All through my youth…!… Mohan Rushi, Telugu Poet
Some people are such:
They enliven our lives,
Bring the rhythmic beat of our heart to a standstill;
Culture new dreams in us with their mock anger;
Pass on wisdom of books through their silence;
And bare our impoverishment of vocab to us, when we try to speak.
Does it really matter where they are? Who they belong to?
Or, flutter in the skies like a pennon of pleasure?
Just a look at their photo freezes us; and,
We fall head over heels listening to them over phone
And search for Nostradamus’ predictions of magical charms
That might seize us should we meet them face to face.
*
Only thereafter, life has turned interminable by degrees,
And unfathomably busy. A disquieting ache used to rattle every chance encounter.
And whenever I felt that I might not see you again
Life seemed to cease with tremors of unknown whelming fears.
.
Mohan Rushi
From “Square One” Anthology.
Image Courtesy: Mohan Rishi
నీ కోసం యవ్వనమంతా…!
మరి అట్లా ఉంటారు కొందరు. జీవితాన్ని ఆనందభరితం చేసేందుకు.
హృదయం లయను స్టాండ్ స్టిల్ చేసేందుకు.
కసురుతూకూడా లోలోపల కొత్త కలల్ని మొలిపించేందుకు.
మాట్లాడకుండానే పుస్తకాలు చెప్పేందుకు.
మరి, మాట్లాడుతున్నప్పుడు మాటలకరువు వచ్చేలా చేసేందుకూ.
ఎక్కడ ఉంటేనేం? ఎవరికి దక్కితేనేం? వాళ్ళకి వాళ్ళు
ఏ నిజమైన ఆనందపుబావుటాయై నింగిలో రెపరెపలాడితేనేం?
ఫోటో చూసినా ఫోటో అయిపోతాం. ఫోన్లో మాట్లాడినా
పొంగిపొర్లే సంతోషంతో పల్టీలు కొడ్తాం.
ఎదురుపడితే ఏం మాయ జరుగుద్దోనని ఏ నోస్ట్రడామస్ నో ఆరాలు తీస్తాం.
*
తర్వాత్తర్వాతే జీవితం అంతుచిక్కనిదయ్యింది.
చిక్కని జీవితమయ్యింది. కనపడ్డప్పుడల్లా ప్రాణం
అతలాకుతలమయ్యింది. నువు కనిపించవేమోనని అనిపించినప్పుడల్లా
జీవితం మునుపెరుగని వణుకుతో ఆగిపోతుందేమోనని అనిపించింది!
.
మోహన్ రుషి
తెలుగు కవి
స్క్వేర్ వన్ నుండి.
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి