వర్గం: కవితలు
-
ప్రేమ… విస్టెన్ హ్యూ ఆడెన్, అమెరికను కవి
తలెత్తి నింగిలోని చుక్కలని చూసినపుడు, పాపం, అవి అంతగా పట్టించుకుంటున్నా, చివరకి నేనెందుకూ పనికిరాకుండా పోవచ్చు. అదే నేలమీదైతే, మనిషైనా, మృగమైనా అవి మనఊసెత్తకపోతే,అసలు వెరవనక్కరలేదు. . పాపం తారలు మనమీద ప్రేమతో రగిలిపోతుంటే మనం తగినరీతిలో స్పందిచకపోతే ఎలా ఉంటుంది? ఎవరూ సమానంగా ప్రేమించలేరనుకున్నప్పుడు, ఇద్దరిలో ఎక్కువ ప్రేమించేది నేననవుతా. . మనం వాటిని గుర్తించేమో లేదో ఖాతరుచెయ్యని నక్షత్రాలంటే ఇష్టమయిన నాకు, అవి ఇప్పుడు కనిపిస్తున్నా, పగలల్లా వాటిని చూడలేకపోయానన్న చింత లేదు. .…
-
గంధర్వ బాలిక… మార్గరెట్ మాహీ, న్యూజిలాండు కవయిత్రి
. నేను పుట్టిన ఉత్తరక్షణంలోనే, ఖడ్గమృగమ్మీద స్వారీ చేశాను. మగపిల్లలు కప్పపిల్లల్ని వాళ్ల పాత్రల్లోకి ఏరుకుంటుంటే, నేను నా డబ్బాని నక్షత్రాలతో నింపేను. నేను సూర్యుణ్ణి చూడ్డానికి కూనిరాగం తీస్తున్నానని మిగతా పిల్లలు నన్ను వేలెత్తి చూపిస్తూ పారిపోతారు. నేను పక్షులని పంజరాల్లోంచి విడిచిపెడతానని ప్రజలు నన్ను చూస్తే తలుపేసుకుంటారు. ఓ మగవాళ్ళ లోకమా! నీ కిదే పదేపదే నా వీడ్కోలు మళ్ళీ ఇక్కడికి మరోసారి రమ్మన్నా రాను . మార్గరెట్ మాహీ న్యూజిలాండు కవయిత్రి .…
-
నన్నెంతగా ప్రేమిస్తున్నావు? … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి
నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావు ఇవాళ? ఒక మిలియను బుషెల్స్ ఉంటుందా? అంతకంటే ఎక్కువా? నిజంగా, అంతకంటే చాలా ఎక్కువ? . బహుశా, రేపు బుషెల్ లో సగం అయిపోతుందేమో? లేక, బుషెల్ లో సగం కంటే కూడ తక్కువో. . ఇదేనా ప్రేమంటే నీ హృదయగణితం? అచ్చం ఇలాగే, గాలికూడ, వాతావరణాన్ని కొలుస్తుంటుంది. . కార్ల్ సాండ్ బర్గ్ (January 6, 1878 – July 22, 1967) అమెరికను కవి (గాలికి ఎంత…
-
ఎక్కడో ఒక చోట… క్రిస్టినా రోజెటి, ఆంగ్ల కవయిత్రి
ఎక్కడో ఒక చోట, నేను ఇప్పటివరకూ చూడని వదనమూ, వినని స్వరమూ, నా మాటకి ఇంకా స్పందించ వలసిన హృదయమూ నా అదృష్టం ఎలా ఉందో — తప్పకుండా ఉంటాయి . ఎక్కడో ఒకచోట, దగ్గరో దూరమో ఖండాలూ, సముద్రాలూ దాటి, కంటికి కనిపించనంతదూరంలో, చంద్రుణ్ణి దాటి, తనని ప్రతి రాత్రీ గమనించే నక్షత్రానికావల… . ఎక్కడో ఒక చోట, దూరమో దగ్గరో, కేవలం ఒక గోడ, ఒక కంచె, మధ్యలో అడ్డుగా; పచ్చగా పెరిగిన పచ్చికమీద…
-
అది మారదు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఇన్నిసంవత్సరాలు గడిచేక అది ఇంకేం మారుతుంది? మారదు. వియోగమూ, కన్నీళ్ళూ కూడా జీవితాన్ని విఛ్ఛిన్నం చెయ్యలేకపోయాయి. , మృత్యువు దాన్ని ఇక మార్చలేదు. నేను మరణించిన తర్వాత నీకోసం రచించిన నా గీతాలన్నిటిలో అది చిరస్థాయిగా మిగిలిపోతుంది. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . It Will Not Change . It will not change now After so many years; Life…
