రాళ్ళకి అనుభూతి ఉంటుందా? మేరీ ఓలివెర్ , అమెరికను కవయిత్రి

రాళ్ళకి అనుభూతులు ఉంటాయా?

తమ జీవితం వాటికి రుచిస్తుందా?

లేక వాటి ఓరిమి అన్ని అనుభూతుల్నీ అధిగమిస్తుందా?

 

నేను అలా సముద్రపొడ్డున షికారు వెళ్తున్నపుడు

తెల్లవీ, నల్లవీ, రంగురంగులవీ ఏరి తెస్తుంటాను.

“మరేం ఫర్వా లేదు, మిమ్మల్ని ఇక్కడికి తెస్తా,” అని

వాటికి హామీ ఇచ్చి, అలాగే తీసుకువస్తాను.

 

కొమ్మ కొమ్మనీ కవితలా విస్తరించుకుంటూ

ఎదిగిపోయే చెట్టు, తన ఎదుగులకి హర్షం ప్రకటిస్తుందా?

 

తమలోపలి నీటిభాండాల్ని ఖాళీ చేసినందుకు మొయిళ్ళు సంతసిస్తాయా?

 

ప్రపంచంలో చాలా మంది  అలాంటి అవకాశం లేదనే అంటారు.

 

అటువంటి నిశ్చయానికి రావడాన్ని నేను అంగీకరించను.

తప్పయితే, అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు.

.

మేరీ జేన్ ఓలివర్

అమెరికను కవయిత్రి (సెప్టెంబరు 10, 1935- జనవరి 17, 2019)

 

Do Stones Feel?

 

Do stones feel?

Do they love their life?

Or does their patience down out everything else?

 

When I watlk on the beach I gather a few

white ones, dark ones, the multiple colors.

Don’t worry, I say, I’ll bring you back, and I do.

 

Is the tree as it rises delighted with its many

branches,

each like a poem?

 

Are the clouds glad to unburden their bundles of rain?

 

Most of the world says no, no, it’s not possible.

 

I refuse to think to such a conclusion.

Too terrible it would be, to be wrong.

.

Mary (Jane) Oliver,

(September 10, 1935 – January 17, 2019) was an American poet.

Winner of ‘National Book Award’ and ‘Pulitzer Prize.’

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.