రాత్రికి వెయ్యి కళ్లు… ఫ్రాన్సిస్ విలియం బోర్డిలాన్, ఇంగ్లీషు కవి

రాత్రికి వెయ్యి కళ్లున్నాయి
పగటికి ఉన్నది ఒక్కటే
అయితేనేం, ధగద్ధగల ప్రపంచపు వెలుగు
సూర్యాస్తమయంతో సరి.

మనసుకి వెయ్యి కళ్లున్నాయి
హృదయానికి ఉన్నది ఒక్కటే
అయితేనేం, జీవితపు మొత్తం వెలుగు
ప్రేమ నశిస్తే, నశిస్తుంది.
.
ఫ్రాన్సిస్ విలియం బోర్డిలాన్
మార్చి 22, 1852 -జనవరి 13, 1921)
ఇంగ్లీషు కవి , అనువాదకుడు

 

The Night Has A Thousand Eyes

The night has a thousand eyes,
And the day but one;
Yet the light of the bright world dies
With the dying sun.

The mind has a thousand eyes,
And the heart but one:
Yet the light of a whole life dies
When love is done.
.

Francis William Bourdillon
(22 March 1852 – 13 January 1921)
English Poet, translator.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.