-
Immortality … SivaSagar, Indian Poet
Before it ceased the seed reassured a harvest; Before it dropped off the youthful flower promised of a definite produce with a smile; The reeking forest fire avowed raging towering infernos; And the dusk, holding hands while receding assured a promising dawn tomorrow… . Immortality is a bliss… Taking Time into its warm embrace It pledged…
-
ప్రేమికులు … Rumi, Iranian Sufi Poet
(ఇస్లాంలోని సూఫితత్త్వం ప్రధానంగా ఆలోచన (దైవం వినా అన్ని ఆలోచనలనీ పరిహరించడం),ఆచరణా (విషయ వాంఛలన్నీ వదులుకుని పూర్తి నిరాడంబరమైన జీవితం గడపడం) బోధిస్తుంది. సూఫీ తత్త్వవేత్తల జీవనశైలీ, ఆలోచనా విధానమూ, మానవతా దృక్పధమూ కొన్నివందలసంవత్సరాలు మిగతా మతాలని కూడ ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు. ఈ కవితలో, వివరిస్తున్న సురాపానము, నిజమైన సురాపానము కాదు. అది దైవ ధ్యానం లేదా భగవన్నామస్మరణకి ప్రతీక. హేతువాదం నమ్మకానికి పెద్ద అడ్డంకి. కనుక భక్తితో, మనోవాక్కాయ కర్మలా ధ్యానం చేసినపుడు…
-
సరోవరం జ్ఞాపకంలో … ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి
యౌవనం తొలినాళ్ళలో ఈ విశాలవిశ్వంలో అన్నిటికంటే ఇష్టమైన ప్రశాంతంగా ఉండే జాగా కోసం వెతుక్కోవడం నాకో అలవాటుగా ఉండేది. . చుట్టూ నల్లని రాళ్లతో, అంబరాన్ని తాకే పైన్(pine) చెట్లతో ఈ ప్రకృతిసిధ్ధమైన సరోవరపు ఏకాంతం ఎంత హాయిగా ఉండేదో చెప్పలేను. . కాని, చీకటిపడిన తర్వాత నిశాసుందరి మనఅందరిమీద కప్పినట్టే ఈ ప్రదేశం మీద కూడా తన నల్లని ముసుగుకప్పిన తర్వాత మార్మికపు పిల్లతెమ్మెర ఏవో రహస్యాలాలపిస్తూ పక్కనుండి పరిగెత్తుతున్నప్పుడు చూడాలి, అబ్బ! ఈ సరోవరపు…
-
Food-pot … Anisetti Rajita, Indian Poetess
A mother rests reassured when there is a food-pot in any home. If there is mother moving around in the house it amounts to having a food-pot at home. *** That mother may have farm and fields; May even have a government job; She shall not have a husband that would toil and feed her……
-
An Erasion … Afsar
. The shore Is a nest built by the sea Diligently collecting each grain of sand. . And the day inevitably dawns sometime When You have to erase Not only your shore… But even your sea . You can’t help it. . Afsar . వొక కొట్టివేత 1 తీరం సముద్రం కట్టుకునే గూడు ఇసక రేణువులన్నీ ఏరీ ఏరుకుని.…