“Darkness and Silence … Usharani, Telugu, Indian” కి 2 స్పందనలు
మరువం ఉష
ధన్యవాదాలు మూర్తి గారు . మూడేళ్ళ నాడు వేటూరి గారి నిర్యాణం మిగిల్చిన నిశ్శబ్దం కాక కన్నీరొచ్చేంత, గుక్క పట్టి ఏడ్చేంత బాధ అయినా బాగుండేది కదా అనిపించిన క్షణాన, మృత్యువు తేలుస్తుంది మన దైనందిన జీవితంలో ఏ ప్రాధాన్యతల విలువ ఎంతో – అంతకన్నా గొప్ప గీటురాయి లేదు – అనేసుకుని, ఆ కుమిలిపాటు ని, మనసులో అంతకు మునుపే తిష్ట వేసుకునున్న నిర్వేదం బద్దలు కావటానికి ఉద్దీపన గా, ఇలా అక్షరాల ఆసరా తో వెలికితెచ్చాను.
మీ అనువాదాల్లో తావు చేసుకోవటం నా/రచన/ అస్తిత్వానికి ఇంకాస్త పొడిగింపు దక్కటమే!
నా అనువాదాల్లో మీ అస్తిత్వం కాదు,భావగంభీరత గలిగిన మీలాంటి వాళ్ల కవితల అనువాదం ద్వారా నా అస్తిత్వం అనడం సబబు. ఇంతకుముందు మీకు చెప్పినట్టు మీ కవితని చాల సార్లు మీ బ్లాగులో చదివేను. ఇంతకుముందు కలిగిన అనుభూతికీ, మొన్న మళ్ళీ చదివినప్పుడుకలిగిన అనుభూతికీ చాలా తేడా ఉంది. అలాగని నేను నిరాశలోనో దుఃఖంలోనో లేను అప్పుడూ ఇప్పుడూ. కానీ ఈ సారి మీ వేవ్ లెంగ్త్ దొరికిందేమోనన్న చిన్న చాపల్యంతో కూడిన సంతోషం. మాటలు అవే. కానీ ఎందుకీ తేడా? బహుశా కవిత్వంలో కూడా అద్వైతం ఉందేమో. కవినీ కవిత్వాన్నీ వేరుగా చూడకుండా పాఠకుడు కూడా కవిత్వంతో మమేకమవగలిగిన ప్రశాంత చిత్తంతో కవితను చదవాలేమో.
ఏమయినా, ఈ కవిత నాకు మంచి రసానందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
స్పందించండి