వర్గం: కవితలు
-
ఇక్కడ చచ్చి పడున్నాం… ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఆంగ్ల కవి
మేం ఇక్కడ చచ్చి పడున్నాం ఎందుకంటే, మేం బ్రతికి జన్మించిన ఈ గడ్డకి అగౌరవం తీసుకురాదలుచుకో లేదు. . జీవితం… నిజానికి అందులో పోగొట్టుకున్న దేదీ లేదు. కాని యువకులు అలా భావిస్తారు, మరి మేం అందరం యువకులమే. . ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్ 26 March 1859 – 30 April 1936 ఆంగ్ల కవి ఈ కవితలో గొప్ప తాత్త్విక చింతన ఉంది. జీవితం అపురూపమైనదీ, విలువైనదీ అని వృద్ధులు నమ్ముతారు. అసలు చాలా…
-
Poet Immortal…… Ismail, Telugu, Indian
Poet Immortal… . Taking a stroll for a while On the shores of Time, He returned Throwing a pebble afar. The puppy of world Came wagging its tail And looked at the pebble left And tried to take a bite. Never did it see Such a piece of brawn before. The stone the poet had…
-
బుర్ఖా … అఫియా నూర్, మలయాళం, ఇండియా
. నేను మాటాడలేను, ఎందుకంటే, ఈ బలమైన దారాల అల్లిక నా పెదాలు దగ్గరగా గట్టిగా కుట్టేసింది. వినడానికి నాకు చెవులు గాని శ్వాశించడానికి ముక్కురంధ్రాలుగాని లేవు; ఈ నల్లదారాల జాలీ వెనక నా చూపుకూడా నిరోధింపబడుతుంది. నామీద దాడిచేసే వాడు ఎదురుగా ఉన్నా వాడిని గుర్తుపట్టకుండా ఉండడానికి ఏదో ఏర్పాటు చేసినట్టు, చుట్టూ అంతా చీకటి… శరీరం పాపపంకిలమని నిరసించినపుడే నా అస్తిత్వ చైతన్యం మీద మొట్టమొదటిసారి, నల్లగా ఇది తొడగబడింది. …
-
ఏదైనా సాధ్యమే అని నమ్మేవాళ్ళకి… లారీ ఎస్ చెంగెజ్, అమెరికను
తమ శక్తియుక్తులపై నమ్మకం లేనివాళ్లకి ఏ అద్భుతాలూ జరుగవు… నువ్వు ఏది నమ్మినప్పటికీ; నువ్వు ఏం చేసినప్పటికీ; నువ్వు నీ జీవితంలో ఏది సాధించినప్పటికీ, నీ మార్గాన్ని మరలించుకుని ఏదైనా కొత్తగా పునఃప్రారంభించడానికి ఎప్పుడూ సమయం మించిపోదు… ఒక సరికొత్త ప్రారంభం, ఉజ్జ్వలమైన భవిష్యత్తు, అన్ని అంచనాలనూ అధిగమించిన అద్భుతమైన ప్రశాంతతా… ఇప్పటికీ, ఇక ఎప్పటికీ అక్కున జేర్చుకునే అవకాశం ప్రయత్నించాలిగాని… నీదే! . లారీ ఎస్ చెంగెజ్ . For Those Who Believe All…
-
కరుణ … నే ఓ మీ షిహాబ్ నై … పాలస్తీనియన్ అమెరికన్ కవయిత్రి
నీకు నిజంగా కరుణ అంటే ఏమిటో తెలియాలంటే ముందు నీకున్న సమస్తవస్తువుల్నీ కోల్పోవాలి; వారాంతంలో తయారు చేసుకునే వంటకంలో ఉప్పు కరిగినట్టు భవిష్యత్తు ఒక్క క్షణంలో కరిగిపోవడం అనుభూతమవాలి; ప్రస్తుతం నీ స్వాధీనంలో ఉన్నదీ, విలువైనదని తలచి జాగ్రత్తగా కూర్చుకున్నదీ అవన్నీ పోగొట్టుకోవాలి రెండు కరుణార్ద్ర సంఘటనలమధ్య నిరామయ జీవనదృశ్యం అర్థం అవడానికి… నువ్వు ఎక్కిన బస్సు ఆగకుండా అలా వెళుతూనే ఉంటుందని అనుకుంటావు ప్రయాణీకులు దొరికిన చిరుతిళ్ళు తింటూ కిటికీలోంచి ప్రకృతిని గమనిస్తుంటారు. సున్నితమైన కారుణ్య ప్రభావం అర్థం…
