వర్గం: కవితలు
-
స్త్రీల యాతన… మేరీ కోలియర్, ఇంగ్లీషు కవయిత్రి

Stephen Duck “Threshers’ Labour అని 1730లో ఒక కవిత రాసేడు. అందులో అతను గ్రామీణ స్త్రీలు ఎలా పనిలేకుండా కూచుంటారో చెబుతూ, పని తాలూకు ఔన్నత్యాన్ని ప్రబోధిస్తూ రాసేడు. ఈ రకమైన బోధనాత్మకమైన ప్రక్రియకి Georgic అని పేరు. ఈ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా Hesiod (750 BC) తన Works and Days అన్నకవిత వ్రాసేడు. దానిని అతని తర్వాత Virgil ప్రచారంలోకి తీసుకువచ్చేడు. ప్రకృతివర్ణనలు ఉండడం వలన పైకి ఈ కవితలు గ్రామీణ చిత్రాల్లా…
-
బిడ్డ పుట్టినపుడు … లూయీ అంటర్ మేయర్, అమెరికనుకవి
ఓ పిల్లవాడా! గెలుపు కేకలు వేసుకుంటూ, జీవన రణరంగంలోకి నీ పాదాలను మోపావు ఏ తగవులూ లేనిచోటునుండి… పోరాటస్థలికి ఏ సంశయాలూ లేనిచోటునుండి …సందేహాలలోకి. యవ్వనమనే పేలవమైన కవచాన్ని తొడుక్కుని కుర్రవాడా! లెక్కలేనన్ని యుద్ధాలలో పాల్గొనాలి, ప్రేమబావుటా ఎగరేసి లోకాల్ని గెలవాలంటే, నిరసనగళమనే కరవాలమూ, సత్యమనే డాలూ తోడుండాలి. లోకంలోని నిరాశానిస్పృహలు నీచుట్టూ ఎగసిపడుతుంటాయి; అపజయాలకి నువ్వు లోనై, దారికోసం తడుముకుంటావు. నీ ఆవేశం, అవలక్షణమని నిను నిందించేస్థాయిలో ఉండాలి నిరాశాజనకమైన భవిష్యత్తుకి, నువ్వు ఆశల ఊపిరులూదాలి.…
-
ప్రియతమా! నువ్వు ఆశ్చర్యపోకు… ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నా పెదాలు మౌనంగా ఉన్నాయని నువ్వు ఆశ్చర్యపోకు, ఏ కొత్తభాష నేర్చుకోవాలన్నా కొంత సమయం పడుతుంది. తొలిసారి ఈ వేళ్ళు ప్రేమవీణియ మీటినపుడు నా గళమూ, నా మనసూ ఒక శృతిలో లేవు. పాడిన పాటలన్నీ ఎప్పుడూ ఆనంద రుతాలే. గులాబి దండల సంతోష హేలల రూపంలో ప్రేమ; సంగీతంలా,గాఢానురక్తిని అతి సరళమైన స్వరాల్లో నినదిస్తూ పలికించలేని అశక్తులవి. ఇంతవరకు మౌనంగా ఉన్న నా పెదాలు ధైర్యంగా పలకగల కొత్త నుడికారాన్ని వెతుకుతున్నాయి నీనుండి పొందిన…
-
వనాంతర ప్రశాంతత… వెండెల్ బెరీ, అమెరికను కవి
ప్రపంచం పట్ల నాలో నిరాశ పేరుకున్నప్పుడూ, నా, నా బిడ్డల భవిష్యత్తును గూర్చి చింతతో చిరుసవ్వడికే రాత్రివేళ మెలకువ వచ్చినప్పుడూ, తన జాతసౌందర్యంతో నీటిమీద తేలియాడే మగబాతునీ, ఉదరపోషణ చేసుకునే కొంగనీ వీక్షించడానికి సరస్సు దగ్గరకిపోయి విశ్రమిస్తాను. రాబోయే బాధని ముందుగా ఊహించుకుని తమజీవితాలు శోకమయం చేసుకోని వన్యజీవుల ప్రశాంతత నన్నావహిస్తుంది. నిశ్చలమైన నీటి సన్నిధిలో నిలబడతాను. నా శిరసుపై దివాంధాలైన నక్షత్రాలు తమ ప్రకాశంతో నాకై నిరీక్షించడాన్ని గుర్తిస్తాను. కాసేపు, ప్రకృతి అవ్యాజప్రేమలో తరిస్తాను… స్వేఛ్ఛాజీవినై.…
-
నాకూ వివేకం ఉంది… మారియో ఆంద్రాదే, బ్రెజీలియన్ కవి
నేను నా రోజులు లెక్కెట్టుకున్నాను. నేను ఇప్పటివరకు బ్రతికినదానికంటే ఇక బ్రతకడానికి ఎక్కువరోజులు లేవని గ్రహించాను. ఎక్కువ మిఠాయిలు దొరికిన పిల్లాడిలా ఉంది నా పరిస్థితి మొదట్లో సంతోషంతో ఆబగా తినేస్తాడు కానీ, ఇక అట్టే లేవని గ్రహించిన తర్వాత ప్రతి మిఠాయినీ తీవ్రంగా అనుభూతిచెందుతూ తింటాడు. ఇక అంతూపొంతులేని సమావేశాలకి నాకు తీరికలేదు అక్కడ ఏదీ జరగదని తెలిసినా చట్టాలూ, నిబంధనలూ, విధివిధానాలూ అంతర్గత నియంత్రణలూ మొదలైనవి చర్చిస్తూనే ఉంటారు. ఇక నాకు అసంగతంగా…
