలో జయించడానికి సైన్యాలూ… నా బాధలు ఉపశమించడానికి కపటోపాయాలూ… కళ్ళ తనివి తీరడానికి అందమైన ఆకృతులూ… వీటి వేటికీ నే బానిసని కాలేను. కావలసినవన్నీ నామనసు నాకిస్తుంటే, ఎందుకవి? బాగా…
-
నిరాశతో ముఖాముఖీ… థామస్ హార్డీ,ఆంగ్ల కవి
. చీకటిపడేవేళకి నన్ను నేను చూసుకునేసరికి నిస్సారమైన ఊషరక్షేత్రంలో ఉన్నాను. నల్లని ఆ చిత్తడినేల ఏ రూపురేఖలులేకుండా రూపుగట్టిన విషాదంలా కనిపించింది. “ఇదికూడా నా జీవితంలానే ఉంది, చీకటి పుట్టలా.” అనుకున్నాను నేను. “దురదృష్టం వెన్నాడి చవుడు పడిపోయింది…. ఎటుచూసినా వెలుగురేక కనబడదు” తలెత్తి ఒకసారి ఆకాశం లోకి చూసేసరికి, అక్కడి వర్ణవ్యంజనము నన్నాకట్టుకుంది. మెరుగంచుల కారుమబ్బులు చూసేక అనిపించింది: చూడాలేగాని, బహుశా సాంత్వన అన్నిచోట్లా దొరుకుతుందని.” ఒక వక్ర బుద్ధి, నిర్దాక్షిణ్యంగా మంచిని చెడుగ వ్యాఖ్యానించినపుడు కలిగే…
-
అనగా అనగా ఒకప్పుడు … గాబ్రియేల్ ఒకారా, నైజీరియన్ కవి
(నా ఈ 400వ టపా సందర్భంగా సాహితీ మిత్రులకీ, నా బ్లాగు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అపూర్వమైన కవిత అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 1975 ప్రాంతాల్లో The Hindu లో ఒక సారి చదివాను. అప్పటినుండీ ఇది నా మనసులో నాటుకు పోయింది. అప్పట్లో అంత సాహిత్యవ్యాసంగం లేకపోవడంవల్ల కవి పేరూ గుర్తు పెట్టుకోలేదు, కవితా గుర్తులేదు. ఆఫ్రికన్ కవి అని తెలుసు. అందులో “సందర్భానికి తగ్గ ముఖాలు” అన్న విషయం లీలా మాత్రంగా…
-
వంశప్రతిష్టలూ- అధికారముద్రలూ… జేమ్స్ షర్లీ, ఇంగ్లీషు నాటక కర్త.
మన వంశప్రతిష్టలూ, అధికారముద్రలూ ఎంతగొప్పవైనా అవికేవలం ఛాయామాత్రమే, అల్పమైనవే. విధినితప్పించుకోగల కవచం ఏదీ లేదు. మృత్యువు తన శీతలహస్తాన్ని మహరాజులమీదనైనా వెయ్యగలదు. రాజదండాలూ, అపురూపమైన కిరీటాలూ నేలకు ఒరిగిపోవలసిందే. పలుగు పారలతో మట్టిలోకప్పబడి అన్నిటితో సరిసమానంగా దొర్లవలసిందే . కొంతమంది శౌర్యవంతులు కదనరంగంలో శతృసంహారంచేసి కొత్తచరిత్ర లిఖించవచ్చు. అయినా, వాళ్ళ భుజబలాలు లొంగవలసిందే. కొంతకాలం ఎదిరించవచ్చేమోగాని ముందో వెనకో విధికి దాసోహమనక తప్పదు. రక్తహీనులై, మృత్యువుకి తలవంచినపుడు, వాళ్ల ఊపిరి కూడా సమర్పించవలసిందే. . నీ నుదిటిమీది…
-
డడింగ్స్టన్ … రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
కాకుల కా, కా, లతో పక్షుల కిలకిలలతో ఈ చిట్టడవి సన్నటి ఈ నీరెండలో ఆహ్లాదంగా ఉంది. దూరాన చర్చిలోనుండి ప్రార్థన తేలివస్తోంది కాని వాళ్ళు చిత్తమొచ్చినరీతిలో అది పాడుతున్నారు మేఘాలసందులలోనుండి జాలువారుతున్న బంగారు కిరణాలు సరసుమీది నునుతరగలపై తళతళలాడుతున్నాయి ఈ శిలలు కూడా ఒకదానికొకటి తమసామీప్యతకు సంతసిస్తున్నట్టు కనిపిస్తున్నాయి మరొకసారి నా మనసు ఉప్పొంగి ఉరకలేస్తూ ఆనందంతో పరవశిస్తోంది వెలుగునీడలు చేతి వేళ్లలా నా స్వరతంత్రులను మీటుతున్నాయి ప్రియతమా! నా ఊహగతాన్ని చిత్రిస్తోంది… క్రిందటిసారి నువ్వు…
-
ష్రాప్ షైర్ పచ్చని కొండలమీద రైల్లో …ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్
ష్రాప్ షైర్ పచ్చని కొండలలోనుండి రైలు పరిగెడుతోంది, ఆకాశపుటంచుల్నీ, ఊరు రూపురేఖలనీ మారుస్తూ; దూరంగా ఒక కొండశిఖరం కనుమరుగై, వెనక్కి మరలి పోయింది; ఎత్తుగా పొడుచుకొచ్చిన “క్లీ” కొండ కొన పశ్చిమదిక్కున నిర్మానుష్యమైనలోయలో కలిసిపోయింది నా చెయ్యి ఖాళీగా నా ముణుకుమీద ఉంది. నొప్పితో ఆ చెయ్యి ముణుకుమీద అలా ఉంది. ఆరోజు ఉదయం, ఊరు సగందాటేలోపు ఎన్ని నిజాయితీపరుల చేతులు దాన్ని తాకేయంటే అది మణికట్టునుండి ఊడిపోతుందేమోననిపించింది. నేనన్నాను: ఓ నా హస్తమా! మనం మనకు…