Hallucination… Wahed, Telugu Poet 

Before I met you

Everything was so unnatural.

And, “Two Two’s” were just Four!  

 

…

 

I met you

‘Two Two’s ‘ had become Two Lakhs. 

I could understand the logic behind Maths. 

And my feet floated in the seventh Heaven

Even Darkness had appeared in its splendid Spectral hues.

The Rosebud-Heart blossomed.

And the fatigued life

Comforted under the shades of eyelids

And the yearning Jasmine-looks

Wafted their incense all around.

…

I could get you.

Again, like the ox of an oil ghanni 

‘Two Two’s are Four’ started ringing in my mind.

 

My feet were firm on the ground;

The sky was beyond my reach.

While blood streams through my veins

It fails to swell in my eyes as tears

Nor burns sweating through my pores.

.

 

Abd Wahed.

 

Telugu Poet

From “Dhuli Chettu” Anthology

 

 

Abd Wahed
Photo Courtesy: Abd Wahed

 

 

హాల్యూసినేషన్

 

నిన్ను కలవకముందు

అంతా కృత్రిమమే

రెండురెళ్ళు నాలుగే

…

నువ్వు కలిసావు

రెండు రెళ్ళు రెండు లక్షలయిపోయాయి

లెక్కలు బుర్రకెక్కాయి

నేల ఆకాశాన్ని తాకింది

చీకటి సప్తవర్ణాల్లో మెరిసింది.

గుండె గులాబీ పూచింది

కనురెప్పనీడలో

ప్రాణం సేదదీరింది.

కనుచూపుల సన్నజాజులు

హాయిపరిమళాలు పరిచాయి

…

నువ్వు నాకు దక్కావు

బుర్రలో మళ్ళీ

రెండురెళ్ళు నాలుగే తిరుగుతుంది గానుగెద్దులా.

 

నేల నేలమీదే ఉంది, ఆకాశం అందడం లేదు.

రక్తం శరీరంలో ప్రవహిస్తానంటోందేకాని

కంటినీరుగా ఉబకటంలేదు

వంటి చమటగా మండడం లేదు.

.

వాహెద్

 

ధూళిచెట్టునుండి

స్పందించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.