Poor Richard’s Almanac 35… Benjamin Franklin, American

341. Many a man would be worse if his estate had been better.

 

            మరింత ఆస్తిపరులై ఉంటే, చాలామంది ప్రవర్తన ఇప్పటికంటే ఘోరంగా ఉండేది.

 

342. Many complain of their memory, few of their judgement.

 

         జ్ఞాపకశక్తి బాగులేదని మొరపెట్టే వారే గాని, తమ వివేచన గురించి ఒక్కరూ మాటాడరు.

 

343. Many dishes, many diseases.

 

          ఎన్నో భక్ష్యాలు; ఎన్నో రోగాలు. 

 

344. Many estates are spent in getting.

 

          ఎన్నో ఆస్తులు, వాటిని సంపాదించడానికే కరిగిపోయాయి. 

 

345. Many foxes grow grey, but few grow old.

 

          చాలా గుంటనక్కలు రంగు నెరుస్తాయి కానీ, కొన్నే వయసుమీరుతాయి. 

 

 346. Many have quarreled about the religion that never practiced it.

 

         తామెన్నడూ అనుసరించని మతంకోసం చాలామంది మనుషులు కొట్టుకుంటారు.

 

347.  Many medicines, few cures.

 

         ఔషధాలు లెక్కలేనన్ని; స్వస్థత చేకూర్చేవి కొన్నే. 

 

348. Many a prince sin with David, but few repent with him.

 

         డేవిడ్ తో కలిసి పాపం చెయ్యడానికి అందరు రాజులూ సిద్ధం. పశ్చాత్తాపానికి కొందరే.

 

349. Many would live by their wits but break for want of stock.

 

        చాలామంది తమ తెలివితేటలను నమ్ముకుని జీవించడానికి ప్రయత్నిస్తారు. కానీ సరుకు నిండుకుని మధ్యలో       

        భంగపడతారు.

 

350. Marry above your match, and thou shalt get a master.

 

         మీ అంతస్తుకు మించిన సంబంధం చేసుకు చూడండి— త్వరలో మీ మీద అజమాయిషీకి ఒకరు తయారు.