Poor Richard’s Almanac 36… Benjamin Franklin, American

  1. Marry your son when you will but marry your daughter when you can.

 

         అబ్బాయికి మీకు తోచినపుడు పెళ్ళి చెయ్యండి. అమ్మాయికి మాత్రం ఎప్పుడు వీలయితే అప్పుడు చెయ్యండి.   

 

  1. Mary’s mouth costs her nothing, for she never opens it but at other’s expense.

 

          మేరీ తిండికి ఖర్చు లేదు. కారణం, ఆమె ఇతరుల ఖర్చుమీద తప్ప నోరు తెరవదు. 

 

  1. Meanness is the parent of insolence.

 

          తలపొగరు అల్పత్వం నుండి పుడుతుంది.

 

  1. Men and melons are hard to know.

 

          మగాళ్ళూ, కర్బూజాలూ పక్వానికొచ్చాయో లేదో అంచనా వెయ్యడం కష్టం.

 

  1. Men differ daily about things which are subject to sense, is it likely that they should agree about things visible?

 

            ఇంద్రియాలద్వారా అనుభూతి చెందగలిగిన వాటి విషయంలో మనుషులు రోజూ విభేదిస్తారు.

            అలా అని, కంటికి కనిపిస్తున్న వాటి విషయంలో ఏకీభవిస్తారనా?

 

  1. Men meet, mountains never.

 

          మనుషులు కలుస్తారు, మహాపర్వతాలు ఎన్నడూ కలవవు.

 

  1. Men often mistake themselves, seldom forget themselves.

 

          పురుషులు తమ విషయంలో తరచు పొరపడుతుంటారు. కానీ, తమని తామెన్నడూ మరచిపోరు.

 

  1. Men take more pains to mask than mend.

 

          లోపాలు సరిదిద్దుకోవడం కంటే, కప్పిపుచ్చుకుందికే పురుషులు తాపత్రయ పడతారు.

 

  1. Money and good manners make the gentleman.

 

           సంపద, మంచి నడవడి, మంచి వ్యక్తిత్వంగల మనుషులని సృష్టిస్తాయి.

 

  1. Money and man a mutual friendship show: man makes false money; money makes man so.

 

          మనిషికీ – ధనానికీ మధ్య సమసంబంధ సామ్యం ఉంది:

          మనిషి నకిలీ ధనాన్ని సృష్టిస్తాడు, ఆ ధనం మనిషిని తనలా తయారు చేస్తుంది.