-
రాబర్ట్ బ్లూమ్ ఫీల్డ్ స్మృతిలో… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి

Robert Bloomfield (3 December 1766 – 19 August 1823) Was a self-educated English working-class poet, admired by Stephen Duck, Mary Collier and John Clare. Image Courtesy: http://etc.usf.edu/clipart/32000/32088/bloomfield_32088.htm నిరాడంబరంగా కమ్మని గీతాలాలపించుకునే గాయకమణీ ఈనాటి మిరిమిట్లుగొలిపే ఆడంబరాలు నీకు నచ్చవు. సహజమైన ప్రకృతిదృశ్యాలూ, పొలాలూ, మేఘమాలికలూ తరులూ, శ్రమజీవులైన తేనెటీగలూ లలితలలితమైన తమరాగాలతో నీపాటకి సంగీతాన్ని సమకూరుస్తాయి. ప్రకృతే నిన్ను అక్కునజేర్చుకుంది; మంది గుర్తించక పోతే పోనీ.…
-
ఈ లోకంతో మనం అతిగా ప్రవర్తిస్తున్నాం… విలియమ్ వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి
వర్డ్స్ వర్త్ ప్రముఖ ప్రకృతి కవి. పారిశ్రామిక విప్లవం మనుషులలో తీసుకువచ్చిన భౌతికవాదానికి… అంటే ప్రకృతిని తన ఉనికికి మూలకారణమైన చేతన శక్తిగా కాక, తాత్కాలిక ప్రయోజనాన్ని కలిగించే వనరుగా చూడడం అతనికి నచ్చదు. ఈ భౌతిక సుఖాలవేటలో పడిన మనిషి దృశ్యమాన జగత్తులోని అందాలకి పరవశించి తన హృదయాన్ని ఉన్నతంగా చేసుకోగలిగే అవకాశాన్ని కోల్పోతున్నాడని అతని ఆరోపణ. ఈ కవితలో “మనిషి తన తెలివితేటలని, జీవితాన్ని డబ్బుసంపాదనకి పణం పెట్టి, తను భాగమైన ఈ అనంతప్రకృతిని…
-
Ember-Thief… Sikhamani, Telugu, Indian Poet
WISH ALL MY FRIENDS WELL WISHERS AND BLOG VIEWERS A VERY HAPPY AND PROSPEROUS NEW YEAR 2019 *** Sitting under a leaf-less tree On the footpath And sweating profusely, An old man was parching The cobs of Maize on coals. More than his face His chafing-dish Seemed cooler on scrutiny. As he took…
-
All through my youth…!… Mohan Rushi, Telugu Poet
Some people are such: They enliven our lives, Bring the rhythmic beat of our heart to a standstill; Culture new dreams in us with their mock anger; Pass on wisdom of books through their silence; And bare our impoverishment of vocab to us, when we try to speak. Does it really matter where they are?…
-
Hallucination… Wahed, Telugu Poet
Before I met you Everything was so unnatural. And, “Two Two’s” were just Four! … I met you ‘Two Two’s ‘ had become Two Lakhs. I could understand the logic behind Maths. And my feet floated in the seventh Heaven Even Darkness had appeared in its splendid Spectral hues. The Rosebud-Heart blossomed.…