-
Memories… Prasuna, Telugu, Indian
At least When the sepia photos on the wall mock at us We should suck into the past like whirlwind Rather than coolly bypassing it like a river. Like a streak of light That squarely questions each oversleeping bud, Memories scout for and catch at The inmost roots of our existence Which we ourselves…
-
వీడ్కోలు… ఎజ్రా పౌండ్, నిర్వాసిత అమెరికను కవి
ప్రహారీకి ఉత్తరాన అవిగో నీలి నీలి గిరులు, వాటికి ప్రదక్షణం చేస్తూ పరుగులుతీస్తున్న స్వచ్ఛమైన నది; ఇక్కడ మనం ఆగి ఎవరిత్రోవన వారు పోవలసిందే వేల మైళ్లుపరుచుకున్న నిర్జీవమైన పచ్చికలో నడుచుకుంటూ. మనసొక నిలకడలేక తిరిగాడే వెర్రి మేఘం, వీడ్కోలుముందు కలిపిన చేతులపై తలవాల్చి శలవుతీసుకుంటున్న పాతమిత్రుల్లా సూర్యాస్తమయం; మనిద్దరం ఒకరికొకరు దూరమవుతుంటే మన గుర్రాలుకూడా సకిలిస్తూ… ఒకదానికొకటి… . ఎజ్రా పౌండ్, నిర్వాసిత అమెరికను కవి (30 October 1885 – 1 November…
-
పిల్లలు…. HW లాంగ్ ఫెలో, అమెరికను కవి
ఇదిగో పిల్లలూ! నా దగ్గరకి ఇలా రండి, మీరు ఆడుకుంటున్నారని నాకు తెలుస్తోంది, నన్నెప్పటినుండో వేధిస్తున్న సమస్యలు అన్నీ వాటంతట అవే మాయమయిపోయాయి. మీరు సూర్యుడి దిక్కు చూస్తున్న తూరుపు కిటికీలు తెరిచేరు ఆలోచనలు పిచ్చుకలై కిచకిచమంటున్నై వెలుగు వాగులై ప్రవహిస్తోంది. మీ మనసులే పిట్టలూ, వెలుతురూ మీ ఆలోచనలలో పిల్లవాగులు పరుగిడతై; నా మనసులో మాత్రం ఆకులురాల్చే వడిగాలి తొలి హిమపాతం చూసిన హేమంతం. అమ్మో! అసలు ఈ పిల్లలే గనకలేకుంటే…
-
అందమైన అబద్ధం… షెనా ప్యూ, ఇంగ్లండు
ఇది చాలాకాలం క్రిందటి మాట, బహుశా అప్పుడు వాడికి నాలుగేళ్ళుంటాయేమో… పెరట్లో, బటాణీ పాదుల మాటున ఏదో పెంకితనం… సరిగ్గా గుర్తులేదుగాని, ఒక కొమ్మ విరిచెయ్యడమో, పాదుకి ఆసరాగాపెట్టిన కర్రలాగేడమో ఏదో చేశాడు… వాళ్ళ అమ్మమ్మ వచ్చి చూసి, ఇలా అడిగింది: “ఏరా, నువ్వేనా ఈ పాడుపని చేసింది?” ఆమె వాణ్ణి “నువ్వెందుకిలా చేశావ్?” అని అడిగి ఉండి ఉంటే, కాదనేవాడు కాదేమో. కాని ఆమె వాడికిప్పుడు తప్పుకునే సందు చూపించింది; వాడి కళ్ళలో వేరే…
-
Darkness and Silence … Usharani, Telugu, Indian
As if you are imprisoned Did walls grow around you? Well, does it matter, when you aren’t alone And your steps still see no light? Darkness is the only comrade, Silence shivers at the slightest tremor A drama goes behind the un-raised curtain, And all the characters play the same tune. From the…